ఏపీలో ప్రముఖ ఫుట్ వేర్ సంస్థ పాపులర్ షూ మార్ట్ అధినేత చుక్కపల్లి అమర్ కుమార్ (62) విజయవాడ సమీపంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో ఆదివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించి మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పాపులర్ షూ మార్టు అధినేత చుక్కపల్లి పిచ్చయ్య రెండో కుమారుడయిన అమర్ కుమార్ 1957 ఫిబ్రవరి …
Read More »లతా మంగేష్కర్ కు తీవ్ర అస్వస్థత
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడంతో ముంబయిలో బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేర్చారు. అప్పటికి ఆమె విషమ పరిస్థితిలో ఉన్నారని వైద్య వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం లతా మంగేష్కర్ కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఈ మధ్యనే లత 90వ పడిలో అడుగుపెట్టారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో చురుగ్గా …
Read More »ఈనెల 21న సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం
గతంలో జీఎస్పీసీ గ్యాస్ అన్వేషణ కోసం13 మాసాలు సర్వే చేయడం వల్ల ముమ్మిడివరం నియోజకవర్గంలోని 16,780 మత్స్యకార కుటుంబాలకు ఉపాధి లేకుండా పోయిందని సోమవారం మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఆయన జిల్లాలోని కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 21న ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముమ్మిడివరంలో పర్యటిస్తారని తెలిపారు. మట్లపాలెం, ఉప్పలంకలో మినీ ఫిషింగ్ జెట్టిల నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్ధాపన చేస్తారని …
Read More »విజయ్ చందర్‌కు కీలక పదవి ఇచ్చిన జగన్..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక పదవి భర్తీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. పాదయాత్ర సమయంలో ముఖ్యమంత్రి జగన్‌కు మద్దతుగా రంగంలోకి దిగి తనతో కలిసి నడిచిన వైసీపీ నేత, నటుడు విజయ్ చందర్‌కు కీలక పదవి ఇచ్చారు. ఆయనను ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్, ఎక్స్ అఫిషియో …
Read More »సీఎం జగన్ మరో హామీ..వారికి 10 వేలకు జీతం పెంచుతూ జీవో జారీ
2019 ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ఒక్కొక్క హామీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పక్కగా అమలు చేస్తున్నారు. ఇప్పటికే అనేక హామీలను అమలు చేసిన సీఎం వైఎస్ జగన్.. తాజాగా మరో హామీని నెరవేర్చారు. విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ (వీఓఏ), మెప్మా, యనిమేటర్లు, సంఘమిత్రాల వేతనం రూ. 10 వేలకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం జీవోని జారీ చేసింది. పెంచిన వేతనం డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. …
Read More »పయ్యావుల కేశవ్ ను పరామర్శించిన చంద్రబాబు
అనంతపురం జిల్లా ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ ప్రజా పద్దుల సంఘం ఛైర్మన్ (పీఏసీ) పయ్యావుల కేశవ్ స్వల్ప అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. అమరావతిలో పీఏసీ సమావేశం జరుగుతుండగా ఆయన అస్వస్థత గురి కావడంతో ఆయనను ఇటీవల ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న ఆయనను టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించి, కొద్ది సేపు మాట్లాడారు. వైద్యులతోనూ మాట్లాడి పయ్యావుల కేశవ్ ఆరోగ్య …
Read More »సముద్రస్నానంలో గల్లంతైన నలుగురు స్నేహితులు..ఆ కుటుంబాల్లో తీరని శోకం
కార్తీక ఆదివారం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా గార మండలంలోని కళింగపట్నం–మత్స్యలేశం పరిధిలో బీచ్‌కు వచ్చిన ఆరుగురు ఇంటర్ యువకుల్లో నలుగురు గల్లంతయ్యారు. శ్రీకాకుళంలోని చైతన్య కళాశాలలో ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతున్న శిర్ల శివరామిరెడ్డి (ప్రవీణ్‌కుమార్ రెడ్డి), కనుమూరు సంజయ్, యజ్ఞ నారాయణ పండా, అనపర్తి సుధీర్, షేక్ అబ్దుల్లా, లింగాల రాజసింహాలు ఆదివారం బీచ్‌కు వెళ్లారు. అక్కడే భోజనం ముగించుకొని కొంతసేపు ఇసుక దిబ్బలపై ఆడుకున్నారు. వారిలో రాజసింహా …
Read More »బ్రేకింగ్ న్యూస్..కాచిగూడ స్టేషన్‌లో రెండు రైళ్లు ఢీ..వీడియో వైరల్
కాచిగూడ స్టేషన్‌లో రెండు రైళ్లు ఢీ కోట్టుకున్నాయి. కాచిగూడ వద్ద ఇంటర్‌సిటీ, ఎంఎంటీఎస్ రైళ్లు ఢీకొన్న ఘటనలో పది మందికిపైగా గాయాలపాలయ్యారు. ఆగివున్న ఉన్న ఇంటర్‌సిటీ ట్రైన్ ట్రాక్‌పైకి ఎంఎంటీఎస్ ట్రైన్ వచ్చి ఢీకొట్టింది. సిగ్నల్ చూసుకోకపోవడంతోనే రెండు ట్రైన్‌లు ఒకే ట్రాక్‌పైకొచ్చినట్టు తెలుస్తోంది. టెక్నికల్ లోపం వల్లే ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు చెప్తున్నారు. స్టేషన్ కావడంతో రైలు వేగం తక్కువగా ఉందని, లేదంటే పెను ప్రమాదం సంభవించేదని …
Read More »అక్రమ సంబంధానికి అంగీకరించలేదని కోడలిని మామ ఏం చేశాడో తెలుసా
వివాహేతర సంబంధానికి అంగీకరించలేదనే కారణంగా వ్యక్తి కోడలిని హత్య చేసిన ఘటన ఆదివారం కర్ణాటకలోని మండ్య తాలూకా రాగిముద్దనహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. హాసన్ జిల్లాకు చెందిన వీణ (26)కు రాగిముద్దనహళ్లి గ్రామానికి చెందిన నాగరాజు కుమారుడు అనిల్‌తో ఆరేళ్ల క్రితం వివాహమైంది. కాగా రెండేళ్ల క్రితం నాగరాజు భార్య సావిత్రమ్మ మృతి చెందింది. అప్పటినుంచి నాగరాజు ప్రతిరోజూ కోడలు వీణను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. రోజురోజుకు వేధింపులు తీవ్రతరం కావడంతో …
Read More »కడప స్టీల్ ప్లాంట్‌కు ఇనుప ఖనిజం సరాఫరాకు అంగీకారం..!
కడప స్టీల్ ప్లాంట్‌కు ఎన్‌ఎమ్‌డీసీ నుంచి ఇనుప ఖనిజం సరాఫరాకు అంగీకారం కుదిరింది. ఈ మేరకు త్వరలో ఎన్‌ఎమ్‌డీసీ, ఏపీ ప్రభుత్వం మద్య ఎంఓయూ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో కేంద్ర పెట్రోలియం, సహజవాయువు, ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం భేటీ అయ్యారు. ఈ భేటీలో వివిధ చమురు కంపెనీల ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను చర్చించి.. …
Read More »