Home / MOVIES / కాజల్‌కు భారీ ఆఫర్

కాజల్‌కు భారీ ఆఫర్

వెండితెర అరంగేట్రం చేసి పదిహేనేళ్లు దాటినప్పటికీ చందమామ కాజల్ అగర్వాల్ డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు.

ఇప్పటికీ వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగానే ఉంది. ఇటు యువ హీరోలతోనూ అటు వెటరన్ హీరోలతోనూ జత కడుతోంది.

ప్రస్తుతం రానా నటిస్తున్న హిందీ సినిమా `హాథీ మేరే సాథీ` చిత్రంలో కాజల్ ఓ గెస్ట్ రోల్ చేసిందట. ఓ ఆదివాసి యువతి పాత్రలో కాజల్ కనిపించనుందట. సినిమాలో అరగంట సేపే కాజల్ పాత్ర ఉంటుందట.

అతిథి పాత్రే అయినప్పటికీ రెమ్యునరేషన్ విషయంలో కాజల్ ఏమాత్రం తగ్గలేదట. ఆ పాత్ర చేసినందుకు రూ.70 లక్షల రెమ్యునరేషన్ తీసుకుందట. ఈ సినిమా హిందీతో పాటు పలు ఇతర భాషల్లో కూడా విడుదల కాబోతోంది. తెలుగులో `అరణ్య` పేరుతో రిలీజ్ కానుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat