నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సాగిన ఉద్యమం ఫలించిందని, ఇది అన్నదాతలు సాధించిన విజయంగా అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అభివర్ణించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో రైతులు చేసిన సుధీర్ఘ పోరాటానికి కేంద్ర దిగిరాక తప్పలేదన్నారు. రైతులకు మద్ధతుగా… వ్యవసాయ చట్టాలకు వ్యతిరేఖంగా సీయం కేసీఆర్ చేపట్టిన ఉద్యమ సెగ ఢిల్లీకి తగిలిందని తెలిపారు. సీయం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నదాతలకు …
Read More »దేశంలో కొత్తగా 11,106 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 11,106 కేసులు నమోదవగా, మరో 459 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,44,89,623కు చేరగా, మరణాలు 4,65,082కు పెరిగాయి. మొత్తం కేసుల్లో 3,38,97,921 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 1,26,620 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, కొత్తగా నమోదైన కేసుల్లో సగానికిపైగా కేరళలోనే ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కేరళలో నిన్న 6,111 మంది కరోనా బారినపడ్డారు.
Read More »ప్రధానమంత్రి నరేందర్ మోదీ సంచలన నిర్ణయం
అన్నదాతలు విజయం సాధించారు. ఎట్టకేలకు కేంద్రం దిగివచ్చింది. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సాగిన ఉద్యమం ఫలించింది. మూడు కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. ఇవాళ జాతిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అయితే ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయాల్లోనూ వెనక్కి తగ్గని మోదీ సర్కార్.. అన్నదాతల ఆగ్రహానికి తలొగ్గింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు.. నూతన సాగు చట్టాలను రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. …
Read More »అందంతో మత్తెక్కిస్తున్న మాళవికా మోహనన్
సాఫ్ సీదా ముచ్చట.. వడ్లు కొంటరా..? కొనరా..?- మోదీకి కేసీఆర్ సూటి ప్రశ్న
రైతులకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒకటే మాట.. ఏం జరుగుతోంది. ఏంది గడబిడి ఇది. లొల్లి ఏంది అసలు. ఒకటే ఒక మాట. సాఫ్ సీదా ముచ్చట. తెలంగాణలో పండించే వడ్లు కొంటరా..? కొనరా..? అది చెప్పమంటే.. మేం మరాఠీలో అడిగామా? ఉర్దూలో అడిగామా? అర్థం కాని భాషలో అడిగామా? అని కేసీఆర్ ప్రశ్నించారు. ఇందిరా పార్క్ వద్ద టీఆర్ఎస్ …
Read More »అవసరమైతే ఢిల్లీకి యాత్ర – సీఎం కేసీఆర్
అద్భుతమైన పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నాం. ఈ క్రమంలో ఈ రోజు తెలంగాణ రైతాంగం ఉత్పత్తులను కొనుగోలు చేయాలని, రైతుల ప్రయోజనాలను రక్షించుకోవాలని ఈ యుద్ధాన్ని ప్రారంభించాం అని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇందిరా పార్క్ వద్ద టీఆర్ఎస్ మహాధర్నాలో కేసీఆర్ ప్రసంగించారు. హైదరాబాద్ నగరంతో ప్రారంభమైన ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదు. అవసరమైతే ఢిల్లీ వరకు కూడా యాత్ర చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎక్కడిదాకా అయినా సరే పోయి …
Read More »దేశంలో కొత్తగా 11,919 కరోనా కేసులు
దేశంలో గడిచిన 24గంటల్లో 12,32,505 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 11,919 మందికి వైరస్ సోకినట్లు తేలింది. కేసుల్లో మళ్లీ వృద్ధి కనిపించింది. 11,242 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం మొత్తం కేసులు 3.44 కోట్లకు చేరగా 3.38 కోట్ల మంది వైరస్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.28 శాతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం 1,28,762 మంది మహమ్మారితో బాధపడుతున్నారు.
Read More »కేంద్రంపై యుద్ధానికి శ్రీకారం.. అంతం కాదిది ఆరంభం మాత్రమే- సీఎం కేసీఆర్
తెలంగాణ రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతుల మహాధర్నాకు సంఘీభావంగా విచ్చేసిన పార్టీ ప్రజాప్రతినిధులందరికీ సీఎం కేసీఆర్ స్వాగతం తెలిపారు. ఇందిరా పార్కు వద్ద చేపట్టిన రైతు మహాధర్నాలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.ధర్మంగా, న్యాయంగా వ్యవసాయం చేసి దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింది. కేంద్రం విధానాల వల్ల మన రైతాంగం దెబ్బతినే అవకాశం ఉంది. నేటి కేంద్ర ప్రభుత్వం రైతాంగం, వ్యవసాయం పట్ల …
Read More »పొదల్లోకి తీసుకెళ్లి నటిపై లైంగిక దాడికి యత్నం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని కేబీఆర్ పార్కులో తనపై జరిగిన దాడి వివరాలను నటి షాలూ చౌరాసియా వెల్లడించింది. ‘ఈనెల 14న సా. కేబీఆర్ పార్కులో వాకింగ్ కి వెళ్లాను. తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. మనీ డిమాండ్ చేశాడు. నగదు లేదని రూ.10వేలు ఫోన్ పే చేస్తా నంబర్ చెప్పమన్నా. నంబర్ చెబుతుంటే నేను 100కు డయల్ చేయబోయా. ఇది గమనించి …
Read More »రాశీఖనాకు బంఫర్ ఆఫర్
టాలీవుడ్ లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న రాశీ ఖన్నా బాలీవుడ్లోనూ మంచి ఆఫర్లు కొట్టేస్తోంది. ఇప్పటికే షాహిద్ ‘సన్నీ’, అజయ్ దేవగణ్ ‘రుద్ర’లో నటించిన ఈ ముద్దుగుమ్మకు కరణ్ జోహర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘యోధ’ అనే యాక్షన్ ఫ్రాంచైజీలో ఓ లీడ్ రోల్ దక్కిందట. సిద్ధార్థ్ మల్హోత్రా, దిశా పటానీ వంటి నటులు ఇందులో నటిస్తున్నారు. పుష్కర్ ఓజా ఈ ఫ్రాంచైజీతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు.
Read More »