టీపీసీసీ అధ్యక్షుడి నియమాకంపై కాంగ్రెస్ అధిష్ఠానం మరో సారి దృష్టి సారించింది. అతి త్వరలో టీపీసీసీపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. పంజాబ్ పార్టీలోని వివాదాన్ని పరిష్కరించేందుకు ఏర్పాటైన కమిటీ ఒక ఫార్ములాను రూపొందించిందని, దీన్ని అమలు చేసిన వెంటనే తెలంగాణపై దృష్టి సారించే అవకాశం ఉందని ఢిల్లీలో పార్టీ ముఖ్య నేత కేసీ వేణుగోపాల్ చెప్పారు. కాగా, టీపీసీసీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న రేవంత్‌రెడ్డి …
Read More »MLA పదవీకి ఈటల రాజీనామా
మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి నేడు రాజీనామా చేశారు. గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళ్ళులర్పించిన అనంతరం అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మేట్‌లో ఉన్న తన రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శికి ఈటల అందజేశారు. కాగా.. నేటి సాయంత్రం ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. 14న జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ప్రత్యేక విమానంలో …
Read More »సమంత కొడుకుగా స్టార్ హీరో తనయుడు
సమంత అక్కినేని ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’. పాన్ ఇండియన్ సినిమాగా గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఇందులో మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడుగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో శకుంతల కొడుకు పాత్ర ఉండగా, దీనికి ఎన్టీఆర్ పెద్ద కొడుకు అభయ్ రామ్ లేదా అల్లు అర్జున్ కొడుకు అయాన్‌లలో ఒకరిని తీసుకునే ఆలోచనలో గుణశేఖర్ ఉన్నారట. వీరిలో ఎవరు నటించినా, చైల్డ్ ఆర్టిస్టుగా మంచి లాంచింగ్ …
Read More »పవన్ మూవీలో వివి వినాయక్
సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి నటిస్తున్న మల్టీస్టారర్ ఏకే తెలుగు రీమేక్‌లో డైరెక్టర్ వి వి వినాయక్ గెస్ట్‌గా కనిపించబోతున్నాడట. ఒరిజినల్ వర్షన్‌లో డైరెక్టర్ సాచీ క్యామియో రోల్‌లో కనిపించారు. ఇప్పుడు ఇదే రోల్‌లో వినాయక్ నటించనున్నట్టు తెలుస్తోంది. ఈయన గతంలో ‘ఠాగూర్’. ‘నేనింతే’. ‘ఖైదీ నెం. 150’ చిత్రాల్లో కనిపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వినాయక్ ప్రధాన పాత్రలో …
Read More »ఈటల రాజీనామాకు ముహూర్తం ఖరారు
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవి రాజీనామాకు ముహూర్తం ఖరారైంది. రేపు ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేయనున్నారు. ఈ నెల 14న ఈటల బీజేపీలో చేరతారని ఇప్పటికే ఆ పార్టీ ముఖ్యనేతలు వెల్లడించిన సంగతి తెలిసిందే. శనివారం నాడు మొదట.. నగరంలోని గన్‌పార్క్ దగ్గర రేపు అమరవీరుల స్థూపానికి ఈటల నివాళులు అర్పించనున్నారు. అనంతరం అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయానికి వెళ్లి …
Read More »విభిన్న పాత్రలో రాశిఖన్నా
వినూత్న కథాంశాల్ని ఎంచుకొని పాత్రలపరంగా వైవిధ్యాన్ని ప్రదర్శించడానికి కథానాయికలకు వెబ్ సినిమాలు మంచి వేదికలుగా నిలుస్తున్నాయి. సమంత, తమన్నా వంటి అగ్ర నాయికలు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ మీద సత్తాచాటడంతో మరికొంత మంది తారలు వారి మార్గాన్ని అనుసరిస్తున్నారు. తాజాగా పంజాబీ సుందరి రాశీఖన్నా డిజిటల్ వేదికపై కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అజయ్‌దేవ్‌గణ్‌తో కలిసి ఆమె ‘రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్’ అనే వెబ్ సిరీస్ చేస్తోంది. రాజేష్ దర్శకుడు. …
Read More »పెళ్లిపై తాప్సీ క్లారిటీ
అప్పుడెప్పుడో విడుదలైన ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాప్సీ ఇక్కడ పెద్దగా రాణించలేకపోయింది. దీంతో కోలీవుడ్‌లోను తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడ కూడా నిరాశే ఎదురు కావడంతో బాలీవుడ్ చెక్కేసింది. ఇప్పుడు అక్కడ బిజీ హీరోయిన్స్‌లో ఒకరిగా మారింది. ఎక్కువగా మహిళా ప్రాధాన్యత చిత్రాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తుంది తాప్సీ. అయితే ఈ అమ్మడు డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మాథ్యూస్‌తో పీకల్లోతు ప్రేమలో ఉంది. …
Read More »దేశంలో కొత్తగా 91,702 పాజిటివ్ కేసులు
దేశంలో కరోనా ఉధృతి తగ్గుతున్నది. వరుసగా నాలుగో రోజు లక్షకు దిగువన పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. గడిచిన 24 గంటల్లో 91,702 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్తగా 1,34,580 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారని పేర్కొంది. మరో 3,403 మంది వైరస్ బారినపడి ప్రాణాలు వదిలారని తెలిపారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,92,74,823కు పెరిగింది. …
Read More »కరోనా వ్యాధి లో సిటి స్కాన్ (CT Scan) గురించి కచ్చితంగా తెలుసుకోవలసినవి..
*కరోనా వ్యాధి లో CT స్కాన్ (సిటీ స్కాన్) గురించి కచ్చితంగా తెలుసుకోవలసినవి* ? ఇవాళ చాలామందికి కరోనా ఉన్నదా ? లేదా ? అని తెలుసుకోవడానికి మరియు కరోనా జబ్బు వచ్చిన తర్వాత ఎలా ఉంది , ఎంత తీవ్రత వుంది అని తెలుసుకోవడానికి సిటీ స్కాన్ చేస్తున్నారు. ఈ సిటీ స్కాన్ లో రెండు పదాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి *CORADS* రెండు *CT severity …
Read More »తెలంగాణలో కొత్తగా 1,798 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,798 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 14 మంది మృతి చెందారు. 2,524 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 23,561 పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇవాళ 1,30,430 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
Read More »