Home / rameshbabu (page 742)

rameshbabu

ఈటలతో భేటీపై కిషన్ రెడ్డి క్లారిటీ

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ తాను భేటీ అయ్యానన్న వార్తలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ‘ఇప్పటివరకు ఈటల నన్ను కలవలేదు. నన్ను కలిసేందుకు సంప్రదించిన మాట వాస్తవమే. ఈటల, నేను 15 ఏళ్లు కలిసి పనిచేశాం. కలిస్తే తప్పేంటి? కలిసినంత మాత్రాన పార్టీలో చేరేందుకు అనుకోలేం. ఎప్పుడు కలుస్తున్నామన్నది ఇంకా నిర్ణయించుకోలేదు. పార్టీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం’ అని కిషన్ రెడ్డి అన్నారు.

Read More »

సరికొత్త పాత్రలో దీపికా

ప్రముఖ దర్శకనిర్మాత సంజయ్ లీలా భన్సాలీ – హీరోయిన్ దీపికా పదుకొణె కాంబినేషన్లో మరో సినిమా రూపొందనుందని సమాచారం. ఈ చిత్రంలో బందిపోటు రూపమతి పాత్రలో దీపిక నటించనుందని, దీనికి ‘బైజు బావ్రా’ అనే టైటిల్ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. 2022 ద్వితీయార్థంలో ఈ సినిమా ట్రాక్ ఎక్కుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి కలయికలో ఇప్పటికే 3 సినిమాలు వచ్చాయి.

Read More »

ప్రతిరోజూ 3 లవంగాలను తింటే

ప్రతిరోజూ 3 లవంగాలను తింటే రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు ఇన్ఫెక్షన్ల బారి నుంచి తప్పించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల షుగర్ రోగుల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్ అవుతాయట. గ్యాస్, అసిడిటీ, నోటి దుర్వాసన సమస్యలు తగ్గుతాయి. చిటికెడు లవంగాల పొడి కలిపిన పాలు తాగితే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందని పేర్కొన్నారు.

Read More »

తెలంగాణలో కొత్తగా 3,821 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 3,821 కరోనా కేసులు వెలుగుచూశాయి. మరో 23 మంది మరణించారు. ఫలితంగా కరోనా కేసుల సంఖ్య 5,60,141కు పెరిగింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా ధాటికి 3,169 మంది మరణించారు. కొత్తగా 4,298 మంది కోలుకోగా, రికవరీల సంఖ్య 5,18,266కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 38,706 యాక్టివ్ కేసులున్నాయి. తాజా కేసుల్లో GHMCలో 537 నమోదయ్యాయి.

Read More »

కొవిడ్ వ్యాక్సినేష‌న్.. తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం

కొవిడ్ వ్యాక్సినేష‌న్ విష‌యంలో తెలంగాణ రాష్ర్ట ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఈ నెల 28 నుంచి సూప‌ర్ స్ప్రెడ‌ర్స్‌కు కొవిడ్ టీకా ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. ముందుగా జీహెచ్ఎంసీ ప‌రిధిలోని ఆటో డ్రైవ‌ర్లు, బ‌స్సు డ్రైవ‌ర్లు, హోట‌ల్స్, సెలూన్ల సిబ్బంది, కూర‌గాయ‌ల వ్యాపారులు, కిరాణా దుకాణ‌దారులు, హ‌మాలీల‌కు టీకాలు వేయాల‌ని నిర్ణ‌యించింది. ఈ క్ర‌మంలోనే కొవిడ్ వ్యాక్సినేష‌న్‌పై మంత్రి హ‌రీష్ రావు అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన స‌మావేశంలో సూప‌ర్ స్ర్పెడ‌ర్ల‌కు టీకాలు …

Read More »

అసలు టూల్‌కిట్‌ రభస ఏమిటి?

సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారంతో, విద్వేష జాఢ్యంతో ప్రతిపక్షాలపై నిత్యం విషం గక్కే బిజెపి, కాషాయ పరివారం ఈ సారి తాను తవ్వుకున్న గోతిలో తానే పడింది. – దేశాన్ని, ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రతిష్టను దిగజార్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధం చేసుకున్న టూల్‌కిట్‌ చూడండి అంటూ ఎఐసిసి అధికారిక లెటర్‌ హెడ్‌ కాపీగా ఒక పత్రాన్ని జతచేసి ‘కాంగ్రెస్‌టూల్‌కిట్‌ ఎక్స్‌పోజ్డ్‌’ హ్యాష్‌ట్యాగ్‌తో బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో సహా …

Read More »

ఏపీలో కాస్త తగ్గిన కరోనా కేసులు

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 58,835 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 12,994 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారినపడి 96 మంది మృతి చెందారు. మరోవైపు కరోనా నుంచి కోలుకొని 18,373 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,03,762 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా గత 24 గంటల్లో తూర్పు గోదావరిలో అత్యధికంగా 2652 కేసులు రాగా.. అత్యల్పంగా కృష్ణా జిల్లాలో 274 కేసులు నమోదయ్యాయి.

Read More »

సమంత అందుకే అది చేయలేదంట

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత తెలుగుతో పాటు దక్షిణాది ఇండస్ట్రీల్లో మంచి పేరు తెచ్చుకుంది. స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్నా.. ఒక్క హిందీ సినిమాలో కూడా నటించని ఆమె, ఇటీవల ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్లో నటించింది. ఇన్నాళ్లూ హిందీ సినిమాలకు ఎందుకు సైన్ చేయలేదన్న ప్రశ్నకు స్పందించిన ఆమె.. ‘ఏమో భయం అయ్యిండొచ్చు’ అని బదులిచ్చింది. అటు ఇకపై బాలీవుడ్ …

Read More »

గ్రీన్ టీ తాగితే…?

గ్రీన్ టీ తాగడం వలన అనేక లాభాలున్నయంటున్నారు నిపుణులు.అయితే గ్రీన్ టీ తాగడం వలన కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. జీర్ణక్రియ మెరుగవుతుంది గుండె సమస్యలు తగ్గుతాయి. త్వరగా బరువు తగ్గుతారు క్యాన్సర్లను నివారిస్తుంది ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది రక్తపోటును నియంత్రిస్తుంది. రోగనిరోధకశక్తిని పెంచుతుంది.

Read More »

నాపై అవన్నీ పుఖార్లే

ప్రస్తుతం ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా సెకండ్ వేవ్ తగ్గిన వెంటనే నాగార్జున ‘బంగార్రాజు’ ప్రాజెక్టును లాంఛ్ చేసేందుకు సిద్ధం అవుతుంది.. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్లో పాయల్ రాజ్పుత్ కనిపించబోతోందని వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన పాయల్.. ‘అవన్నీ పుకార్లే. నేను ఎలాంటి ఐటెంసాంగ్ చేయడం లేదు’ అని తెలిపింది. కాగా సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి సీక్వెల్గా వస్తున్న ఈ సినిమాను కల్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat