కరోనా తీవ్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మాస్కులు లేకుండా తిరిగితే ఎవరినీ ఉపేక్షించవద్దని.. జరిమానాలు విధించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులను ఆదేశించారు. కరోనా కట్టడిలో ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి శనివారం పాలకుర్తికి చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులతో ఆయా అంశాలపై చర్చించిన మంత్రి.. సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. క రోనా నియంత్రణకు ఏ ఊరికి ఊరు ప్రజాప్రతినిధులు, …
Read More »పేద విద్యార్థులకు తెలంగాణ జాగృతి అండ
తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన, దళిత, పేద విద్యార్థులు ఆన్‌లైన్‌లో చదువును కొనసాగించేందుకు తెలంగాణ జాగృతి సాయం చేసింది. తెలంగాణ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులతో ఏర్పడిన విలేజ్ లెర్నింగ్ సర్కిళ్ల (వీఎల్‌సీ)కు.. మాజీ ఎంపీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో 50 కంప్యూటర్లు, 500 కుర్చీలను వితరణ చేశారు. ఈ సాయం కొనసాగిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా కవితకు మంత్రి కొప్పుల ఈశ్వర్ కృతజ్ఞతలు తెలిపారు. సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ …
Read More »సీపీఐ సీనియర్ నేత మృతి
సీపీఐ సీనియర్ నాయకులు, ఆ పార్టీ కంట్రోల్ కమిషన్ రాష్ట్ర చైర్మన్ ఎం.నారాయణ (81) శనివారం మృతి చెందారు. కొంతకాలంగా ఆయన గోదావరిఖని సింగరేణి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎం.నారాయణ మృతి పట్ల సీపీఐ జాతీయ మాజీ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, జాతీయ కార్యదర్శి కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్ పాషా, రాష్ట్ర సహాయ కార్యదర్శులు పల్లా వెంకట్ …
Read More »అభిమానులకు,ప్రజలకు మహేష్ పిలుపు
కరోనా వ్యాధి నుంచి కోలుకున్న వారు ధైర్యంగా ముందుకొచ్చి ప్లాస్మా దానం చేయడం వల్ల మరెంతో మంది ప్రాణాలను కాపాడినవాళ్లవుతారు. కాబట్టి ప్లాస్మా దానం చేసి ప్రాణాలు కాపాడండి’’ అని హీరో మహేశ్ బాబు పిలుపునిచ్చారు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా తన అభిమానులకు, ప్రజలకు ప్లాస్మా దానం చేయాలని ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారాయన. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో ఒకరికొకరం తోడుగా ఉండటం ఎంతో అవసరం. కరోనా విజృంభిస్తోన్న …
Read More »సమంత చెల్లిగా రష్మిక
తెలుగు చిత్రపరిశ్రమతో పాటు తమిళంలోనూ సినిమాలు చేస్తున్నారు సమంత. మాతృభాష కన్నడతో పాటు తెలుగులో, తాజాగా ఓ తమిళ చిత్రంలో నటిస్తున్నారు రష్మికా మందన్నా. దక్షిణాదిలో స్టార్ హీరోయిన్లుగా సత్తా చాటుతున్న సమంత, రష్మిక కలసి ఓ సినిమా చేయనున్నారనే వార్తలు ఫిల్మ్‌నగర్ వర్గాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. అది కూడా అక్కాచెల్లెళ్లుగా నటించనున్నారని టాక్. ఇటీవల ఓ యువ దర్శకుడు అక్కాచెల్లెళ్ల నేపథ్యంలో కథని రెడీ చేసి, సమంత, రష్మికలకు …
Read More »సరికొత్తగా సాయి ధరమ్ తేజ్
సాయితేజ్ వరుస సినిమాలను ఓకే చెబుతూ అన్నింటినీ లైన్‌లో పెట్టుకుంటున్నారని సినీ వర్గాల సమాచారం. వివరాల్లోకెళ్తే సాయితేజ్ హీరోగా నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా విడుదలకు రెడీ అవుతుంది. దీని తర్వాత దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సాయితేజ్ సిద్ధంగా ఉన్నారు. దీని తర్వాత రీసెంట్‌గా ఓ కొత్త దర్శకుడి కథను సాయితేజ్ ఓకే చెప్పారట. ఈ చిత్రాన్ని సీనియర్ నిర్మాత …
Read More »కాజల్‌కు భారీ ఆఫర్
వెండితెర అరంగేట్రం చేసి పదిహేనేళ్లు దాటినప్పటికీ చందమామ కాజల్ అగర్వాల్ డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగానే ఉంది. ఇటు యువ హీరోలతోనూ అటు వెటరన్ హీరోలతోనూ జత కడుతోంది. ప్రస్తుతం రానా నటిస్తున్న హిందీ సినిమా `హాథీ మేరే సాథీ` చిత్రంలో కాజల్ ఓ గెస్ట్ రోల్ చేసిందట. ఓ ఆదివాసి యువతి పాత్రలో కాజల్ కనిపించనుందట. సినిమాలో అరగంట సేపే కాజల్ పాత్ర …
Read More »4నెలల తర్వాత పాయల్ రాజ్ పుత్
కరోనా ప్రభావంతో కొన్ని మాసాలుగా తారలందరూ కెమెరాలకు దూరమైపోయారు. ఇటీవల లాక్‌డౌన్ నిబంధనల సడలింపుతో ప్రభుత్వ ఆంక్షల నడుమ కొన్ని సినిమాల చిత్రీకరణలు మొదలయ్యాయి. అయితే అగ్ర కథానాయికలెవరూ ఇప్పటివరకు చిత్రీకరణలో పాల్గొనలేదు. పంజాబీ భామ పాయల్‌రాజ్‌పుత్ లాక్‌డౌన్ విరామానంతరం తొలిసారి కెమెరా ముందుకొచ్చింది. ఓ పంజాబీ పాటకు సంబంధించిన షూటింగ్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసింది. ‘నాలుగు నెలల సుదీర్ఘ విరామం తర్వాత …
Read More »టాలీవుడ్ హీరో పెళ్లిలో కరోనా కలవరం
ఇటీవల ఓ హీరో పెళ్లితో ఓ ఇంటివాడయ్యాడు.. పలుసార్లు వాయిదాలు పడుతూ వచ్చిన ఆ యువహీరో వివాహం అట్టహాసంగా జరిగింది. ఆ హీరోకు అత్యంత సన్నిహితులైన పలువురు హీరోలు, నిర్మాతలు, దర్శకులు ఆ పెళ్లికి హాజరయ్యారు. సెల్ఫీలతో హంగామా చేశారు. ఇటీవల ఆ యువ కథానాయకుడు ఓ విజయన్ని కూడా అందుకోవడంతో ఆ హీరో డేట్స్ అవసరమైన నిర్మాతలు, దర్శకులు కూడా పెళ్లి వద్ద సందడి చేశారు. అయితే ఆ …
Read More »విజయవాడ కోవిడ్ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు కరోనా రోగులు మృతి
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కొవిడ్ కేర్ సెంటర్‌గా వినియోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్ హోటల్‌లో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు కొవిడ్ బాధితులు మృతి చెందినట్లు విజయవాడ సీపీ శ్రీనివాసులు స్పష్టం చేశారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అని సీపీ చెప్పారు అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో ఆ సెంటర్‌లో …
Read More »