ఏపీలో ఘోర పరాజయం తర్వాత చంద్రబాబు మారుతాడు తెలుగు తమ్ముళ్లు అనుకున్నారు కానీ…ఏ మాత్రం మారలేదని బాబుగారి చేష్టలే చెబుతున్నాయి. ఓటమిని హుందాగా ఒప్పుకోవాల్సి పోయి అసలు ఎందుకు ఓడిపోయామో అర్థం కావడం లేదంటూ బాబుగారు ఇంకా తనను తాను మోసం చేసుకుంటూనే ఉన్నాడు. ఇక బాబుగారు తన హయాంలో జరిగిన అవినీతిపనులను, చర్యలను 50 రోజుల జగన్ పాలనలో జరిగినట్లు ప్రచారం చేస్తూ….ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తూ అభాసు పాలవుతున్నారు. …
Read More »ఏపీలో పెట్టుబడులు పెట్టేవారికి ఒకే ఒక్క కండిషన్ పెట్టిన జగన్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయవాడ గేట్‌వేలో హోటల్ లో డిప్లొమాటిక్ ఔట్రీచ్ సదస్సును ప్రారంభించారు. శుక్రవారం ఉదయం జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సు ప్రారంభించారు. కీలక రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సదస్సులో సీఎం జగన్ కీలక ఉపన్యాసం చేపారు. రాష్ట్రంలో పారిశ్రామిక విధానంపై ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడారు. అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం పెట్టుబడులు, టూరిజం, హెల్త్ …
Read More »నవ్యాంధ్ర పెట్టుబడులకు అనుకూలం..!
నవ్యాంధ్రలో పెట్టుబడులకు అవకాశాలు మెండుగా ఉన్నాయని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అన్నారు. అవినీతి రహిత పాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. విదేశాంగ శాఖ సహకారంతో విదేశీ రాయబారులతో అమరావతిలో నిర్వహించిన పరస్పర అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి 35 దేశాల నుంచి దౌత్యవేత్తలు, ప్రతినిధులు హాజరయ్యారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ‘డిప్లొమాటిక్ అవుట్ రీచ్’ పేరిట ఈ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుస్థిరమైన …
Read More »ఎంపీడీవో చాంబర్ లో 61 మంది టీడీపీ కార్యకర్తల పేర్లు మార్చిన కరణం బలరాం..జగన్ సర్కార్ సీరియస్
చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి గ్రామ వలంటీర్ల ఎంపిక సందర్భంగా దౌర్జన్యానికి దిగారు. అధికారులు ఎంపిక చేసిన అర్హుల జాబితాను పక్కన పడేసి తమ కార్యకర్తల పేర్లు చేర్చాలంటూ నానాయాగీ చేశారు. చీరాల ఎంపీడీవో చాంబర్ తలుపులు మూసేసి కంప్యూటర్ను స్వాధీనం చేసుకుని అందులో 61 మంది టీడీపీ కార్యకర్తల పేర్లు చేర్చి ప్రత్యేక జాబితా తయారు చేశారు. ఆ జాబితాపై సంతకం చేయాలంటూ కరణం బలరాం ఎంపీడీవో వెంకటేశ్వర్లుకు …
Read More »సత్తెనపల్లి టీడీపీలో ముసలం..కోడెలకు రాయపాటి చెక్….!
సత్తెనపల్లి, నరసరావుపేటలలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్, ఆయన ఫ్యామిలీ సాగించిన అరాచకం అంతా ఇంతాకాదు..కాదేది కబ్జాలకు అనర్హం అన్నట్లుగా రియట్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి, ఇండ్ల స్థలాలు, అపార్ట్మెంట్ల వరకు కోడెల ఫ్యామిలీ కబ్జాలకు అంతే లేకుండా పోయింది. “కే” ట్యాక్స్ పేరుతో కోడెల ఫ్యామిలీ సాగించిన వసూళ్ల దందాకు సొంత టీడీపీ నేతలే విస్తుపోయారు. కోడెల కుమారుడు శివప్రసాద్, కూతురు విజయలక్ష్మీలపై బాధితులు కేసులు పెట్టడంతో వారిపై …
Read More »ఎన్నిరోజులైన బాబుకి బుద్ధి రాదు..విజయసాయి రెడ్డి ఫైర్
వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై విరుచుకుపడ్డారు. ప్రజా తీర్పు వచ్చి మూడు నెలలైనా ఎందుకు ఓడిపోయానో తెలియదనడానికి సిగ్గనిపించట్లేదా చంద్రబాబు గారూ? పాడి ఆవులాంటి ప్రభుత్వ ఖజానాను పిండుకున్నది తమరే కదా. ప్రజల నోటికాడ ముద్దను తిన్నది కాక మీకు మీరు గోమాతగా అభివర్ణించుకోవడం పెద్ద జోక్ అని అన్నారు. మరో ట్వీట్ లో.. అవినీతి కేసులు పెట్టకుండా …
Read More »పోలవరం ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం పోలవరం ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. కాఫర్ డ్యాం కారణంగా ముంపుకు గురైన ప్రాంతాలను హెలికాప్టర్ ద్వారా పరిశీలించనున్నారు. పోలవరం మండలంలోని 19 గ్రామాలకు 10 రోజులుగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన విషయం తెలిసిందే. ఢిల్లీ పర్యటన ముగించుకుని గన్నవరం చేరుకున్న ముఖ్యమంత్రి నేరుగా హెలికాప్టర్లో ఏరియల్ సర్వేకు బయల్దేరి వెళ్లారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, …
Read More »జనసేనకు సీబీఐ మాజీ జేడీ గుడ్‌బై… పవన్‌తో ఎక్కడ చెడింది…?
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ త్వరలో జనసేన పార్టీని వీడనున్నట్లు విశ్వసనీయ సమాచారం…జనసేన పార్టీ కీలక కమిటీలలో లక్ష్మీ నారాయణకు చోటు దక్కలేదు…దీనికి తోడు పవన్‌ను కలిసేందుకు కూడా ఈ మాజీ జేడీ రావడం లేదు…దీంతో పవన్‌కు లక్ష్మీ నారాయణల మధ్య సత్సంబంధాలు లేవని, త్వరలో జనసేన పార్టీకి ఆయన గుడ్‌బై చెప్పడం ఖాయమని ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జేడీ లక్ష్మీ నారాయణ…జగన్‌పై అక్రమాస్థుల కేసులు …
Read More »వ్యవసాయం రంగం ఎలా ఉండబోతుంది…?
ఏపీ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ పాలన 50 రోజులు పూర్తైన సందర్భంగా దరువు మీడియా సర్వే నిర్వహించింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న ప్రభుత్వ పధకాలు, కొత్త సీఎం జగన్ పనితీరు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వ్యవహరిస్తున్న తీరు, గ్రామ వలంటీర్లు, రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం, పక్క రాష్ట్రం తెలంగాణతో, కేంద్రంతో సీఎం వ్యవహరిస్తున్న తీరు వంటి అంశాలపై దరువు సమగ్రంగా సర్వే నిర్వహించింది. గతంలో దరువు నిర్వహించిన …
Read More »మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా వాసిరెడ్డి పద్మ
ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం జీవో విడుదల చేసింది. కాగా ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికి నన్నపనేని రాజకుమారి బుధవారం రాజీనామా చేసిన విషయం విదితమే. ఈ మేరకు తన రాజీనామా లేఖను గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు అందచేయడంతో.. ఆయన ఆమోదించారు.
Read More »