తెలంగాణ రాష్ట్రంలో జూన్ నెలలో ఏడు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ కానున్నాయి. వీటిలో 6 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ల పదవీ కాలం జూన్ 3న పూర్తి కానుండగా, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవీ కాలం జూన్ 16న పూర్తవుతోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ కోసం ఈసీ వచ్చే వారం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. అధికార టీఆర్ఎస్ ఖాతాలోని ఈ స్థానాలు తిరిగి ఆ …
Read More »సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా వరంగల్ జైలు
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ సెంట్రల్ జైలును యుద్ధప్రాతిపదికన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ప్రస్తుతమున్న ఎంజీఎం సరిపోకపోవడంతో 73 ఎకరాల్లో విస్తరించి ఉన్న జైలు ప్రాంగణంలో ఆస్పత్రి నిర్మించాలన్నారు. ఐసీయూలు, ఆక్సిజన్ ప్లాంట్, క్రిటికల్ కేర్ వంటి సౌకర్యాలు అందుబాటులోకి తేవాలని చెప్పారు. జైలును వరంగల్ శివారులోని ధర్మసాగర్ పరిసర ప్రాంతాలకు తరలించాలని సూచించారు.
Read More »మాజీ డీజీపీ బి. ప్రసాదరావు కన్నుమూత
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ బి. ప్రసాదరావు కన్నుమూశారు. అమెరికాలో ఉంటున్న ఆయనకు ఛాతి నొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలోనే మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 1979 IPS బ్యాచ్కు చెందిన ప్రసాదరావు ఏసీబీ డీజీ, హైదరాబాద్ సీపీ, విశాఖ ఎస్పీగానూ పనిచేశారు. 1997లో భారత పోలీసు పతకం, 2006లో రాష్ట్రపతి పతకం అందుకున్నారు. ‘వర్డ్ పవర్ టు మైండ్ పవర్’ అనే పుస్తకాన్ని రాశారు.
Read More »వాహనదారులకు భారీ షాక్
బ్రేక్ లేకుండా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు షాక్ ఇస్తున్నాయి. తాజాగా ఆయిల్ కంపెనీలు పెట్రోల్ లీటర్కు 26 పైసలు, డీజిల్ లీటర్కు 34 పైసలు పెంచాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.95.13కు చేరగా డీజిల్ ధర రూ.89.47గా ఉంది. వ్యాట్ ఎక్కువగా ఉన్న కొన్ని రాష్ట్రాల్లో ధరలు రూ.100 దాటాయి. కొవిడ్ సంక్షోభంతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు పెరుగుతున్న పెట్రోల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.
Read More »మామిడి పండ్లను పంపుతున్న పూజా హెగ్డే
సినీ ఇండస్ట్రీలోని తన సన్నిహితులకు హీరోయిన్, అందాల రాక్షసి పూజా హెగ్దే మామిడి పండ్లు పంపుతోంది. కర్ణాటకలోని మంగళూరు వద్ద ఆమెకు మామిడి తోట ఉండగా.. ఈ సారి మంచి దిగుబడి వచ్చింది. దీంతో పరిశ్రమలో తెలిసిన వారికి మామిడి పండ్లు పంపుతుండగా.. తొలిరోజు ఒకరిద్దరు నిర్మాతలు, దర్శకులకు ఈ పండ్ల గిఫ్టులు అందగా, అందుకోవాల్సిన వారు ఇంకా చాలామందే ఉన్నారట.
Read More »దేశంలో కరోనా కేసులపై ఊరట
దేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య కాస్త తగ్గింది. వరుసగా 4 రోజులు 4 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా గత 24 గంటల్లో 3,66,161 పాజిటివ్ కేసులు వచ్చాయి. 3,754 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 2,26,62,575 నమోదు కాగా 2,46,116 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 3,53,818 మంది డిశ్చార్జ్ అయ్యారు. 37,45,237 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న దేశవ్యాప్తంగా 14,74,606 కరోనా టెస్టులు …
Read More »జర్నలిస్టు TNR మృతి
అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో TNRగా పాపులర్ అయిన జర్నలిస్టు తుమ్మల నరసింహారెడ్డి కన్నుమూశారు. కరోనాతో హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. యూట్యూబ్ ఛానల్ ద్వారా ‘ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ TNR’ అంటూ ఎంతో మందిని ఇంటర్వ్యూ చేసి గుర్తింపు తెచ్చుకున్నారు. TNR మృతి పట్ల తెలుగు సినీ ప్రముఖులు దిగ్భ్ర్భాంతి వ్యక్తం చేశారు.
Read More »దేశంలో లాక్డౌన్ పెట్టండి
కరోనా కట్టడికి పలు రాష్ట్రాలు కర్ఫ్యూలు, లాక్డౌన్లు విధించగా.. కొన్నిచోట్ల కరోనా బాధితులకు సరైన చికిత్స అందడం లేదనే ఆరోపణలొస్తున్నాయి. దీంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కేంద్ర ఆరోగ్య శాఖకు లేఖ రాసింది. ‘దేశంలో లాక్డౌన్ పెట్టాలి. కరోనా నియంత్రణలో అలసత్వం ఎందుకు? కరోనా చైన్ నియంత్రించాలంటే లాక్డౌన్ తప్పనిసరి. లాక్ డౌన్ పెట్టడం వల్ల మౌలిక వైద్య సదుపాయాలు ఏర్పరచుకోవచ్చు’ అని IMA లేఖలో పేర్కొంది.
Read More »కరోనా ఎఫెక్ట్ – రిషబ్ పంత్ సంచలన నిర్ణయం
దేశంలో కరోనా పరిస్థితులను చూసి రిషబ్ పంత్ చలించిపోయాడు. ‘నేను హేమ్కంత్ ఫౌండేషన్కు విరాళం అందజేస్తున్నా. అది ఆక్సిజన్ సిలిండర్లు, పడకలు, కరోనా రిలీఫ్ కిట్లు అందిస్తుంది. గ్రామీణ ప్రాంతాలు, ద్వితీయ శ్రేణి నగరాలకు సాయం అందించే సంస్థలతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నా. మీరూ తగినంత విరాళం ఇవ్వండి’ అని పంత్ ట్వీట్ చేశాడు. అటు CSK టీం కూడా 450 ఆక్సిజన్ కాన్సర్ట్రేటర్లను భూమిక ట్రస్టుకు అందించింది.
Read More »కరోనా ఎఫెక్ట్ – మహేష్ బాబు పిలుపు
కరోనా నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హీరో మహేశ్ బాబు సూచించారు. ‘కరోనా తీవ్రమవుతోంది. బయటకు వచ్చేటప్పుడు మాస్క్ ధరించండి. అవసరమైతేనే బయటకు రండి. కరోనా బారినపడితే ఏ లక్షణాలతో బాధపడుతున్నారో చూసుకోండి. వైద్యుల సలహా మేరకు మాత్రమే ఆస్పత్రికి వెళ్లండి. దీంతో అవసరమైన వారికి పడకలు అందుతాయి. ఈ విపత్కర పరిస్థితుల నుంచి మరింత దృఢంగా తయారవుతాం. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండండి’ అని మహేశ్ ట్వీట్ చేశారు.
Read More »