బాహుబలి, రేసుగుర్రం, దువ్వాడ జగన్నాథం’ తదితర చిత్రాల్లో బాలనటుడిగా కనిపించిన సాత్విక్ వర్మ హీరోగా మారాడు. క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలో సాగే ‘బ్యాచ్’లో అతను హీరోగా నటించాడు. దర్శకుడు శివ మాట్లాడుతూ ‘‘ఇదొక యూత్‌ఫుల్ కాలేజీ ఎంటర్‌టైనర్. పోకిరీ కుర్రాళ్లు క్రికెట్ బెట్టింగ్‌లో ఏం చేశారన్నది కథ’’ అని చెప్పారు. ‘‘చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉందీ సినిమా. త్వరలో విడుదల చేస్తాం’’ అని నిర్మాత రమేశ్ ఘనమజ్జి …
Read More »కంటతడిపెట్టిన సోను సూద్
కరోనా బాధితుల పాలిట ఆపద్బాంధవుడు సోనూ సూద్ ఓ ఇంటర్వ్యూలో కంటతడిపెట్టాడు. ప్రస్తుత పరిస్థితుల్లో తన తల్లిదండ్రులు బ్రతికుండి బెడ్లు, ఆక్సిజన్ కోసం పోరాడుతుంటే తాను తట్టుకోలేకపోయేవాడినని భావోద్వేగానికి గురయ్యాడు. కాగా సోనూ తండ్రి శక్తి సాగర్ సూద్ పంజాబ్లో వ్యాపారం చేసేవారు. ఆకలితో ఉన్నవారికి సోనూతో కలిసి సాయం చేసేవారు. ఇక సోనూ తల్లి సరోజ్ పేదలకు ఉచితంగా చదువు చెప్పేవారు. అనారోగ్యంతో కొంతకాలం క్రితం వారు కన్నుమూశారు.
Read More »మాజీ మంత్రి ఈటల భూబాగోతంపై మరో దర్యాప్తు
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జా వ్యవహారం లో ముఖ్యమంత్రి KCR కు మరో ఫిర్యాదు అందింది. ఈటెల రాజేందర్ కుమారుడు ఈటెల నితిన్ రెడ్డి తన భూమి కబ్జా చేశారనీ,తనకు న్యాయం చేయాలని కోరుతూ, మేడ్చల్ మండలం రావల్ కోల్ గ్రామ నివాసి పీట్ల మహేష్ ముదిరాజ్ సీఎం కెసిఆర్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై తక్షణమే దర్యాప్తు ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన …
Read More »ఓ దృఢ సంకల్పం ఘన విజయం సాధించి నేటికి రెండేళ్లు
రాజకీయ కుట్రలకు ఎదురు నిలిచిన ఆ గుండె ఘన విజయం సాధించి రెండేళ్లు. ఆ గుండె చప్పుడుకు ప్రత్యర్ధి కోటలు బద్దలై ఇప్పటికీ కోలుకోలేదు. ప్రజలకు సేవ చేయాలనే చిత్తశుద్ధి ఉన్న నాయకుడు పాలనా పగ్గాలు చేపడితే ప్రభుత్వ పథకాలు ఎలా ఉంటాయో ఈ రెండేళ్లలో చూశాం. పారదర్శకతతో కూడిన పాలన ఎలా ఉంటుందో చూస్తున్నాం. ప్రజలకు సేవ చేసుకునే అవకాశం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ఇంట్లో కూర్చుంటే రాలేదు. …
Read More »జలుబు త్వరగా తగ్గాలంటే..?
సొంఠి, మిరియాల పొడి, తులసి ఆకులను నీటిలో మరిగించి, ఆ నీటిలో తేనె కలిపి రోజూ 3 సార్లు తాగాలి -స్పూన్ తేనెలో దాల్చిన చెక్క పొడిని కలుపుకుని తాగితే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు వేడినీటిలో ఉప్పు వేసుకుని పుక్కిలించాలి. అలాగే వెల్లుల్లిని నమిలి మింగడం వల్ల జలుబు తగ్గుతుంది వేడి నీటిలో పసుపు వేసి ఆవిరి పట్టుకోవాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే జలుబు …
Read More »తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 2,242 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరో 19 మంది మరణించారు. ఫలితంగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 5,53,277 కు చేరింది. మొత్తంగా 3,125 మంది మృతి చెందారు. కొత్తగా 4,693 మంది కోలుకోగా, రికవరీ సంఖ్య 5,09,663 కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 40,489 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »కృతి సనన్ కు తప్పని ఆ కష్టాలు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో,యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన ‘ఆదిపురుష్ ‘లో సీతగా నటిస్తోంది హీరోయిన్ కృతి సనన్. ఆమె చిత్రసీమలో అడుగుపెట్టి ఏడేళ్లు పూర్తైన సందర్భంగా ఓ భావోద్వేగ పోస్టు చేసింది. ‘నటిని అవుతానని ఊహించలేదు. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చాను. మొదట్లో చాలా ఇబ్బందులు పడ్డాను. కొన్ని చేదు అనుభవాలు, అవమానాలు ఎదురయ్యాయి. ఇప్పటికైనా సక్సెస్ రావడం సంతృప్తిగా ఉంది. ఇష్టమైన పాత్రలు దక్కుతున్నాయి’ …
Read More »ఆ హీరోతో నటించాలని ఉందంటున్న సమంత
వెండితెరపై అందంతో ఆకట్టుకునే హీరోయిన్ సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ వెబ్ సిరీస్లో నెగటివ్ షేడ్స్ ఉన్న డీగ్లామరస్ పాత్ర చేసింది. ఈ ప్రాజెక్టు ప్రమోషన్లలో సామ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. బాలీవుడ్లో చాలా టాలెంట్ ఉందని కొనియాడింది. ఇంకా అవకాశమొస్తే రణ్ బీర్ కపూర్తో కలిసి నటించాలని ఉందని తెలిపింది. కాగా సామ్ ప్రస్తుతం తెలుగులో ‘శాకుంతలం’, తమిల్లో ‘కాతు వాకులా రెండు కాదల్ అనే చిత్రాలు …
Read More »RGV ఇంట్లో విషాదం
వివాదస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ సోదరుడు పి. సోమశేఖర్ ఆదివారం కరోనాతో కన్నుమూశారు. ఇటీవల ఆయనకు కరోనా సోకగా హైదరాబాద్లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ‘ముస్కురాకే దేఖ్ జరా’ అనే బాలీవుడ్ మూవీకి దర్శకుడిగా పనిచేసిన ఆయన రంగీలా, దౌడ్, సత్య, జంగిల్, కంపెనీ వంటి సినిమాలకు ప్రొడక్షన్ బాధ్యతలు నిర్వర్తించారు. కాగా తన జీవితంలో కీలకమైన వ్యక్తులలో సోమశేఖర్ ఒకరని RGV పలు సందర్భాలలో చెప్పారు.
Read More »తెలంగాణలో కొత్తగా 3,308 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. రాష్ర్టంలో కొత్తగా 3,308 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 21 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. 4,723 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్‌ర్టంలో ప్రస్తుతం 42,959 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇవాళ 63,120 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 513, ఖమ్మం జిల్లాలో …
Read More »