ఏపీలో కొత్తగా 11,303 మందికి కరోనా సోకింది. మరో 104 మంది కరోనాబారిన పడి మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా ఒక్కరోజే 20 మంది మరణించారు. ఇక ఒక్కరోజులోనే కరోనా నుంచి 18,257 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో 1,46,737 యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 93,704మందికి కరోనా టెస్టులు చేశారు.
Read More »మాజీ ఎంపీ మాగంటి బాబు ఇంట్లో మరో విషాదం
ఏపీకి చెందిన మాజీ ఎంపీ మాగంటి బాబు ఇంట మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన రెండో కుమారుడు రవీంద్ర నాథ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. హైదరాబాద్-బంజారాహిల్స్ రోడ్ నం.2లోని హయత్ ప్లాజాలో చనిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. రవీంద్రనాథ్ను అపోలోకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతికి కారణాలు తెలియలేదు. కాగా ఇటీవలే మాగంటి పెద్ద కుమారుడు రాంజీ అనారోగ్యంతో మృతి చెందారు.
Read More »మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కరోనా బారినపడిన ఎస్వీ ప్రసాద్.. నగరంలోని యశోద దవాఖానలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం కన్నుమూశారు. ఉమ్మడి ఏపీ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్ కుటుంబం ఇటీవల కరోనా బారిన పడింది. ఆయనతోపాటు కుంటుంబ సభ్యులు యశోద …
Read More »తీవ్ర అస్వస్థతకు గురైన తమ్మినేని సీతారాం
ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. గత రెండు రోజులుగా స్పీకర్ జ్వరంతో బాధపడుతున్నారు. ఇటీవలే స్పీకర్ దంపతులకు కరోనా సోకడంతో చికిత్స పొంది కోలుకున్న విషయం తెలిసిందే.
Read More »Big Breaking-ఆనందయ్య మందుపై ఏపీ సర్కారు సంచలన నిర్ణయం
ఏపీలో కరోనా మహమ్మారికి విరుగుడుగా నెల్లూరు ఆనందయ్య ఇస్తున్న మందులకు ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కళ్లలో వేసే డ్రాప్స్ తప్ప మిగితా అన్ని మందులకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. సీసీఆర్ఏఎస్ నివేదిక ప్రకారం ఆనందయ్య ఇచ్చే పి, ఎల్, ఎఫ్ మందులకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కంట్లో వేసే మందుపై ఇంకా నివేదికలు రాలేదని, అవి వచ్చాక ఆ మందుపై నిర్ణయం …
Read More »ఆనందయ్య మందుపై రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు
కరోనా వైరస్ ప్రస్తుతం విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు ఏదైన అద్భుతం జరిగితే బాగుండు అని ప్రజలందరు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఆనందయ్య అనే పేరు అందరిలో ఓ ఆశను కలిగించిది. ఆనందయ్య వేస్తున్న మందు వలన చాలా మంది కోలుకుంటున్నారని అందరు కృష్ణపట్నంకు క్యూలు కట్టారు. అయితే దీనిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు ఇది నాటు మందు …
Read More »ఏపీలో కరోనా కలవరం
ఏపీ కరోనా బులెటిన్ ను ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసింది.ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 91,120 శాంపిల్స్ను పరీక్షించగా.. 18,285 పాజిటివ్ కేసులు వచ్చాయి. 99 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 16,27,390కి చేరింది. కరోనాతో ఇప్పటివరకు 10,427 మంది మృతి చెందారు. 14,24,859 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,92,104 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇవాల్టి వరకు రాష్ట్రంలో 1,88,40,321 సాంపిల్స్న టెస్ట్ …
Read More »ఏపీలో తగ్గని కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 72,979 శాంపిల్స్ను పరీక్షించగా.. 15,284 పాజిటివ్ కేసులు వచ్చాయి. 106 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 16,09,105కి చేరింది. కరోనాతో ఇప్పటివరకు 10,328 మంది మృతి చెందగా.. 14,00,754 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,98,023 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,87,49,201 సాంపిల్స్న టెస్ట్ చేశారు.
Read More »ఆనందయ్య మందుపై జగ్గుభాయ్ సంచలన ట్వీటు
అటు ఏపీ ఇటు తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఆనందయ్య మందుపై సినీ నటులు సైతం స్పందిస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు.. తాజాగా నటుడు జగపతిబాబు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘ప్రకృతి మనల్ని కాపాడేందుకు వచ్చినట్లుగా అనిపిస్తోంది. ఆనందయ్య గారి మందు అన్ని అనుమతులను పొంది, ప్రపంచాన్ని కాపాడాలని ప్రార్థిస్తున్నాను. దేవుడు ఆయనను ఆశీర్వదించాలి.’ అని జగ్గుభాయ్ ట్వీట్ చేశాడు.
Read More »ఏపీలో కాస్త తగ్గిన కరోనా కేసులు
ఏపీ రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 58,835 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 12,994 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారినపడి 96 మంది మృతి చెందారు. మరోవైపు కరోనా నుంచి కోలుకొని 18,373 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,03,762 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా గత 24 గంటల్లో తూర్పు గోదావరిలో అత్యధికంగా 2652 కేసులు రాగా.. అత్యల్పంగా కృష్ణా జిల్లాలో 274 కేసులు నమోదయ్యాయి.
Read More »