తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి నిర్మాత సీ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల ధరలపై మాట్లాడిన ఆయన.. ఇదే సమయంలో ఇండస్ట్రీలో ఇన్‌ఫ్లూయెన్స్ చేసే వ్యక్తులు కరవయ్యారని చెప్పారు. దాసరి నారాయణరావు చనిపోవడంతో ఆ లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల ధరలపై పెంపుదలపై ఏపీ ప్రభుత్వం మరోసారి ఆలోచన చేయాలని సీ కళ్యాణ్ కోరారు. ఇద్దరు తెలురు రాష్ట్రాల …
Read More »దుమ్ము లేపోతున్న RRR ట్రైలర్
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం రౌద్రం రణం రుధిరం. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ సినిమా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా కోసం సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత కొద్ది రోజులుగా మూవీ ప్రమోషనల్ కార్యక్రమాలు చేపడుతుండగా, కొద్ది సేపటి క్రితం చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. ఇందులో విజువల్స్ స్టన్నింగ్‌గా …
Read More »మరోసారి ఆ దర్శకుడితో మెహ్రీన్
స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో యంగ్ బ్యూటీ మెహ్రీన్ మరోసారి నటించే అవకాశం అందుకుందని తాజా సమాచారం. మాస్ మహారాజా రవితేజతో నటించిన ‘రాజా ది గ్రేట్’ సినిమాలో హీరోయిన్‌గా మెహ్రీన్ నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ‘ఎఫ్ 2’ సినిమాలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కు జంటగా నటించింది. ప్రస్తుతం రూపొందుతున్న ‘ఎఫ్ 3’ మూవీలోనూ మెహ్రీన్ వరుణ్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూడు …
Read More »సీరియల్ నటి లహరి కారు బీభత్సం
సీరియల్ నటి లహరి కారు అతివేగంగా నడుపుతూ బైక్‌ను ఢీ కొట్టింది. బైకుపై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలవ్వడంతో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. శంషాబాద్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులతో లహరి వాగ్వాదానికి దిగింది. తన భర్త వచ్చి మాట్లాడతారంటూ కారులోనే ఉండిపోయింది. గాయపడిన వ్యక్తికి ఆస్పత్రి ఖర్చులు భరిస్తామని చెప్పడంతో ఎలాంటి కేసు నమోదు కాలేదు.ఔటర్ రింగ్ రోడ్‌పై ప్రైవేట్ పెట్రోలింగ్ వాహనం …
Read More »Bollywood లోకి అఖండ
తెలుగులో అఖండ విజయాన్ని అందుకున్న ‘అఖండ’ సినిమాపై బాలీవుడ్ ఇండస్ట్రీ కన్నేసిందని టాక్. అఘోరా క్యారెక్టర్, డైలాగ్స్, యాక్షన్ సీన్స్ ఓ రేంజ్లో ఉండటంతో రీమేక్ రైట్స్ కొనాలని సాజిద్ నడియాడ్ లాంటి ప్రొడ్యూసర్లు ప్లాన్ చేస్తున్నారట. ఈ కథకు కొంచం కమర్షియల్ టచ్ ఇస్తే మంచి హిట్ అవుతుందని భావిస్తున్నారట. ఇందులో హీరోగా అక్షయ్ కుమార్ లేదా అజయ్ దేవ్ ను లాంటి స్టార్లను తీసుకోవాలని చూస్తున్నట్లు సమాచారం.
Read More »డిసెంబర్ 9న స్టార్ హీరోయిన్ పెళ్ళి
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి పనులు చకచకా జరుగుతున్నాయి. డిసెంబర్ 9న వీరి వివాహం రాజస్థాన్లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ జరగనుంది. తాజాగా కత్రినా.. విక్కీ ఇంటికి వెళ్లడంతో పెళ్లితంతు మొదలైనట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే సెలబ్రెటీలకు ఆహ్వానం అందింది. కానీ కత్రినా మాజీ లవర్స్ సల్మాన్ ఖాన్, రణ్వీర్కు, విక్కీ ఎక్స్ గర్ల్ఫ్రెండ్ హర్లీన్ సేతికి ఇన్విటేషన్ రాలేదట.
Read More »‘సెమీన్యూడ్ ఫొటోషూట్’ పై పాయల్ రాజ్ పుత్ క్లారిటీ
హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఇటీవల చేసిన ఓ ‘సెమీన్యూడ్ ఫొటోషూట్’ తీవ్రమైన ట్రోలింగ్ కి దారి తీసింది. ఇన్నాళ్లు సైలంట్ గా ఉన్న పాయల్.. తాజాగా ఆ ఫొటోషూట్పై స్పందించింది. ఫొటోషూట్ అన్నాక పొరపాట్లు జరుగుతుంటాయని చెప్పింది. ‘ఈ ట్రోల్స్ నా కుటుంబం ఇబ్బంది పడింది. ఇంటికి తిరిగి రావాలని మా అమ్మ నన్ను కోరింది. అయితే.. నాకు దీన్ని ఎదుర్కొనే శక్తి ఉందని అమ్మతో చెప్పాను’ అని …
Read More »Big Boss హౌస్ నుంచి ప్రియాంక సింగ్ ఎలిమినేట్
ఊహించినట్టే 13వ వారంలో Big Boss హౌస్ నుంచి ప్రియాంక సింగ్ ఎలిమినేట్ అయింది. అయితే షో నుంచి వెళ్లిపోతున్నానన్న బాధ కంటే మానసు దూరమవుతున్నానన్న బాధే ఆమెలో ఎక్కువ ఉన్నట్లు కనిపించింది. మరోవైపు పింకీ వారానికి రూ.1.75 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు తీసుకుందనే టాక్ వినిపిస్తోంది. దీంతో మొత్తంగా 13 వారాలకు దాదాపు రూ.25 లక్షలు వెనకేసుకున్నట్లు తెలుస్తోంది.
Read More »దుమ్ము లేపుతున్న బంగార్రాజు Latest Song Promo
మనం, ప్రేమమ్ సినిమాలలో తన తండ్రితో కలిసి సందడి చేసిన నాగ చైతన్య ఇప్పుడు బంగార్రాజు చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. చిన్న బంగార్రాజుగా నాగ చైతన్య అదరగొట్టారు. ఇటీవల చైతూకి సంబంధించిన టీజర్ విడుదల కాగా,ఇది ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తుండగా, మూవీ ప్రమోషన్స్ జోరుగా పెంచుతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘నా కోసం’ అంటూ సాంగ్ ప్రోమో విడుదల చేశారు. …
Read More »