ఎంపీ రఘురామకృష్ణరాజుకు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. అధికారులు ఆయనను గుంటూరు జైలుకు తరలించారు. రఘురామకు పరీక్షలు నిర్వహించిన వైద్య బృందం గుంటూరు జిల్లా కోర్టులో మెడికల్ రిపోర్ట్‌ను సమర్పించింది. కాగా, పథకం ప్రకారం ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారిని కించపరిచే చర్యలకు పాల్పడుతూ సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్న నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ శుక్రవారం అరెస్టు చేసిన సంగతి విదితమే. ఈ కేసులో …
Read More »విజయసాయిరెడ్డికి అనిత కౌంటర్
సీఎంల కుమారులు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలుస్తుంటే చంద్రబాబు కుమారుడు లోకేశ్ మాత్రం ఓడిపోయారని ఎద్దేవా చేస్తూ YCP ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్కు TDP నేత వంగలపూడి అనిత కౌంటరిచ్చారు. YSR, స్టాలిన్, కేసీఆర్, ములాయం కుమారులు గెలిస్తే.. లోకేశ్ ఓడిపోయారని విజయసాయి ట్వీట్ చేశాడు.. దీనికి అనిత .. ‘మీరు చెప్పిన లిస్టులో జైలుకు వెళ్లిన CM కొడుకు ఒక్కడే.. వాయిదాలు తప్పించుకుని తిరుగుతుంది ఆ ఒక్కడే’ అంటూ …
Read More »కరోనా టీకాపై శుభవార్త
ఆస్పత్రుల్లో కరోనా చికిత్స, టీకా కోసం ఆధార్ కార్డు తప్పనిసరి కాదని UIDAI స్పష్టం చేసింది. ఆధార్ లేదన్న కారణంతో ఆస్పత్రుల్లో చేర్చుకోకపోవడం, టీకా, మందులు ఇవ్వకపోవడం లాంటివి చేయకూడదని పేర్కొంది. ఏ వ్యక్తి అయినా, లబ్ధిదారుడైనా ఆధార్ లేకున్నా ఎమర్జెన్సీ సేవలు పొందొచ్చని తెలిపింది. పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు, పింఛన్ డాక్యుమెంట్ చూయించి టీకా వేసుకోవచ్చని పేర్కొంది.
Read More »వీరు గొప్ప మనసు
టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కరోనా రోగుల ఆకలి తీరుస్తున్నాడు. ఢిల్లీలో ఇప్పటివరకు 51,000 మందికి భోజనం పంపిణీ చేశాడు. ఢిల్లీలో కరోనా బారిన పడి, ఆహారం కావాలంటే ట్విట్టర్ ద్వారా డైరెక్ట్ మెసేజ్ చేయాలని కోరాడు. సెహ్వాగ్ అందించే పార్శిళ్లలో చపాతీ, అన్నం, ఓ ఫ్రై, పప్పు, టమాట రైస్ లాంటివి ఉన్నాయి. సెహ్వాగ్ ఫౌండేషన్ తరపున వీరూ ఈ సాయం చేస్తున్నాడు.
Read More »ఆ హీరో కోసం తెగ కష్టపడుతున్న పూజా
అఖిల్ అక్కినేనితో నటిస్తున్న ‘ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’లో స్టాండప్ కమెడియన్గా పూజా హెగ్దే కన్పించనుంది. సన్నివేశాలకు అవసరమైనంత వరకే తన స్టాండప్ స్కిల్స్ చూపించాల్సి ఉంటుందని ఇందుకోసం చాలా హోంవర్క్ చేశానని చెప్పింది. మరే సినిమా కోసం ఈ స్థాయిలో హోంవర్క్ చేసి శ్రమించలేదని పూజా వెల్లడించింది. జీఎ2 బ్యానర్పై బన్నీ వాస్, డైరెక్టర్ వాసు వర్మ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించనున్నారు.
Read More »దేశ వ్యాప్తంగా ఇంటింటి ఫీవర్ సర్వే
ఏపీ ,తెలంగాణ రాష్ట్రాల్లో జరుగుతున్న ఇంటింటి ఫీవర్ సర్వే తరహా సర్వేను దేశవ్యాప్తంగా నిర్వహించాలని ప్రధాని మోదీ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఆశా, అంగన్వాడీ కార్యకర్తల సేవలను వాడుకోవాలన్నారు. సెకండ్ వేవ్ గ్రామాలపై ఎక్కువ ప్రభావం చూపుతుందని, దీన్ని కట్టడి చేసేలా వ్యూహాలు అమలు చేయాలన్నారు.
Read More »పుచ్చకాయ గింజలు తింటే
అధిక రక్తపోటు, గుండె సమస్యలను నివారిస్తుంది > మూత్రపిండాలను శుభ్రం చేస్తుంది. > ఇందులోని లైకోపీన్ క్యాన్సర్ను నివారిస్తుంది > పురుషుల లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది > డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది > రోగ నిరోధక శక్తి పెరుగుతుంది > జుట్టురాలడం, దురద నెత్తి సమస్య పరిష్కారం అవుతుంది > అందమైన చర్మం మీ సొంతం అవుతుంది > ఎముకలు, కణజాలాలు బలోపేతం అవుతాయి
Read More »భారత్ లో 3,11,170 కరోనా కేసులు
భారత్ లో గడిచిన గత 24 గంటల్లో 3,11,170 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,46,84,077గా ఉంది. ఇక నిన్న 4077 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 2,70,284గా ఉంది. ప్రస్తుతం దేశంలో 36,18,458 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »కరోనాతో కాంగ్రెస్ ఎంపీ మృతి
కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు రాజీవ్ సతావ్ (46) కరోనాతో మరణించారు. ఏప్రిల్ 22న కరోనా బారిన పడ్డ ఆయన.. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం కన్నుమూశారు. రాహుల్ గాంధీతో సతావ్ చాలా సన్నిహితంగా ఉండేవారు. ఆయన మృతి పట్ల కాంగ్రెస్ సీనియర్ నేతలు సంతాపం తెలిపారు.
Read More »చద్దన్నం తింటే ఉంటది
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి చద్దన్నం మంచి మెడిసిన్ అని డాక్టర్లు చెబుతున్నారు. ఇందులోని బ్యాక్టీరియా శరీరంలోని హానికర వైరస్లను నాశనం చేస్తుంది. చద్దన్నంలో చాలా రకాల పోషకాలుఉంటాయి. 1. శరీరంలో వేడిని తగ్గిస్తుంది. 2. చర్మవ్యాధుల నుంచి కాపాడుతుంది. 3. మలబద్ధకం, పేగుల్లో అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. 4. B12, B6 విటమిన్లు, పీచు పదార్థాలు ఉంటాయి. 5. బీపీ కంట్రోల్లో ఉంటుంది.
Read More »