ఏపీ అధికార పార్టీ అయిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయనను వైద్య పరీక్షల నిమిత్తం సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి తరలించాలని ఆదేశించింది. వైద్య పరీక్షల పర్యవేక్షణకు జ్యూడీషియల్ అధికారిని నియమించాలని సూచించింది. వైద్య పరీక్షలను వీడియో రికార్డింగ్ చేసి నివేదికలను సీల్డ్ కవర్లో ఇవ్వాలని పేర్కొంది. రఘురామ బెయిల్ పిటిషన్ను శుక్రవారానికి వాయిదా వేసింది.
Read More »చంద్రబాబు వెన్నుపోటుకు బలైన ‘రాజు’
నాటి నాదెండ్ల నుంచి ఎన్టీఆర్, దగ్గుబాటి, జయప్రద, లక్ష్మీపార్వతి, రేణుకాచౌదరి నుంచి నిన్నటి మోత్కుపల్లి నరసింహులు, రేవంత్ రెడ్డి లాంటి వందలాదిమంది చంద్రబాబు కుటిల రాజకీయాలను నమ్మి ఆయన వలలో చిక్కుకుని సర్వనాశనం అయిపోయారు. ఆ తరువాతిరోజుల్లో వారంతా చంద్రబాబు సర్వనాశనమైపోవాలని, పురుగులుపడిపోవాలని బహిరంగంగా దూషించినవారే. మమతా, స్టాలిన్, దేవెగౌడ, కేజ్రీవాల్, కేసీఆర్, లాలూ ప్రసాద్, రాహుల్ గాంధీ, కుమారస్వామి లాంటి నాయకులు అందరూ చంద్రబాబును ఛీ కొట్టినవారే. చివరకు …
Read More »Mp రఘురామ కాళ్లు ఎందుకు రంగు మారాయంటే..?
తనను అరికాళ్లపై కర్రతో, రబ్బరు తాడుతో కొట్టారని రఘురామ రాజు దిగువ కోర్ట్‌లో వేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎల్లో మీడియా మరియు తెలుగుదేశం జనసేన సంబంధించిన సామాజిక మధ్యమలో దానిని చిలువలు, వలువలు చేసి..ఆ అరికాళ్ల ఫొటోలను పతాక శీర్షికలో ప్రచురించింది. అదే ఫొటోలనే తెలుగు దేశం పార్టీ వైరల్ చేసింది. అయితే..ఇదంతా కట్టు కథేనని…ఆయనకు ఎలాంటి గాయాలూ లేవని హైకోర్ట్ నియమించిన వైద్యుల కమిటీ ఆదివారం తేల్చడంతో ఎల్లో …
Read More »RRR ని ఏ జైలుకు తరలించారో తెలుసా..?
ఎంపీ రఘురామకృష్ణరాజుకు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. అధికారులు ఆయనను గుంటూరు జైలుకు తరలించారు. రఘురామకు పరీక్షలు నిర్వహించిన వైద్య బృందం గుంటూరు జిల్లా కోర్టులో మెడికల్ రిపోర్ట్‌ను సమర్పించింది. కాగా, పథకం ప్రకారం ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారిని కించపరిచే చర్యలకు పాల్పడుతూ సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్న నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ శుక్రవారం అరెస్టు చేసిన సంగతి విదితమే. ఈ కేసులో …
Read More »విజయసాయిరెడ్డికి అనిత కౌంటర్
సీఎంల కుమారులు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలుస్తుంటే చంద్రబాబు కుమారుడు లోకేశ్ మాత్రం ఓడిపోయారని ఎద్దేవా చేస్తూ YCP ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్కు TDP నేత వంగలపూడి అనిత కౌంటరిచ్చారు. YSR, స్టాలిన్, కేసీఆర్, ములాయం కుమారులు గెలిస్తే.. లోకేశ్ ఓడిపోయారని విజయసాయి ట్వీట్ చేశాడు.. దీనికి అనిత .. ‘మీరు చెప్పిన లిస్టులో జైలుకు వెళ్లిన CM కొడుకు ఒక్కడే.. వాయిదాలు తప్పించుకుని తిరుగుతుంది ఆ ఒక్కడే’ అంటూ …
Read More »సుప్రీం కోర్టుకు RRR
బెయిల్ కోసం వైసీపీ రెబల్ MP రఘు రామకృష్ణం రాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏపీ CID తనపై నమోదు చేసిన కేసులో.. బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేశారు. అది రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు MP రఘురామరాజుకు గుంటూరులోని సీఐడీ కోర్టు.. ఈ నెల 28 వరకు రిమాండ్ విధించింది. ఆయన కాళ్లపై గాయాలు ఉండటంతో జైలుకు తీసుకెళ్లకుండా, ఆస్పత్రికి తరలించాలని సూచించింది.
Read More »ఎంపీ రఘురామరాజుకి 14రోజులు రిమాండ్
ఏపీ అధికార పార్టీ వైసీపీకి చెందిన నర్సాపురం ఎంపీ రఘురామ రాజుకి ఈ నెల 28 వరకు రిమాండ్ విధించినట్లు సీఐడీ కోర్టు తీర్పునిచ్చింది. అయితే ఆయనకు వై కేటగిర భద్రతను కొనసాగించేందుకు సీఐడీ కోర్ట్ అనుమతించింది. ఈ మేరకు న్యాయవాది లక్ష్మీనారాయణ వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం రఘురామను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారని, ఆ తర్వాత అక్కడి నుంచి రమేష్ హాస్పిటల్‌లో వైద్యం అందిస్తారని …
Read More »ఏపీకి మరో 4.8లక్షల కొవిషీల్డ్ వ్యాక్సిన్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో 4.8 లక్షల కొవిషీల్డ్ వ్యాక్సిన్లు వచ్చాయి. పుణె సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు వ్యాక్సిన్ డోసులు చేరుకోన్నాయి… తొలుత వాటిని గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి ఆరోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు పంపనున్నారు. టీకాల కొరతతో ఇబ్బంది పడుతున్న వేళ.. తాజాగా వచ్చిన టీకాలతో కాస్త ఉపశమనం లభించనుంది.
Read More »సీఎం జగన్ కు లోకేష్ సలహా
ఏపీలో పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని మాజీ మంత్రి,ఎమ్మెల్సీ నారా లోకేశ్ జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరో 3 వారాల్లో పరీక్షలు ప్రారంభం కానున్నందున కరోనా ఉద్ధృతి దృష్ట్యా అందరినీ పాస్ చేయాలని సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి లేఖ రాశారు. తెలంగాణ సహా 12 రాష్ట్రాలు ఇప్పటికే పరీక్షలను రద్దు చేశాయని గుర్తు చేశారు. విద్యార్థులు ఒత్తిడికి లోనవుతున్నారని, హైకోర్టు ఆదేశాలు లేదా ప్రతిపక్ష ఆందోళనల …
Read More »సీఎం జగన్ అసంతృప్తి
కరోనా బాధితులకు టీకాల కొరత ఏపీలోనే కాదు దేశమంతటా ఉందని సీఎం జగన్ అన్నారు. డబ్బులు ఇస్తామని చెప్పినా టీకాలు ఇచ్చేందుకు ఫార్మా కంపెనీలు రెడీగా లేవని సీఎం జగన్ తెలిపారు. టీకాల పంపిణీ కేంద్రం నియంత్రణలో ఉంటుందని తెలిసి కూడా ప్రతిపక్షాలు, మీడియా తమపై విమర్శలు చేస్తున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రానికి దాదాపు 7 కోట్ల డోసులు ఇవ్వాల్సి ఉంటే ఇప్పటివరకు కేంద్రం నుంచి 73 లక్షల …
Read More »