Home / rameshbabu (page 755)

rameshbabu

రేవంత్ సంచలన నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ పరిధిలో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి బయట మల్కాజీగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన  కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. కరోనా బాధితుల వెంట వచ్చిన కుటుంబసభ్యులకు, బంధువులకు లాక్డౌన్ ముగిసే వరకు ఉచితంగా భోజనం అందించనున్నట్లు తెలిపారు. ప్రతి రోజు 1,000 మంది కడుపు నింపుతామని చెప్పారు. గాంధీ ఆస్పత్రి స్టాఫ్, సెక్యూరిటీ సిబ్బందికీ అన్నం పెడతామన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో …

Read More »

సుప్రీం కోర్టుకు RRR

బెయిల్ కోసం వైసీపీ రెబల్ MP రఘు రామకృష్ణం రాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏపీ CID తనపై నమోదు చేసిన కేసులో.. బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేశారు. అది రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు MP రఘురామరాజుకు గుంటూరులోని సీఐడీ కోర్టు.. ఈ నెల 28 వరకు రిమాండ్ విధించింది. ఆయన కాళ్లపై గాయాలు ఉండటంతో జైలుకు తీసుకెళ్లకుండా, ఆస్పత్రికి తరలించాలని సూచించింది.

Read More »

కియారా అద్వానీ తెగ బిజీ

కరోనా బారిన పడి కోలుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం RRR మూవీతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత కొరటాల శివతో ఓ సినిమా చేయనున్నాడు. ఈ మూవీలో హీరోయిన్గా కియారా అద్వానీ ఫిక్స్ అయ్యింది. తాజాగా ఈ మూవీకి సైన్ చేసిన ఈ అమ్మడు.. తన డేట్స్ కూడా కేటాయించిందట. ప్రస్తుతం ఆచార్య మూవీతో కొరటాల శివ బిజీగా ఉండగా.. ఈ మూవీ షూటింగ్ పూర్తైన వెంటనే ఎన్టీఆర్తో మూవీని …

Read More »

తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు

తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 4,298 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 32మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. మరోవైపు కరోనా నుంచి 6,026 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో పాజిటివ్ రేటు 0.55శాతంగా నమోదవ్వగా.. రికవరీ రేటు 89.33 శాతంగా ఉంది. ఇక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 64,362టెస్టులు చేశారు.

Read More »

ఎంపీ రఘురామరాజుకి 14రోజులు రిమాండ్

ఏపీ అధికార పార్టీ వైసీపీకి చెందిన నర్సాపురం ఎంపీ రఘురామ రాజుకి ఈ నెల 28 వరకు రిమాండ్ విధించినట్లు సీఐడీ కోర్టు తీర్పునిచ్చింది. అయితే ఆయనకు వై కేటగిర భద్రతను కొనసాగించేందుకు సీఐడీ కోర్ట్ అనుమతించింది. ఈ మేరకు న్యాయవాది లక్ష్మీనారాయణ వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం రఘురామను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారని, ఆ తర్వాత అక్కడి నుంచి రమేష్ హాస్పిటల్‌లో వైద్యం అందిస్తారని …

Read More »

దేశంలో కరోనా విషయంలో కాస్త ఊరట

దేశంలో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. నిన్న 3.4 ల‌క్ష‌ల‌కుపైగా కేసులు న‌మోద‌వ‌గా, తాజాగా అవి 3.26 ల‌క్ష‌ల‌కు త‌గ్గాయి. అయితే మృతులు మాత్రం పెరుగుతూనే ఉన్నారు. దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 3,26,098 కేసులు న‌మోద‌య్యాయి. మ‌రో 3,890 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,43,72,907కు చేరింది. ఇందులో 2,04,32,898 మంది బాధితులు కోలుకోగా, 36,73,802 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మ‌రో 2,66,207 …

Read More »

నేడు రేపు తెలంగాణలో వ్యాక్సిన్ బంద్

తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ నేడు, రేపు నిలిచిపోనుంది. కొవిషీల్డ్ తొలి, రెండో డోస్ మధ్య వ్యవధిని 12-16 వారాలకు కేంద్రం మార్చడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను శని, ఆదివారాల్లో నిలిపివేసింది. ఈ నెల 17 నుంచి తిరిగి వ్యాక్సినేషన్ ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Read More »

ఢిల్లీ సీఎం సంచలన నిర్ణయం

కొవిడ్ వల్ల తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులను ఆదుకునేందుకు ఢిల్లీ సర్కారు ముందుకొచ్చింది. ఆ పిల్లల చదువులకయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని CM అరవింద్ కేజీవాల్ వెల్లడించారు. తాము అనాథలమని బాధపడకూడదని, మీకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. కరోనా వల్ల ఇంట్లో సంపాదించే వ్యక్తిని కోల్పోయిన కుటుంబాలకూ ఆర్థికంగా అండగా ఉంటామని తెలిపారు.

Read More »

తెలంగాణలో త్వరలోనే ప్రజలందరికీ టీకాలు

సాధ్యమైనంత త్వరగా ప్రజలందరికీ టీకాలు వేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఉందని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. అవసరమైన వ్యాక్సిన్లను సేకరించేందుకు టీకా తయారు చేస్తున్న స్థానిక, అంతర్జాతీయ సంస్థలతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. కొవిడ్ నియంత్రణకు అవసరమైన అన్ని మందుల ఉత్పత్తిని పెంచాలని, అందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని ఫార్మా సంస్థల ప్రతినిధులకు నిన్నటి సమావేశంలో చెప్పారు.

Read More »

త్వరలో 2డీజీ డ్రగ్స్

DRDO భాగస్వామ్యంతో కరోనా బాధితుల చికిత్సలో వినియోగించే 2డీజీ డ్రగ్ను డా. రెడ్డీస్ ల్యాబ్ ఆవిష్కరించింది. వచ్చేవారమే 10వేల డోసుల మొదటి బ్యాచ్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు రెడ్డీస్, DRDO అధికారులు తెలిపారు. పౌడర్ రూపంలో ఉండే ఈ డ్రగ్ను కరోనా రోగులు నీళ్లలో కలుపుకుని తాగితే కరోనా లక్షణాల నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుందని వెల్లడించారు. క్లినికల్ ట్రయల్స్లో మంచి ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat