కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు వ్యతిరేకంగా సాగిన రైతు ఉద్యమంలో మరణించిన ఏడు వందల మంది రైతుల కుటుంబాలకు రూ.మూడు లక్షలు చొప్పున ఆర్థికసాయం అందిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం అభినందనీయమని అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ప్రశంసించింది. రైతుల కుటుంబాలకు సాయం చేయడం చిన్న విషయం కాదని, రైతులకు ప్రభుత్వం అండగా నిలవడం గొప్ప విషయమని వ్యాఖ్యానించింది. రైతుల నుంచి వడ్లను తక్షణమే కొనుగోలు …
Read More »Bollywood లోకి అఖండ
తెలుగులో అఖండ విజయాన్ని అందుకున్న ‘అఖండ’ సినిమాపై బాలీవుడ్ ఇండస్ట్రీ కన్నేసిందని టాక్. అఘోరా క్యారెక్టర్, డైలాగ్స్, యాక్షన్ సీన్స్ ఓ రేంజ్లో ఉండటంతో రీమేక్ రైట్స్ కొనాలని సాజిద్ నడియాడ్ లాంటి ప్రొడ్యూసర్లు ప్లాన్ చేస్తున్నారట. ఈ కథకు కొంచం కమర్షియల్ టచ్ ఇస్తే మంచి హిట్ అవుతుందని భావిస్తున్నారట. ఇందులో హీరోగా అక్షయ్ కుమార్ లేదా అజయ్ దేవ్ ను లాంటి స్టార్లను తీసుకోవాలని చూస్తున్నట్లు సమాచారం.
Read More »డిసెంబర్ 9న స్టార్ హీరోయిన్ పెళ్ళి
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి పనులు చకచకా జరుగుతున్నాయి. డిసెంబర్ 9న వీరి వివాహం రాజస్థాన్లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ జరగనుంది. తాజాగా కత్రినా.. విక్కీ ఇంటికి వెళ్లడంతో పెళ్లితంతు మొదలైనట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే సెలబ్రెటీలకు ఆహ్వానం అందింది. కానీ కత్రినా మాజీ లవర్స్ సల్మాన్ ఖాన్, రణ్వీర్కు, విక్కీ ఎక్స్ గర్ల్ఫ్రెండ్ హర్లీన్ సేతికి ఇన్విటేషన్ రాలేదట.
Read More »‘సెమీన్యూడ్ ఫొటోషూట్’ పై పాయల్ రాజ్ పుత్ క్లారిటీ
హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఇటీవల చేసిన ఓ ‘సెమీన్యూడ్ ఫొటోషూట్’ తీవ్రమైన ట్రోలింగ్ కి దారి తీసింది. ఇన్నాళ్లు సైలంట్ గా ఉన్న పాయల్.. తాజాగా ఆ ఫొటోషూట్పై స్పందించింది. ఫొటోషూట్ అన్నాక పొరపాట్లు జరుగుతుంటాయని చెప్పింది. ‘ఈ ట్రోల్స్ నా కుటుంబం ఇబ్బంది పడింది. ఇంటికి తిరిగి రావాలని మా అమ్మ నన్ను కోరింది. అయితే.. నాకు దీన్ని ఎదుర్కొనే శక్తి ఉందని అమ్మతో చెప్పాను’ అని …
Read More »సీఎం అరవింద్ కేజీవాల్ మహిళలపై హామీల వర్షం
గోవా ప్రచార సభలో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజీవాల్ మహిళలపై హామీల వర్షం కురిపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ను గెలిపిస్తే 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.వెయ్యి ఇస్తామని ప్రకటించారు. అలాగే గృహ ఆధార్ స్కీం కింద ఇస్తున్న రూ.1500లను రూ.2500కు పెంచనున్నట్లు ఆయన తెలిపారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మహిళా సాధికార పథకంగా నిలుస్తుందని కేజీవాల్ అన్నారు.
Read More »Big Boss హౌస్ నుంచి ప్రియాంక సింగ్ ఎలిమినేట్
ఊహించినట్టే 13వ వారంలో Big Boss హౌస్ నుంచి ప్రియాంక సింగ్ ఎలిమినేట్ అయింది. అయితే షో నుంచి వెళ్లిపోతున్నానన్న బాధ కంటే మానసు దూరమవుతున్నానన్న బాధే ఆమెలో ఎక్కువ ఉన్నట్లు కనిపించింది. మరోవైపు పింకీ వారానికి రూ.1.75 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు తీసుకుందనే టాక్ వినిపిస్తోంది. దీంతో మొత్తంగా 13 వారాలకు దాదాపు రూ.25 లక్షలు వెనకేసుకున్నట్లు తెలుస్తోంది.
Read More »తులసి ఆకులతో లాభాలు ఎన్నో..?
తులసి ఆకులతోపాటు గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా వీటిలో ఉండే ఫ్లేవనాయిడ్స్, ఫినాలిక్.. రోగనిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడతాయి. దీంతో అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం తక్కువగా ఉంటుంది. అలాగే తులసి గింజల్లో ప్రొటీన్స్, ఫైబర్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటి వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరిగి మలబద్ధకం దూరం అవుతుంది. ఈ గింజలు తింటే ఆకలి అనుభూతి తగ్గి బరువు కూడా తగ్గే అవకాశం …
Read More »మీకు జుట్టు రాలడం సమస్యగా ఉందా..?
ఈ రోజుల్లో జుట్టు రాలడం చాలామందికి ప్రధాన సమస్యగా మారింది. అయితే, జుట్టు సమస్యలకు ఉసిరి చెక్ పెడుతుంది. కురులు తెల్లబడకుండా, సన్నబడకుండా, చుండ్రు రాకుండా, చిట్లి పోకుండా ఉండేందుకు పోషణనిస్తుంది. ఇందుకోసం పరగడుపునే ఉసిరికాయలు తినాలి. నాన్-సీజన్లో ఎండబెట్టిన ఉసిరి, మురబ్బా తీసుకోవాలి. ఉసిరి పచ్చడి తిన్నా పోషకాలు అందుతాయి. ఇందులోని విటమిన్-C.. పొటాషియం, సోడియం, ఐరన్ మీ జుట్టును ఆరోగ్యంగా మారుస్తాయి.
Read More »ఉదయాన్నే నిద్రలేవగానే ఇవి చేయకూడదు
ఉదయాన్నే నిద్రలేవగానే కొన్ని చూడకూడదని అంటారు పెద్దలు. కొందరు వీటిని మూఢనమ్మకాలుగా కొట్టిపారేసినా.. మరికొందరు సీరియస్ గానే పట్టించుకుంటారు. ఇక, వాస్తు శాస్త్రం ప్రకారం.. … నిద్ర లేవగానే పాడైపోయిన వాచీ చూడకూడదు లేచిన వెంటనే అద్దంలో చూసుకోవడం అశుభం ఉదయమే శుభ్రపర్చని పాత్రలు చూస్తే.. ఆర్థిక సమస్యలు వస్తాయట జంతువుల్ని చూడటం కూడా మంచిది కాదట . నిద్రలేవగానే నీడను చూసుకోవద్దని వాస్తు శాస్త్రం చెబుతోంది
Read More »అన్నం తిన్నాక ఇది చేయకూడదు..?
చాలామంది ఆహారం తీసుకోగానే అది అరగడానికి నడుస్తుంటారు. అయితే, ఇది జీర్ణక్రియపై ప్రభావం చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. సో.. తిన్న వెంటనే నడవడం సరికాదట. భోజనం తర్వాత శరీరం ఆహారాన్ని జీర్ణం చేసేందుకు ఎక్కువ శక్తిని వాడుతుంది. అందుకే ఆ సమయంలో ఎక్కువ శక్తిని ఉపయోగించే పనులు ఏవీ చేయకూడదు. అలా చేయడం వల్ల జీర్ణశక్తి తగ్గుతుంది. తప్పనిసరైతే కాస్త నెమ్మదిగా నడవాలని చెబుతున్నారు నిపుణులు.
Read More »