Home / ANDHRAPRADESH / మాజీ ఎంపీ మాగంటి బాబు ఇంట్లో మరో విషాదం

మాజీ ఎంపీ మాగంటి బాబు ఇంట్లో మరో విషాదం

ఏపీకి చెందిన మాజీ ఎంపీ మాగంటి బాబు ఇంట మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన రెండో కుమారుడు రవీంద్ర నాథ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

హైదరాబాద్-బంజారాహిల్స్ రోడ్ నం.2లోని హయత్ ప్లాజాలో చనిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. రవీంద్రనాథ్ను అపోలోకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

మృతికి కారణాలు తెలియలేదు. కాగా ఇటీవలే మాగంటి పెద్ద కుమారుడు రాంజీ అనారోగ్యంతో మృతి చెందారు.