Breaking News
Home / ANDHRAPRADESH / చంద్రబాబు వెన్నుపోటుకు బలైన ‘రాజు’

చంద్రబాబు వెన్నుపోటుకు బలైన ‘రాజు’

నాటి నాదెండ్ల నుంచి ఎన్టీఆర్, దగ్గుబాటి, జయప్రద, లక్ష్మీపార్వతి, రేణుకాచౌదరి నుంచి నిన్నటి మోత్కుపల్లి నరసింహులు, రేవంత్ రెడ్డి లాంటి వందలాదిమంది చంద్రబాబు కుటిల రాజకీయాలను నమ్మి ఆయన వలలో చిక్కుకుని సర్వనాశనం అయిపోయారు. ఆ తరువాతిరోజుల్లో వారంతా చంద్రబాబు సర్వనాశనమైపోవాలని, పురుగులుపడిపోవాలని బహిరంగంగా దూషించినవారే. మమతా, స్టాలిన్, దేవెగౌడ, కేజ్రీవాల్, కేసీఆర్, లాలూ ప్రసాద్, రాహుల్ గాంధీ, కుమారస్వామి లాంటి నాయకులు అందరూ చంద్రబాబును ఛీ కొట్టినవారే. చివరకు సొంత తమ్ముడిని కూడా ఇనుపగొలుసులతో బంధించి ఇంట్లో గదిలో పారేసిన చంద్రబాబు చరిత్ర తెలుగురాష్ట్రాల్లో అందరికీ తెలుసు. చివరకు ఇతర రాష్ట్రాల నాయకులు, పార్టీల అధినేతలు, ముఖ్యమంత్రులు సైతం చంద్రబాబును విశ్వాసఘాతకుడిగా, ద్రోహిగా నిందించి దూరంగా కూర్చోబెట్టినవారే.

చంద్రబాబు వెన్నుపోటు చరిత్ర తెలిసి కూడా రామకృష్ణరాజు ఆయన వలలో చిక్కుకుని ఇప్పుడు విలవిలలాడిపోతున్నారు. ఆయన్ను రెచ్చగొట్టి ఆడుకున్న చంద్రబాబు బాగున్నాడు, లోకేష్ బాగున్నాడు, టివి 5 , ఏబీఎన్ ఛానెల్ వారంతా శుభ్రంగా ఉన్నారు. రాజు మాత్రం జైలుపాలై తన పాపానికి శిక్ష అనుభవిస్తున్నాడు. ఆయనకు బెయిల్ వచ్చే అవకాశం ఉన్నది. కానీ, కనీసం మూడు రాత్రులైనా ఆయన పోలీస్ స్టేషన్లో నిద్రచెయ్యాల్సివచ్చిందా లేదా? రాజభవనంలో దర్జాగా మందీమార్బలం మధ్య జీవించే వ్యక్తి మరో పన్నెండు రోజులపాటు ఆసుపత్రి గదిలో ఖైదీగా కాలక్షేపం చేయాల్సివచ్చింది. మరి ఆ పాపం ఎవరిదీ? ఇవాళ రామకృష్ణరాజు రాజకీయాల్లో ఒంటరి. నియోజకవర్గంలో అయ్యో పాపం అనేవాడు లేడు.

ఆ రెండు కులగజ్జి చానెళ్లు మినహా ఎవ్వరూ ఆయన్ను పట్టించుకోవడం లేదు. యు ట్యూబ్ ఛానెళ్ల వాళ్ళు కూడా రాజుగారిని చూసి పరిహసిస్తూ నవ్వుతున్నారు. ఆయనకు వ్యతిరేకంగా వెటకారంగా ప్రసారాలు చేస్తున్నారు. జర్నలిస్టులు పట్టించుకోవడం లేదు. ఆయన కులస్తులు కూడా ఉమ్మేస్తున్నారు. ఇదీ రాజుగారు సాధించిన ఘనత! రాజు గారు తనను అంత దూషిస్తున్నా, కులం పేరుతో తిడుతున్నా, పిచ్చోడని, మూర్ఖుడని బహిరంగంగా ఎగతాళి చేస్తున్నా జగన్ మౌనంగా ఎందుకు ఉంటున్నాడు? ఆయనకు పౌరుషం లేదా? అని వారి పార్టీ వారే అసహనం వ్యక్తం చేస్తున్నారు.

జగన్కు లేనిది పౌరుషం కాదు. ఉన్నది బుద్ధికుశలత, రాజకీయ పరిణితి. ఒకటిరెండు సార్లు తిట్టినపుడే కేసులు పెట్టి జైల్లో తోస్తే రాజుగారికి విపరీతమైన సానుభూతి లభించేది. జగన్ కక్ష సాధిస్తున్నాడని విమర్శించేవారు. కానీ, గత ఏడాదిన్నరగా రాజుగారి దూషణలు, ఆయన స్థాయికి ఏమాత్రం తగని వెటకారాలు, కులదూషణలు, ప్రజల్లోకి బాగా ఎక్కాయి.

జనం జగన్ సహనాన్ని ప్రశంసించే స్థాయికి రాజుగారు తన అతి ప్రవర్తనతో తీసుకెళ్లారు. అందుకే ఈరోజు ఒక్కరు కూడా జగన్ను విమర్శించడం లేదు. సమయం చూసి శత్రువును ఎలా దెబ్బ తియ్యాలో జగన్ను చూసి నేర్చుకోవాలి. అందుకు ఎంతో ఓర్పు అవసరం.

> ఇలపావులూరి మురళీ మోహనరావు,
హైదరాబాద్.