ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడుపై పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలోని నల్లజర్లలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను అసభ్య పదజాలంతో దూషించారని వైసీపీ నాయకుడు రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నల్లజర్ల పోలీసులు ఈ రోజు అయ్యన్నపాత్రుడు ఇంటికి వెళ్లి ఆరా తీశారు. స్వయంగా అయ్యన్నపాత్రుడికి నోటీసులు ఇవ్వాలని పోలీసులు సూచించగా ఇంట్లో లేరని …
Read More »పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిని ఖరారు చేసిన చంద్రబాబు
ఏపీలో జరగనున్న వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కడప జిల్లా పులివెందుల నుంచి పోటీచేయబోయే పార్టీ అభ్యర్థి పేరును టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రవీంద్రనాథ్ రెడ్డి (బీటెక్ రవి) అక్కడ నుంచి పోటీ చేస్తారని తెలిపారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న బీటెక్ రవి.. పులివెందుల టీడీపీ ఇంచార్జ్ గా కొనసాగుతున్నారు. గతంలో జరిగిన 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన …
Read More »ఏపీకి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికాయం
ఏపీ అధికార వైసీపీకి చెందిన దివంగత నేత, మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్‌లోని నివాసం నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకు తరలించారు. ఉదయం ప్రత్యేక అంబులెన్స్‌లో మంత్రి పార్థివదేహాన్ని బేగంపేట ఎయిర్‌పోర్టుకు తరలించారు. అక్కడి నుంచి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక చాపర్‌లో గౌతమ్‌రెడ్డి భౌతికదేహాన్ని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు తరలించనున్నారు. చాపర్‌లో మంత్రి భౌతికకాయం వెంట తల్లి మణిమంజరి, సతీమణి శ్రీకీర్తి వెళ్ళనున్నారు. ఇప్పటికే మేకపాటి కుటుంబసభ్యులు, …
Read More »మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చనిపోయే ముందు ఏమి జరిగిందంటే..?
ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇంటి వాచ్‌మెన్ కీలక విషయాలు వెల్లడించాడు. ఉదయం 7 గంటల సమయంలో జిమ్‌కు వెళ్లేందుకు మంత్రి సిద్ధమయ్యాడు. అంతలోనే గుండెలో నొప్పి వస్తోందంటూ సోఫాలోనే కూర్చున్నారు. వెంటనే కుటుంబ సభ్యులను, గన్‌మెన్లను అప్రమత్తం చేశాం. వారు ఛాతీపై బలంగా ఒత్తినప్పటికీ ఆయనలో చలనం లేదు. దీంతో హుటాహుటిన జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించినట్లు వాచ్‌మెన్ చెప్పాడు.గౌతమ్ రెడ్డిని ఉదయం 7:45 గంటలకు ఆస్పత్రికి …
Read More »ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కన్నుమూత
ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (49) కన్నుమూశారు. ఇవాళ ఉదయం గుండెపోటు రావడంతో హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరిన ఆయన.. అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాగా ఆస్పత్రికి వచ్చేటప్పటికే గౌతమ్ పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని తెలుస్తోంది. దీంతో అత్యవసర చికిత్స అందించినప్పటికీ ప్రాణం నిలబడలేదు. ఆయన మరణించారన్న విషయాన్ని గౌతమ్ భార్యకు అపోలో వైద్యులు సమాచారం ఇచ్చారు. కాగా.. వారం రోజుల పాటు …
Read More »యాదాద్రి ఆలయ నిర్మాణం అద్బుతం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి ఆలయాన్ని అద్బుతంగా నిర్మాణం చేస్తున్నారని నగిరి ఎమ్మెల్యే రోజా కొనియాడారు. శనివారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి రోజా దర్శించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఈ కాలంలో ఏవరికి దక్కని అవకాశం కేసీఆర్‌కు దక్కిందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషించే విధంగా ఆలయం నిర్మాణం జరిగిందని తెలిపారు. ఇక్కడికి తీసుకువచ్చిన రాయి గుంటూరు నుంచి తీసుకు వచ్చారని, ఎప్పటికీ తెలుగువారు అన్నదముళ్ళు, …
Read More »CM KCR పై బండి సంజయ్ ఫైర్
జనగామ సభలో తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ బీజేపీపై చేసిన విమర్శలపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. ‘కేసీఆర్ చెల్లని రూపాయి. బహిరంగ సభలో బీజేపీపై విమర్శలు కాదు టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఏమిటో.. ఏం పీకారో చెప్పాలి. కేసీఆర్ సోయి లేకుండా మాట్లాడుతున్నారు. ఓడిపోతాననే భయంతోనే తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొడుతున్నారు’ అని బండి ఫైర్ అయ్యారు.
Read More »Apకి ప్రత్యేక హోదాపై కీలక అడుగు
ఏపీ ప్రత్యేక హోదా అంశంపై చర్చించేందుకు ఈనెల 17న ఢిల్లీకి రావాలని కేంద్ర హోంశాఖ నుంచి ఏపీ సీఎస్కు సమాచారం అందింది. హోదా ఇవ్వాలని వైసీపీ ఎంపీలు వరుసగా డిమాండ్ చేస్తుండటంతో పాటు ఇటీవల ఢిల్లీకి వెళ్లిన సీఎం జగన్ కూడా ఇదే విషయాన్ని కేంద్ర పెద్దల ఎదుట ప్రస్తావించారు. దీంతో ముగిసిపోయింది అనుకున్న ఈ అంశం మరోసారి తెరమీదకు వచ్చింది.
Read More »నిలకడగా వైసీపీ ఎంపీ ఆరోగ్యం
నిన్న పార్లమెంటులో అస్వస్థతకు గురైన ఏపీకి చెందిన అధికార పార్టీ వైసీపీ రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. రాజ్యసభ ముగిసిన అనంతరం షుగర్ లెవల్స్ తగ్గడంతో ఆయన కళ్లు తిరిగి పడిపోయారు. వెంటనే సహచర ఎంపీలు రాంమనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారు.
Read More »చంద్రబాబుకు విజయసాయి రెడ్డి సలహా
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు మాజీ సీఎం ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నానా ప్రయత్నాలు చేస్తున్నారని అధికార వైసీపీకి చెందిన సీనియర్ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. ‘ మాజీ సీఎం నారా చంద్రబాబ నాయుడు మీరు తప్పుల మీద తప్పులు చేస్తున్నావు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఈ రెండున్నరేళ్లలో డబ్బు వెదజల్లావు. ఎక్కడ …
Read More »