తెలంగాణ రాష్ట్రంలోని ముస్లింలకు సీఎం కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం.. శాంతి, ప్రేమ, దయను పంచుతోందన్నారు. రాష్ట్రంలో గంగా జమునా తహజీబు రంజాన్ పండగ ప్రతీక అని చెప్పారు. మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ముస్లింల జీవితాల్లో వెలుగును నింపుతున్నాయని చెప్పారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
Read More »అనుపమ తనదైన శైలీలో రంజాన్ శుభాకాంక్షలు
పవిత్ర రంజాన్ సందర్భంగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం యువతిలా ఈద్ ముబారక్ తెలుపుతూ ఆకర్షణీయ లుక్లో అలరించారు. అనుపమ తన స్టన్నింగ్ ఫొటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. దీనిపై ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Read More »చాహల్ కుటుంబంలో కరోనా కలవరం
టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తల్లిదండ్రులు కొవిడ్ బారినపడ్డారు. చాహల్ తండ్రికి తీవ్రమైన కరోనా లక్షణాలు ఉండటంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు.. తల్లి ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని చాహల్ భార్య ధనశ్రీ వర్మ ఇన్స్టాగ్రామ్ లో వెల్లడించింది. ‘దయచేసి ఇంట్లోనే ఉంటూ మీ కుటుంబాలను జాగ్రత్తగా చూసుకోండి’ అంటూ ధనశ్రీ ఇన్స్టాలో రాసుకొచ్చింది.
Read More »మహారాష్ట్రలో కరోనా బీభత్సం
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి శాంతించట్లేదు. కొవిడ్ కేసులతో పాటు వైరస్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో అక్కడ కొత్తగా 42,582 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా, 850 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో 54,535 మంది కరోనా రోగులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,33,294 యాక్టివ్ కేసులు ఉన్నాయి. లాక్డౌన్ పెట్టిన కేసులు తగ్గట్లేదు.
Read More »రెండు వేర్వేరు వ్యాక్సిన్లు తీసుకుంటే ఏమవుతుంది?
రెండు వేర్వేరు వ్యాక్సిన్లు తీసుకుంటే ఏమవుతుంది అనే అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. మొదటి డోసులో ఓ కరోనా వ్యాక్సిన్ తీసుకుని రెండో డోసులో పొరపాటున మరో కంపెనీ వ్యాక్సిన్ తీసుకుంటే ఏమవుతుంది?. బ్రిటన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ దీనిపై అధ్యయనం చేసి వివరాలు వెల్లడించింది. ఇలా వేర్వేరు కంపెనీల వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో అలసట, తలనొప్పి వంటి సైడ్ ఎఫెక్ట్స్ తప్ప ఇతర సమస్యలు రాలేదని నిపుణులు చెబుతున్నారు.
Read More »తెలంగాణలో మే 31 వరకూ ఫస్ట్ డోస్ లేదు
తెలంగాణ రాష్ట్రంలో మే 31 వరకూ సెకండ్ డోస్ వారికే వ్యాక్సిన్ ఇస్తామని DMHO డా. శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔషధాలకు ఎలాంటి కొరత లేదని తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రులు ఆక్సిజన్ను సక్రమంగా వినియోగించాలని సూచించారు. మే 31 వరకూ ఎవరికీ ఫస్ట్ డోస్ ఇవ్వమని ఆయన స్పష్టం చేశారు. ఇక ప్రభుత్వం విధించిన లాక్ డౌన్లో సత్ఫలితాలు కనిపిస్తున్నాయని తెలిపారు.
Read More »తెలంగాణలో తగ్గని కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 71,221 టెస్టులు చేయగా.. 4,693 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఇందులో 734 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 5,16,404కి చేరింది. తాజాగా 33 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 2,863కి పెరిగింది. 6,876 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.కాగా రాష్ట్రంలో 56,917 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Read More »మంత్రి కేటీఆర్ అధ్యక్షతన కొవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ బుధవారం ఉదయం 10 గంటల నుంచి అమల్లోకి వచ్చిన విషయం విదితమే. కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌కు తెలంగాణ ప్రజలు పూర్తిగా సహకరిస్తున్నారు. కరోనా పరిస్థితులపై చర్చించేందుకు మంత్రి కేటీఆర్ అధ్యక్షతన కొవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం మంత్రి కేటీఆర్ అధ్యక్షతన తాత్కాలిక సచివాలయ భవనంలోని సీఎస్ కార్యాలయంలో కొవిడ్ టాస్క్‌ఫోర్స్ …
Read More »సీఎం జగన్ అసంతృప్తి
కరోనా బాధితులకు టీకాల కొరత ఏపీలోనే కాదు దేశమంతటా ఉందని సీఎం జగన్ అన్నారు. డబ్బులు ఇస్తామని చెప్పినా టీకాలు ఇచ్చేందుకు ఫార్మా కంపెనీలు రెడీగా లేవని సీఎం జగన్ తెలిపారు. టీకాల పంపిణీ కేంద్రం నియంత్రణలో ఉంటుందని తెలిసి కూడా ప్రతిపక్షాలు, మీడియా తమపై విమర్శలు చేస్తున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రానికి దాదాపు 7 కోట్ల డోసులు ఇవ్వాల్సి ఉంటే ఇప్పటివరకు కేంద్రం నుంచి 73 లక్షల …
Read More »సీఎం కేసీఆర్ పై షర్మిల అగ్రహం
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత,సీఎం KCRపై వైఎస్ షర్మిల మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో లాక్డౌన్ నిర్ణయంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు వైఎస్ షర్మిల.. ‘అయ్య పెట్టడు అడుక్కు తిననియ్యడు. KCR కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చడు.. ఆయుష్మాన్ భారత్లో చేరరు’ అంటూ విరుచుకుపడ్డారు. సీఎం ‘KCR సారు .. సోయిలకురా. ఇప్పటికైనా సర్కార్ దవాఖానాలను సక్కగ చేసి, కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చు’ అంటూ వైఎస్ …
Read More »