ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. మేనిఫెస్టోలో నవరత్నాల ద్వారా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడమే లక్ష్యంగా బడ్జెట్‌కు రూపకల్పన చేసింది. ఈ సందర్భంగా మంత్రి ప్రసంగిస్తూ…‘ మహాత్ముని లక్ష్యాన్ని సాధించే దిశగా మా బడ్జెట్ ఉంది. పేదల కన్నీళ్లు తుడిచే దిశగా ప్రభుత్వం చర్యలు ఉంటాయి. ధృడమైన మార్పు రాష్ట్ర రాజకీయాల్లో మొదలైంది. న్యాయపరమైన నియమాలకు లోబడే రాజకీయాలు చేస్తాం. …
Read More »వైఎస్ వివేకా హత్య కేసులో గంగిరెడ్డికి నార్కో అనాలిసిస్ టెస్ట్‌కు కోర్టు అనుమతి…
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎర్ర గంగిరెడ్డికి నార్కో అనాలిసిస్ టెస్ట్ నిర్వహించేందుకు పులివెందుల కోర్టు శుక్రవారం నాడు అనుమతిని ఇచ్చింది. వివేకానందరెడ్డి హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డిని డిఎస్పీ వాసుదేవన్ విచారిస్తున్నారు. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారని గంగిరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఈ టెస్ట్ నిర్వహించాలని పోలీసులు పులివెందుల కోర్టులో పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ …
Read More »మేం తలుచుకొంటే మీరు అసెంబ్లీలో కూర్చోలేరు..జగన్ ఫైర్
టీడీపీ సభ్యులపై ఏపీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం తలుచుకొంటే మీరు మాట్లాడలేరని ఆయన టీడీపీ సభ్యులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కూర్చోవయ్యా కూర్చోవయ్యా అంటూ జగన్ టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడుపై వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాడు ఏపీ అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా అధికార , విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకొంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ వడ్డీలేని రుణాలపై …
Read More »ఏపీ అసెంబ్లీలో టీడీపీ నేతలు రచ్చ రచ్చ..వైఎస్ జగన్ స్ట్రాంగ్ కౌంటర్
సున్న వడ్డీ పథకాన్ని బ్రహ్మాండంగా అమలు చేశామని చంద్రబాబు నాయుడు చెబుతున్నారని వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. సున్నావడ్డీ పథకం పూర్తిగా సున్నా అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. శుక్రవారం అసెంబ్లీలో ఈ పథకంపై చర్చ సందర్భంగా వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ గత టీడీపీ ప్రభుత్వ తీరునుఎండగట్టారు. ఓ దశలో ముఖ్యమంత్రి ప్రసంగానికి విపక్ష సభ్యులు అడ్డుపడ్డుకున్నారు. …
Read More »ఏపీ బడ్జెట్ ఇదే..మాట నిలబెట్టుకున్న వైఎస్ జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం తొలిసారిగా ప్రవేశపెడుతున్న రాష్ట్ర బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నేటి (శుక్రవారం) ఉదయం 12.22 గంటలకు అసెంబ్లీలో తొలిసారిగా రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. నవరత్నాల అమలే ప్రభుత్వ బడ్జెట్ అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఇప్పటికే స్పష్టం చేశారు. వైసీపీ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన మ్యానిఫెస్టోను అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత అని …
Read More »ఐదేళ్ల టీడీపీ పాలనలో బీజేపీతో ప్రేమాయణం సాగించాం.. ఇప్పుడు తాళి కట్టించుకున సంసారం చేస్తాం..
త్వరలోనే తమపార్టీ బిజెపిలో విలీనమవుతుందని తెలుగుదేశంపార్టీ మాజీ శాసనసభ్యుడు జేసీప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తామే బీజెపితో తాళి కట్టించుకుంటామని, బీజెపితో కలిసి మళ్లీ పనిచేస్తామన్నారు. తాజాగా ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాము కొత్తగా బీజేపీతో జతకట్టడంలేదని, గత ఐదేళ్ల టీడీపీపాలనలో బీజేపీతోనే ప్రేమాయణం సాగించామనన్నారు. ఇప్పుడు మాత్రం తాళి కట్టించుకుని సంసారం చేస్తామన్నారు. ఏపీ అసెంబ్లీలో టీడీపి ఎమ్మెల్యేలే …
Read More »తిరుపతి రైల్వే స్టేషన్ 24గంటలు రైల్వే పోలీసుల డేగకళ్లతో నిఘా..ఎందుకో తెలుసా
తిరుపతి రైల్వే స్టేషన్‌లో పోలీసుల నిఘా ఇటీవల పెంచారు. ప్రయాణికులకు సరైన భద్రత కల్పించడంతోపాటు ఎర్రచందనం స్మగ్లర్ల జాడను గుర్తించే దిశగా అడుగులు వేస్తున్నారు. తిరుపతి రైల్వే స్టేషన్ కేంద్రంలో పలు ప్రాంతాల నుంచి ఎర్రచందనం స్మగ్లర్లు చేరుకుంటున్నట్లు సమాచారం అందడంలో తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రధానంగా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న రైళ్లను నిశితంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీలు పలు బృందాలుగా వెళ్లి చేస్తున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. …
Read More »ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో తొలిసారిగా రాష్ట్ర వార్షిక బడ్జెట్
ఉదయం 9 గంటలకు ప్రశ్నఒత్తరాలతో సభ ప్రారంభం కాగా…మంత్రి బుగ్గన 11 గంటలకు అసెంబ్లీలో సాధారణ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. సుమారు 2.31 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.ఈమేరకు నవరత్నాలకు పెద్దపీట వేస్తూ బడ్జెట్ రూపకల్పన జరిగిందని సమాచారం… ఈ సందర్భంగా 2019-20 బడ్జెట్‌కు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. రూ.2లక్షల 27వేల 984 వందల 99 కోట్ల బడ్జెట్‌కు కేబినెట్ లాంఛనంగా ఆమోదం తెలిపింది. ఇదే సమయానికి శాసన మండలిలో …
Read More »టీడీపీ సున్నావడ్డీపై పక్కా ఆధారాలు ఉన్నాయన్న ..వైఎస్ జగన్
సున్నా వడ్డీ పథకంపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఈ అంశంపై చర్చకు అనుమతించాలంటూ ఆయన ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారామ్‌కు విజ్ఞప్తి చేశారు. సభా నాయకుడి అభ్యర్థన మేరకు సున్నా వడ్డీ పథకంపై స్పీకర్ అనుమతి ఇచ్చారు. సభా సాక్షిగా సున్నా వడ్డీ పథకంపై నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం వైఎస్ జగన్ చెబుతూ…. సున్నా …
Read More »సీఎం కేసీఆర్‌పై ఏపీ శాసనసభలో సీఎం జగన్ ప్రశంసలు.. !!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ శాసనసభలో ప్రశంసలు కురిపించారు. ఇరు రాష్ర్టాల మధ్య సఖ్యతకు సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలను జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు. గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలించాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయం ఎంతో గొప్పదన్నారు. సాగునీటి రంగంలో ఏపీకి సహకరిస్తున్న వ్యక్తిని విమర్శిస్తున్న చంద్రబాబు లాంటి ప్రతిపక్షనేత బహుశా ప్రపంచంలోనే మరొకరు ఉండరని జగన్ …
Read More »