తెలంగాణ రాష్ట్ర ఆధికార పార్టీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ కుమారుడిపై బీజేపీ నేత తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై మంత్రి పువ్వాడ అజయ్ ఫైరయ్యారు. కొందరు చిన్న పిల్లలపై అత్యంత నీచంగా మాట్లాడుతున్నారని, ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి సహనంతో ఉన్నామని వ్యాఖ్యానించారు. అటు ధాన్యం కొనుగోళ్లపై కేంద్రానిది అసత్య ప్రచారమని విమర్శించారు. బండి సంజయ్ ఎందుకు దీక్ష చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
Read More »అంకుల్ అని పిలిచినందుకు యువతిని దారుణంగా..?
ఉత్తరాఖండ్లో జరిగిన ఓ ఘటన వైరల్ గా మారింది. తనను ‘అంకుల్’ అని పిలిచిందని 18 ఏళ్ల అమ్మాయిని.. 35 ఏళ్ల ఓ వ్యక్తి చితకబాదాడు. ఆవేశంతో ఊగిపోయిన అతడు.. విచక్షణ మరిచి అమ్మాయిని ఇష్టారీతిన కొట్టాడు. అతడి దెబ్బలకు తీవ్ర గాయాలపాలైన ఆ అమ్మాయి ఆస్పత్రిలో అడ్మిట్ అయింది. ప్రస్తుతం వెంటిలేటర్పై చికిత్స పొందుతోంది. ఇలా, ఓ వ్యక్తిని అంకుల్ అని పిలవడం ఆ యువతి ప్రాణాల మీదకు …
Read More »ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం విడుదల
తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది. ఒక్కో రైతు కుటుంబానికి రూ.6 లక్షల చొప్పున మొత్తం 133 కుటుంబాలకు రూ.7.95 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు విపత్తుల నిర్వహణశాఖ జీవో జారీ చేసింది. అత్యధికంగా వికారాబాద్ జిల్లాలో 27, యాదాద్రిలో 23, భూపాలపల్లిలో 12 కుటుంబాలకు పరిహారం రిలీజ్ చేశారు.
Read More »ఒమిక్రాన్ గురించి Good News
ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ పై ఢిల్లీకి చెందిన వైద్య నిపుణులు ఊరటనిచ్చే విషయం చెప్పారు. ఇప్పటివరకు మన దేశంలో ఒమిక్రాన్ సోకిన వారిలో దాదాపు 90% మందిలో ఎలాంటి లక్షణాలు లేవు. వారికి చికిత్సలు కూడా అందించాల్సిన అవసరం లేదని లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ సురేశ్ తెలిపారు. ఒమిక్రాన్ వచ్చినా త్వరగా కోలుకుని డిశ్చార్జ్ అవుతున్నారని చెప్పారు. కాగా, ఇప్పటివరకు దేశంలో 415 ఒమిక్రాన్ కేసులు …
Read More »వడివేలుకు కరోనా
ప్రముఖ తమిళ హాస్య నటుడు వడివేలుకు కరోనా సోకింది. ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇటీవలే వడివేలు లండన్ నుంచి తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ఒమిక్రాన్ వేరియంట్ బారినపడినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం వడివేలు నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు.
Read More »ఈ లక్షణాలుంటే రక్తహీనత మీకున్నట్లే..?
రక్తహీనతను తెలియజేసే కొన్ని లక్షణాలను గమనిస్తూ ఉండండి. ఆరోగ్యకరమైన ఎర్ర రక్తకణాలు తగ్గితే అలసట వచ్చేస్తుంది. రక్తహీనత, ఐరన్ లోపంతో ఏకాగ్రత లోపిస్తుంది. కండరాలు అలసిపోయి, నొప్పులు వేధిస్తాయి. జ రక్తప్రవాహం, రక్తకణాలు తగ్గడం మూలంగా చర్మం పాలిపోతుంది. మూత్రం గులాబీ లేదా ఎరుపు రంగులోకి మారుతుంది. తరచూ ఇన్ఫెక్షన్లు వచ్చినా రక్తహీనత ఉన్నట్లే. ఈ సమస్యలు కనిపిస్తే.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
Read More »గోంగూరతో లాభాలెన్నో..?
గోంగూరతో రక్త ప్రసరణ మెరుగుపడి రక్తపోటు అదుపులో ఉంటుంది. గోంగూరను తీసుకుంటే మధుమేహాన్ని నియంత్రించవచ్చు. దీనిలోని విటమిన్ A వల్ల కంటికి సమస్యలు తొలగిపోతాయి. గోంగూరలోని B కాంప్లెక్స్, C విటమిన్లతో దంత సమస్యలు తగ్గుతాయి. గోంగూరలో ఫోలిక్ యాసిడ్, మినరల్స్ అధికం. యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తాయి. దగ్గు, ఆయాసం, తుమ్ములుంటే గోంగూర సహజ ఔషధంలా పనిచేస్తుంది. రేచీకటి ఉన్నవారు తరచూ గోంగూర తీసుకోవాలి.
Read More »మంత్రి ఎర్రబెల్లి కి కరోనా
తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కరోనా బారిన పడ్డారు. ఇటీవల ఢిల్లీలో వారం రోజులు పర్యటించి, నిన్న రాత్రి హైదరాబాద్ మహానగరానికి వచ్చిన మంత్రి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. రోనా చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు.
Read More »ఏపీలో ఒమిక్రాన్ కలవరం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్లో మరో 2 కొత్త కేసులు నమోదయ్యాయి. దక్షిణాఫ్రికా, యూకే నుంచి వచ్చిన ప్రకాశం, అనంతపురం జిల్లా వాసులకు ఒమిక్రాన్ సోకినట్లు నిర్ధారణ అయింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 6కి చేరింది. ఇదిలా ఉండగా.. విదేశాల నుంచి 67 మంది రాష్ట్రానికి వచ్చారు. వారిలో 12 మందికి కరోనా సోకినట్లు తేలింది.
Read More »అందులో ఏపీ ముందు
ఏపీలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో 8 సూచికల ఆధారంగా ర్యాంకింగ్ ఇచ్చారు. ఈ విభాగంలో 0.634 స్కోరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలవగా, 0.413 స్కోరుతో తెలంగాణ 7వ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాల వార్షిక వృద్ధి రేటు 2019లో 6.3% ఉండగా 2021లో 11.3%కి చేరింది. ఉద్యాన విభాగంలో ఉత్పత్తి వార్షిక వృద్ధి రేటు 4.7%నుంచి 12.3%కి పెరిగింది. పాల ఉత్పత్తి …
Read More »