ఏపీ ముఖమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం మనం చాలా ప్రమాదంలో ఉన్నామని చెప్పారు. నిన్న రాత్రి రాష్ట్ర సరిహద్దులకు వచ్చిన వారిలో 200 మందిని క్వారంటైన్ లో పెట్టడం జరిగింది. నిన్న జరిగిన సంఘటన నన్ను చాలా కలవరపరిచింది కానీ ఇలా చేయడం తప్పలేదని అన్నారు.ఈ 3వారాలు ఎక్కడ ఉన్నవాళ్లు అక్కడే ఉంటే ఆరోగ్యం బాగోలేని వారిని గుర్తించడం …
Read More »కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వాలకు తోడుగా సినీ హీరోలు !
ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న నేపధ్యంలో హేమాహేమీ దేశాలు సైతం కరోనా దెబ్బకు వణికిపోతున్నాయి.ఇక ఇండియా ఇప్పటికే 600లకు పైగా కేసులు నమోదు కావడంతో కేంద్రం కూడా అన్ని చర్యలు చేపడుతుంది. ఈ నేపధ్యంలో దేశం మొత్తం ఎక్కడికక్కడ లాక్ డౌన్ ప్రకటించారు. మరోపక్క తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ ప్రభుత్వాలు కూడా ముందస్తు చర్యలు చేపట్టాయి. ఇక అసలు విషయానికి …
Read More »సీఎం జగన్ సంచలన నిర్ణయం…విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు లేకుండా ఆల్ పాస్
లాక్ డౌన్ కారణంగా ఏపీ విద్యార్థుల పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ అంశంపై ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 6వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు లేకుండా ఆల్ పాస్ విధానాన్ని అమలు చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. పదో తరగతి …
Read More »కరోనా బుల్లెటిన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం !
ఏపీ కరోనా వివరాల బులెటిన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది.ఇప్పటి వరకు విదేశాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 26,590 మంది వచ్చినట్లు గుర్తించినట్లు తెలిపింది. 25,942 మందిని హోం ఐసోలేషన్‌లో ఉంచామని, కరోనా అనుమానిత లక్షణాలతో 117మందికి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది.రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 289 మందికి నెగెటివ్, 10 మందికి పాజిటివ్ వచ్చిందని తెలిపింది. 33 మంది శాంపిల్స్ నివేదిక రావాల్సి ఉందని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. కోవిడ్ -19కి …
Read More »ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న కరోనా నియంత్రణ చర్యలను దేశమంతా గమనిస్తోంది.
భారతదేశంలో ప్రస్తుతం కోరినా వైరస్ భారిన పడిన వారి సంఖ్య 600 పైగానే ఉంది. దాంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నో చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే దేశంమొత్తం లాక్ డౌన్ ప్రకటించారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మరోపక్క ఏపీలో పనిలో చేస్తున్న తీరు పట్ల ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా తెలిపారు. “ప్రచార ఆర్భాటాలకు పోకుండా ఏపి …
Read More »అధిక ధరలకు అమ్మితే పీడీ యాక్టు కింద జైలుకే !
ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని కొరోనా మహమ్మారి కమ్మేసింది. ఈ మహమ్మారికి మందు లేకపోవడంతో యావత్ ప్రపంచం ఏమీ తోచని పరిస్థితిలో ఉంది. చైనా వుహాన్ ప్రాంతంలో పుట్టిన ఈ వైరస్ ఎక్కువ శాతం ఇటలీని ముచ్చేసింది. ఇది వారు చేసుకున్న తప్పిదం అనే చెప్పాలి. దాంతో శవాలు కాల్చడానికి కూడా కాళీ లేకుండా పోయింది. ఇక మరోపక్క ఇండియా పరిస్థితి కూడా అలా కాకూడదనే మోదీ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. …
Read More »మూలపడిన అత్యవసర సర్వీసులు ఇప్పుడు ప్రాణం పోసుకుని ప్రాణదాతలుగా నిలుస్తున్నాయి.
వైసీపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా అత్యవసర సేవలపై స్పందించారు. ఒక్క ఫోన్ కాల్ తో ఇంటి ముంగిటికి వచ్చే 108, 104 అంబులెన్సు సర్వీసులను సిఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే జగన్ గారు పరిపుష్ఠం చేశారు. ఆపత్కాలంలో వాటి లభ్యతతో ప్రజలు నిశ్చింతగా ఉన్నారు. మూలపడిన ఈ అత్యవసర సర్వీసులు ఇప్పుడు ప్రాణం పోసుకుని ప్రాణదాతలుగా నిలుస్తున్నాయి. మరో ట్వీట్ లో “అసెంబ్లీ, రెవిన్యూ …
Read More »కరోనాపై ముఖ్యమంత్రి జగన్ తాజా రివ్యూ
1. రాష్ట్రంలో కరోనా పరిస్థితి, పాజిటివ్ కేసుల సంఖ్యపై వివరాలు అందించిన అధికారులు. వారు కోలుకుంటున్న తీరును వివరించారు. 2. కరోనా సోకిన 80.9 శాతం మంది ఐసోలేషన్లోనే ఉంటూ కోలుకుంటున్నారు. 13.8శాతం మంది ఆస్పత్రిలో చేరుతున్నారు. వారిలో 4.7శాతం ఐసీయూలో చికిత్స పొందారు. వీరిని దృష్టిలో ఉంచుకుని అత్యుత్తమ వైద్యం కోసం విశాఖపట్నంలో విమ్స్, విజయవాడ, తిరుపతి, అనంతపురములలో ఆస్పత్రులు. దాదాపు 1300 బెడ్లు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. …
Read More »రాజ్యసభ వాయిదా నేపధ్యంలో ఏపీ బడ్జెట్ సమావేశాలపై ప్రతిష్టంభన
కరోనా ప్రభావంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేసిన తరుణంలో రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ప్రతిష్టంభన నెలకొంది. ప్రస్తుత పరిస్థితుల్లో శాసనసభ బడ్జెట్ సమావేశాలను నిర్వహించకపోవడమే మంచిదన్న అభిప్రాయం వివిధ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. దీనిపై సమీక్షించిన సీఎం జగన్ బడ్జెట్పై ఆర్జినెన్స్ జారీ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈనెల 26న రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ఉంది. దీనిలో ఓటు వేసేందుకు ఎమ్మెల్యేలందరూ ఆ రోజున …
Read More »జైల్లో ఖైదీలను విడుదల చేయాలని సీఎం జగన్ కు సీపీఐ రామకృష్ణ లేఖ
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాసారు. కరోనా విపత్తు నేపథ్యంలో జైళ్ళలో ఉన్న ఖైదీలను బెయిల్/పెరోల్ లపై విడుదల చేసేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. కరోనా సహాయక చర్యలకై రాష్ట్ర ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించినందుకు అభినందనల తెలిపిన ఆయన ఒక్కో రేషన్ కార్డుకు మీరు ఇస్తానన్న వెయ్యి రూపాయల సహాయం ఏమాత్రం సరిపోదని, నలుగురు ఉన్న ప్రతి కుటుంబానికి రు.10 వేలు ఆర్థిక …
Read More »