ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 29,228 కరోనా టెస్టులు చేయగా 132 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. నిన్న కరోనాతో ఒకరు మరణించారు. మొత్తం కేసులు సంఖ్య 20,75,108కు చేరగా ఇప్పటివరకు 14,468 మంది చనిపోయారు. గత 24 గంటల్లో 186 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,823 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »దేశంలో ఒమిక్రాన్ కలవరం
దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా ఒక్క మహారాష్ట్రలోనే 8 కేసులు వచ్చాయి. ఈ ఉదయం ఢిల్లీలో 4, రాజస్థాన్లో 4 కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ ఒక్కరోజే దేశంలో 16 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 57కు పెరిగింది. ఇప్పటివరకు 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు వచ్చాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది.
Read More »తెలంగాణలో థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు సిద్ధం
తెలంగాణలో థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని.. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన ఆయన.. 21 లక్షల హోమ్ ఐసోలేషన్ కిట్లు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పరిస్థితుల పరిశీలనకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని, 545 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రజలు మాస్కులు ధరించాలని, రెండు డోసుల వాక్సిన్ తీసుకోవాలని మంత్రి హరీష్ సూచించారు.
Read More »ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ వరాల జల్లు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ ఉత్తరాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. 18 ఏళ్లు దాటిన మహిళలందరికీ ప్రతి నెలా రూ.1,000 ఇస్తామని హామీ ఇచ్చారు. ‘నేను నాయకుడిని కాదు. రాజకీయాలు ఎలా చేయాలో నాకు తెలీదు. పని ఎలా చేయాలో మాత్రమే తెలుసు. ఢిల్లీలో 10 లక్షల మందికి ఉద్యోగాలిచ్చాం. ఇక్కడ కూడా అదే విధంగా చేస్తాం’ అని తెలిపారు.
Read More »పాకిస్తాన్ ఘనవిజయం
వెస్టిండీస్ తో జరిగిన ఉత్కంఠభరిత రెండో టీ20లో పాకిస్తాన్ విజయం సాధించింది. చివరి ఓవర్లో 23 రన్స్ అవసరం కాగా విండీస్ 13 రన్స్ మాత్రమే చేయగల్గింది. దీంతో పాక్ 9 రన్స్ తేడాతో గెలిచింది. 3 టీ20ల సిరీసు మరో మ్యాచ్ ఉండగానే కైవసం చేసుకుంది. అంతకుముందు పాక్ 20 ఓవర్లలో 172/8 రన్స్ చేసింది. కాగా, ఈ క్యాలెండర్ ఇయర్లో పాకిస్తాన్కు ఇది 19వ విజయం. చివరి …
Read More »ఆలస్యంగా నిద్రపోతే..?
సాధారణంగా ఆలస్యంగా నిద్రపోతే, లేట్ గా మేల్కొంటారు. దీంతో నిద్రను ప్రభావితం చేసే విటమిన్-డి శరీరానికి తగినంత అందదు. విటమిన్-D లోపం డిప్రెషన్కు దారితీస్తుంది. ఇది నిద్ర నాణ్యతపై ఎఫెక్ట్ చూపిస్తుంది. పగటిపూట నిద్రపోవాలనిపించడం డిప్రెషన్ సంకేతాలలో ఒకటి. ఆందోళన, డిప్రెషన్ నిద్రను తగ్గిస్తాయి. వీటికి తోడు.. మైగ్రేన్, ఆర్థరైటిస్ వంటి సమస్యలు వస్తాయి. సో.. స్లీప్ సైకిల్ని సరిగ్గా మేంటేయిన్ చేయండి.
Read More »సీఎం కేసీఆర్ తో సీఎం స్టాలిన్ భేటీ
తమిళనాడు పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ తో అద్భుతమైన సమయాన్ని గడిపినట్లు ఆరాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. సీఎం కేసీఆర్ తనను మర్యాదపూర్వకంగా కలిశారని చెప్పారు. కాగా ఈ భేటీలో నదీజలాల వివాదాలు, ధాన్యం కొనుగోళ్లు, కేంద్రంలో ఉన్న బీజేపీ వైఖరి.. తదితర అంశాలపై కేసీఆర్, స్టాలిన్ చర్చించినట్లు తెలిసింది. అటు ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్తో సీఎం కేసీఆర్ ఇవాళ …
Read More »ఏపీ డిప్యూటీ సీఎం కి అస్వస్థత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే శ్రీకాకుళం జేమ్స్ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ముక్కు నుంచి రక్తస్రావం జరిగిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు.
Read More »కివీ పండ్లపై కేంద్రం సంచలన నిర్ణయం
ఇరాన్ నుంచి కివీ పండ్ల దిగుమతిని కేంద్రం నిషేధించింది. తెగుళ్లు సోకిన కివీ పండ్లు దిగుమతి అవుతుండటంతో నిషేధించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ నుంచి దేశంలోకి వచ్చిన 22 సరుకుల్లో తెగులు ఉన్న పండ్లను గుర్తించినట్లు చెప్పారు. దీంతో కివీ పండ్లను పంపొద్దని ఇరాన్కు విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. అయినా ఆ పండ్లు దిగుమతి అవుతుండటంతో నిషేధం విధించినట్లు తెలిపారు.
Read More »పోలవరం పనులు వేగవంతం చేయాలి
ఏపీలో పోలవరం ప్రాజెక్టు పనులను మరింత వేగవంతం చేయాలని మంత్రి అనిల్కుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఈనెల 20న DDRP (డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్) సమావేశం ఉంటుందన్నారు. ఈ సమావేశంలో ప్రాజెక్టుకు సంబంధించిన డయాఫ్రమ్వాల్, కోతకు గురైన జెట్ గ్రౌటింగ్ డిజైన్లను ఆమోదించుకోవాలని సూచించారు. డిజైన్లు ఆమోదం పొందిన వెంటనే పనులను వేగవంతం చేయాలన్నారు.
Read More »