నిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల కోటాలో పన్నెండు ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్ఎస్ అధిష్టానం ప్రకటించిన జాబితాలో చివరి గంటల్లో ఇద్దరు అభ్యర్థులు మారిపోయారు. నిజామా బాద్ జిల్లా నుంచి తొలుత ఆకులు లలితను ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు లీకులు ఇచ్చాయి. కానీ ఢిల్లీలో మకాం వేసిన పార్టీ అధినేత కేసీఆర్ ఆకస్మికంగా ఆమె స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును ఖరారు చేశారు. ఉమ్మడి మహబూబ్ …
Read More »ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి నామినేషన్
ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. వరంగల్ కలెక్టరేట్ లో ఈ ఎన్నిక అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి విశ్వ నారాయణకు ఈ రోజు నామినేషన్లు అందించారు. కాగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రెండు నామినేషన్లు వేయగా, పోచంపల్లి తరపున మరో రెండు నామినేషన్లు పడ్డాయి.మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే అరూరి రమేశ్ తో కలిసి ఒక సెట్, …
Read More »MLC ఎన్నికలకు BJP దూరం.
తెలంగాణలో జరుగుతున్న స్థానిక సంస్థల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి బీజేపీ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్.. ఇతర ముఖ్యనేతలతో సమావేశమై ఈమేరకు చర్చించినట్లు సమాచారం. అభ్యర్థులను నిలబెట్టినా పార్టీకి జిల్లాల్లో ఓట్లు వచ్చే అవకాశం లేకపోవడంతో పోటీకి దూరంగా ఉండటమే ఉత్తమమని బీజేపీ భావిస్తోంది. కాగా, మొత్తం 12 స్థానాల్లో డిసెంబర్ 10న ఎన్నికలు జరగనున్నాయి.
Read More »AIRTEL కస్టమర్లకు Big Shock
ప్రముఖ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్టెల్ తమ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ప్రీపెయిడ్ ఛార్జీల (టారిఫ్) ను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎంట్రీ టారిఫ్ వాయిస్ ప్లాన్లపై 20%, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ప్లాన్లపై 25% వరకు పెంచనున్నట్లు తెలిపింది. ఛార్జీల పెంపు వల్ల ఒక్కో యూజర్పై వచ్చే సగటు ఆదాయం (Average Revenue Per User) రూ. 200-300కు చేర్చాలని భావిస్తోంది. పెరిగిన ఆదాయం 5G అమలుకు ఉపయోగపడుతుందని పేర్కొంది.
Read More »చంద్రబాబు భార్య భువనేశ్వరి గురించి వ్యాఖ్యలపై YSRCP MLA క్లారిటీ
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబు భార్య భువనేశ్వరి గురించి తానేమీ మాట్లాడలేదని, చంద్రబాబే అనవసరంగా ఆమెను రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి (కాకినాడ) అన్నారు. అసెంబ్లీలో జరిగింది వేరు, బయట ప్రచారం చేస్తున్నది వేరని వ్యాఖ్యానించారు. నందమూరి కుటుంబం, భువనేశ్వరి అంటే తనకు గౌరవముందని చెప్పారు. కాగా, ‘లోకేశ్ ఎలా పుట్టాడో తెలుసా?’ అంటూ అసెంబ్లీలో ద్వారంపూడి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
Read More »మూడు రాజధానులపై AP సర్కారు సంచలన నిర్ణయం
ఏపీకి మూడు రాజధానులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంది. బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. వీకేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లును మంత్రివర్గం రద్దు చేసిందని పేర్కొన్నారు. దీనిపై సీఎం జగన్ మరికాసేపట్లో అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారు.
Read More »Junior NTR ఫ్యాన్స్ కు పండుగలాంటి వార్త
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న పాన్ ఇండియా మూవీకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇందులో జూనియర్ NTRకు జోడీగా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ను తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తొలుత కియారా అద్వానీని సెలెక్ట్ చేయనున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆమె స్థానంలో జాన్వీ వచ్చింది. దీనిపై చిత్రబృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. …
Read More »దేశంలో కొత్తగా కరోనా కేసులు 8 వేలు
దేశంలో రోజువారీ కరోనా కేసులు 8 వేలకు దిగివచ్చాయి. గతేడాది మార్చి తర్వాత ఇంత తక్కువ కేసులు నమోదవడం ఇదే తొలిసారి. రోజువారీ కేసులు 538 రోజుల కనిష్ఠానికి చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 8488 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,45,18,901కి చేరాయి. ఇందులో 3,39,34,547 మంది కరోనా నుంచి కోలుకోగా, 4,65,911 మంది మరణించారు. …
Read More »జైభీమ్ నటి సంచలన వ్యాఖ్యలు
తమిళనాడులో జరిగిన నిజఘటనను ఆధారంగా చేసుకుని రూపొందిన చిత్రం జై భీమ్. హీరో సూర్య ఈ సినిమాను భార్య జ్యోతికతో కలిసి నిర్మించడమే కాదు.. అందులో లాయర్ చంద్రు పాత్రలో నటించి ప్రశంసలు కూడా అందుకున్నారు . ఇక పోలీస్ లాకప్‌లో చనిపోయిన బాధితుడు రాజన్న భార్య సినతల్లి పాత్రలో నటించిన మలయాళ సుందరి లిజోమోల్ జోస్ పాత్ర కూడా ఎంతో మందిని ఆకర్షించింది. ఈ పాత్ర కోసం తాను …
Read More »హీరోగా మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి సోదరుడు
ఏ రంగంలో అయిన వారసుల హవా తప్పక ఉంటుంది. సినీ పరిశ్రమలో అయితే అదీ మరి ఎక్కువ. కొందరు స్టార్స్ తమ వారసులని లేదంటే తమ్ముళ్లు, కజిన్స్‌ని వెండితెరకు పరిచయం చేస్తూ ఉంటారు. తాజాగా టాలీవుడ్ నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి సోదరుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. శివారెడ్డి పలు వేదికపై నవ్వించడంతో పాటు సినిమాల్లో కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. శివారెడ్డి సోదరుడు …
Read More »