Breaking News
Home / CRIME / మాజీ మంత్రి ఈటల భూబాగోతంపై మరో దర్యాప్తు

మాజీ మంత్రి ఈటల భూబాగోతంపై మరో దర్యాప్తు

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జా వ్యవహారం లో ముఖ్యమంత్రి KCR కు మరో ఫిర్యాదు అందింది.

ఈటెల రాజేందర్ కుమారుడు ఈటెల నితిన్ రెడ్డి తన భూమి కబ్జా చేశారనీ,తనకు న్యాయం చేయాలని కోరుతూ, మేడ్చల్ మండలం రావల్ కోల్ గ్రామ నివాసి పీట్ల మహేష్ ముదిరాజ్ సీఎం కెసిఆర్ కు ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదుపై తక్షణమే దర్యాప్తు ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సీఎం కెసిఆర్ ఆదేశించారు. ఈ మేరకు ఎసిబి విజిలెన్స్, రెవెన్యూ శాఖలు సమగ్ర దర్యాప్తు జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని సీఎం కెసిఆర్ ఆదివారం ఆదేశించారు.