ఆపన్నులకు అందుబాటులో ఉంటూ ఆదుకునే కేటీఆర్ గారి చొరవతో మరో కుటుంబానికి అండ దొరికింది, కరీంనగర్‌కు చెందిన కదాసి అనూష కుమారుడు 17 నెలల విశ్వకు రెండు నెలల క్రితం గుండె ఆపరేషన్ జరిగింది. చాలా క్లిష్టమైన ఈ ఆపరేషన్‌కు అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు అయింది. బాధిత కుటుంబం సహాయం కోసం మంత్రి కేటీఆర్‌ను ట్విట్టర్ ద్వారా అర్థించింది. వెంటనే స్పందించిన కేటీఆర్ స్థానిక మంత్రి అయిన గంగుల …
Read More »మొక్కలు నాటిన మంత్రులు పువ్వాడ,ఎర్రబెల్లి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ఖమ్మం కార్పొరేషన్ వెలుగుమట్ల అర్బన్ ఫారెస్ట్ నందు అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2వేల పండ్లు, పూలు, వివిధ రకాల మొక్కలను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు గారు మొక్కలు నాటి ప్రారంభించారు. ఎంపీ నామా నాగేశ్వరరావు గారు, మేయర్ పునుకొల్లు నీరజ గారు, …
Read More »మణిశర్మ బర్త్ డే స్పెషల్ -నారప్ప పాట విడుదల
స్వర బ్రహ్మ మణిశర్మ ఒకప్పుడు అద్బుతమైన బాణీలతో శ్రోతలను ఎంతగా అలరించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.మధ్యలో కాస్త గ్యాప్ ఇచ్చిన ఆయన ఇప్పుడు వరుస సినిమాలతో సందడి చేస్తున్నాడు. చిరంజీవి ఆచార్య, వెంకటేష్ నారప్ప, గోపిచంద్ సీటీమారం, రామ్ 19వ చిత్రాలతో బిజీగా ఉన్నారు.అయితే మణిశర్మ బర్త్ డే సందర్భంగా నారప్ప చిత్రం నుండి చలాకీ చిన్మమ్మి అనే సాంగ్ విడుదల చేశారు. ఈ సాంగ్ శ్రోతలని ఎంతగానో అలరిస్తుంది.నారప్ప చిత్రం …
Read More »మత్స్యకారులందరికీ బీమా ధీమా
మత్స్య సహాకారం సంఘాల్లో నమోదైన సభ్యులందరికీ ప్రమాద బీమా పథకం వర్తింప జేయనున్నట్టు మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. ఇందుకు సంబంధించి మత్స్యకారులు చెల్లించాల్సిన ప్రీమియ మొత్తాన్ని వారి తరఫున ప్రభుత్వమే చెల్లిస్తదని స్పష్టంచేశారు. మరణించిన మత్స్యకార కుటుంబాలకు శనివారం హైదరాబాద్ హరిత ప్లాజాలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఇన్సూరెన్స్ చెక్కులను అందజేశారు. మొత్తం 105 మంది మత్స్యకార కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఇచ్చారు. ఈ సందర్భంగా …
Read More »బ్రాహ్మణుల సంక్షేమం కోసం 112 కోట్లు
బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనివిధంగా పెద్దఎత్తున సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నది. అర్చకుల దగ్గర్నుంచి విద్యార్థులు, నిరుద్యోగుల వరకు వివిధ పథకాలను అమలుచేస్తూ గత నాలుగేండ్లలో రూ.112 కోట్లకుపైగా ఖర్చుపెట్టింది. ఈ ఏడాది జనవరి నాటికి ఈ పథకాల వల్ల 3,637మందికి లబ్ధి చేకూరింది. ఈ ఏడాది బెస్ట్ స్కీమ్ కింద మరో 500మంది నిరుద్యోగులు, వివేకానంద విదేశీవిద్య పథకం కింద 100 మందికి ఆర్థిక సహాయం …
Read More »మాజీ మంత్రి ఈటలపై ఎమ్మెల్యే బాల్క సుమన్ ఫైర్
పదవులన్నీ అనుభవించి తల్లిలాంటి పార్టీని, తండ్రిలాంటి కేసీఆర్‌ను ఈటల రాజేందర్ మోసం చేశాడని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మండిపడ్డారు. గరీబోళ్ల భూములను కబ్జా చేసి, ఫిర్యాదులపై విచారణకు ఆదేశించగానే పార్టీ ఫిరాయించారని విమర్శించారు. నల్ల చట్టాలను చేసిన బీజేపీలో చేరి దొంగలతో దోస్తానా చేశాడని నిప్పులు చెరిగారు. శనివారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో సోషల్ మీడియా వారియర్స్ సమావేశానికి బాల్క సుమన్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ …
Read More »దేశంలో 42,766 కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శనివారం 42,766 కేసులు నమోదవగా, తాజాగా 41 పైచిలుకు రికార్డయ్యాయి. ఇది నిన్నటికంటే 2 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 41,506 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల్లో 4,54,118 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 2,99,75,064 మంది బాధితులు కోలుకున్నారు. మరో 4,08,040 మంది మృతిచెందారు. కాగా, నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు 41,526 …
Read More »వైఎస్ షర్మిలకు మంత్రి హారీష్ కౌంటర్
తెలంగాణ ఇచ్చేందుకు అదేమైనా బీడీయా? సిగరెట్టా? అంటూ వెటకారాలు చేసిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వారసులకు ఈ గడ్డపై స్థానం లేదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని సిగరెట్, బీడీలతో పోల్చిన వైఎస్ వారసులకు తెలంగాణ గడ్డ మీద జాగ ఉంటదా? అని ప్రశ్నించారు. శనివారం సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో ఎంపీపీ యాదమ్మ, ఆరుగురు సర్పంచ్‌లతోపాటు, కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో …
Read More »సరికొత్తగా హాట్ బ్యూటీ కాజల్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అందాల రాక్షసి… చందమామ బ్యూటీ…ఇటీవల పెళ్లైన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ‘రౌడీ బేబీ’ అనే సినిమాతో రిస్క్ చేయబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పెళ్ళి తర్వాత విభిన్న కథా చిత్రాలలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ప్రస్తుతం ‘ఆచార్య’, నాగార్జున – ప్రవీణ్ సత్తారు సినిమా, ‘ఇండియన్ 2’లతో పాటు తమిళంలో కొత్త ప్రాజెక్ట్స్, వెబ్ సిరీస్‌లను కమిటవుతోంది. ఇందులో భాగంగానే …
Read More »తెలంగాణలోనే తొలిసారిగా మహబూబాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఫరీద్ వినూత్న కార్యక్రమం
తనదైన స్టైల్ లో వినూత్న కార్యక్రమాలతో ప్రజలకు నిత్యం అండగా ఉండే రాష్ట్రంలోని మహబూబాబాద్ మునిపిపాలిటీ వైస్ చైర్మన్ మహ్మద్ ఫరీద్ త్వరలో ఓ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వారి సన్నిహితుల ద్వారా తెలి సింది. అక్షరాస్యులు, నిరక్షరాస్యులు అనే తేడా లేకుం డా ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ ధ్రువీకరణ పత్రాలు అవ సరం. అవి సమయానికి అందక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. కులం, ఆదాయం. నివాసం, పుట్టిన …
Read More »