తెలంగాణ రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ లను ప్రభుత్వం నియమించింది. సీఎం శ్రీ కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీలు, యుజిసి నిబంధనలకు అనుగుణంగా, రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ ల నియామక ప్రక్రియను చేపట్టి పేర్లను సూచించింది. కరోనా నేపథ్యంలో కొంత ఆలస్యం జరిగినా, నిబంధనల ప్రకారం అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి చేసి గవర్నర్ ఆమోదం కోసం సిఫారసు చేయడం జరిగింది. …
Read More »విదేశీ విద్యానిధి కోసం దరఖాస్తునకు జూన్ 15వ తేదీ వరకు గడువు
తెలంగాణలోని ఎస్టీ విద్యార్థుల ఉన్నత విద్య కోసం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి స్కీంను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న విషయం విదితమే. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అర్హులైన ఎస్టీ విద్యార్థుల నుంచి ఎస్టీ సంక్షేమ శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎస్టీ విద్యార్థుల విదేశీ విద్యానిధి కోసం దరఖాస్తునకు జూన్ 15వ తేదీ వరకు గడువు విధించారు. అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం రూ. …
Read More »ఆ స్టార్ హీరోయిన్ కూతురుతో మహేష్
తెలుగు సినిమా ఇండస్ట్రీ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు.. ఈ మూవీ అనంతరం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేయనున్నాడు. త్రివిక్రమ్-మహేష్ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారనే వార్తలు వస్తుండగా.. ఒక హీరోయిన్ పూజా హెగ్దే పేరు ఫిక్స్ అయ్యింది. మరో హీరోయిన్ జాన్వీకపూర్ పేరు తెరపైకి రాగా.. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.
Read More »జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త..కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్.. తెలుగులో మరో క్రేజీ ఆఫర్ను కొట్టేసినట్లు సమాచారం. కొరటాల శివ దర్శకత్వం వహించనున్న ‘ఎన్టీఆర్ 30’ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయట. ప్రస్తుతం శివ దర్శకత్వం వహిస్తున్న ‘ఆచార్య’కు మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్ వ్యవహరిస్తున్నాడు. కొరటాల గత చిత్రాలకు DSP సంగీతమందించాడు.
Read More »పోరాటాలకు సిద్ధమవుతున్న సారా అలీఖాన్
బాలీవుడ్ నటి సారా అలీఖాన్ పోరాటాల కోసం సిద్ధమవుతోంది. గుర్రపు స్వారీ, విలువిద్యలో ట్రైనింగ్ తీసుకుంటోంది. అయితే, ఇదంతా ఓ చిత్రంలో పాత్ర కోసమేనట. ఇటీవల ఆమె విక్కీకౌశల్తో ‘ది ఇమ్మోర్టల్ అశ్వథ్థామ’ చిత్రాన్ని ఒప్పుకుంది. ఇందులో సారా పోషించబోయే పాత్రకు యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయట. అందుకే ఈ పాత్ర కోసం ఆమె కొన్ని నెలలుగా కసరత్తులు చేస్తోంది. ఆదిత్యధర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది.
Read More »తెలంగాణలో ఇక ఉదయం6గం.ల నుండి 10గం.ల వరకే
తెలంగాణ వ్యాప్తంగా కరోనా కట్టడి కోసం ప్రభుత్వం లాక్ డౌన్ విధించగా.. ఆంక్షలు అమల్లో ఉండే ఉ.10 గంటల తర్వాత కూడా ప్రజలు బయటకు వస్తున్నట్లు DGP మహేందర్ రెడ్డి తెలిపారు. ‘ఏ అవసరం ఉన్నా ఉ.6 నుంచి 10 గంటల మధ్యనే బయటకు రావాలి. ఈ 4 గంటల సమయంలోనే ఈ-కామర్స్ సేవలకు అనుమతి ఇస్తాం. లాక్ డౌన్ సమయంలో బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. వాహనాలను …
Read More »మధుప్రియకు తప్పని వేధింపులు
తనకు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ కాల్స్, సోషల్ మీడియా ద్వారా అభ్యంతరకర సందేశాలు పంపిస్తూ వేధిస్తున్నారంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు సింగర్ మధుప్రియ ఫిర్యాదు చేసింది. రెండు రోజులుగా బ్లాంక్ ఫోన్ కాల్స్ వస్తున్నాయని, దీంతో మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. దీనిపై పోలీసులు దర్యాపు చేపట్టారు.
Read More »అందుకే అబ్దుల్ కలాంకు సెల్యూట్
2డీజీ (2-డీయాక్సీ-డీ-గ్లూకోజ్) కొవిడ్ ఔషధాన్ని DRDO గ్వాలియర్ 25 ఏళ్ల క్రితమే రూపొందించిందని ఆ సంస్థ మాజీ శాస్త్రవేత్త డా. కరుణ్ శంకర్ వెల్లడించారు. ఈ 2DG అణువును రూపొందించాలని ఆనాటి DRDO డైరెక్టర్ APJ అబ్దుల్ కలాం సూచించారని తెలిపారు. క్యాన్సర్ చికిత్సలో వాడే దీని కోసం అప్పట్నుంచి USపై ఆధారపడటం తగ్గించామని పేర్కొన్నారు. దీనికి 1998లో పేటెంట్ రాగా.. 2002లో డ్రగ్కు ఆమోదం లభించింది.
Read More »మెగా పవర్ స్టార్ తో త్రివిక్రమ్ భారీ ప్రాజెక్టు
మహేష్ బాబుతో మూవీ కోసం ప్రి ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ మరో భారీ ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. రామ్ చరణ్ తేజ్తో సినిమా చేసేందుకు స్క్రిప్టును సిద్ధం చేశాడట. ప్రస్తుతం ‘RRR’లో నటిస్తున్న మెగా పవర్ స్టార్.. ఆ తర్వాత శంకర్ మూవీలో కన్పిస్తాడు. ఆ తర్వాతే వీరి సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.
Read More »కృతిశెట్టికి అలాంటి మగాళ్లే ఇష్టం
తొలి సినిమాతోనే హిట్ అందుకుని ప్రస్తుతం బిజీ హీరోయిన్ మారిపోయిన కృతి శెట్టి ఓ ఇంటర్వ్యూలో మగాళ్ల గురించి మాట్లాడింది. అబద్ధాలు చెప్పే వారంటే తనకు నచ్చరింది. తాను ఎదురుచూసే మగాడు నిజాయితీగా, బోల్డ్ గా, తనకు ఏదైనా ముఖం మీద చెప్పే ధైర్యం గల వ్యక్తిగా ఉండాలంది.
Read More »