మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన మొదటి సినిమా ‘విజేత’. ఈ సినిమాతో టాలీవుడ్లో మంచి గుర్తింపే తెచ్చుకున్నాడు. ఇదే క్రమంలో ఇప్పుడు ‘కిన్నెరసాని’ అనే సినిమాతో రాబోతున్నాడు. తాజాగా టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ‘అశ్వద్ధామ’ ఫేమ్ రమణతేజ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీకి ‘అతి సర్వత్ర వర్జయత్’ అనేది ఉప శీర్షిక. సాయి రిషిక సమర్పణలో ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ – శుభమ్ ఎంటర్టైన్మెంట్స్ …
Read More »ప్రియాంక చోప్రాకి గాయాలు
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకి గాయాలయ్యాయని సోషల్ మీడియాలో వార్త ఒకటి వైరల్ అవుతోంది. ప్రస్తుతం ప్రియాంక ‘సిటాడెల్’ సినిమా కోసం షూటింగ్ లో పాల్గొంటోంది. దీనిలో భాగంగా ఆమెకి ముఖంపై గాయమైంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రియాంక చోప్రా షూటింగ్ సమయంలో తాను గాయపడినట్లు స్వయంగా ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా వెల్లడించింది. యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తునప్పుడు ప్రియాంకకు ఈ గాయాలు అయినట్టు తెలుస్తోంది. ఐ బ్రోపై …
Read More »చరణ్ మూవీలో జయరామ్
క్రియేటివ్ జీనియస్ శంకర్ – మెగా పవర్ స్టార్ రాం చరణ్ కాంబినేషన్లో ఓ పాన్ ఇండియా సినిమా మొదలవబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రముఖ మలయాళ నటుడు జయరామ్ కీలక పాత్రకి ఎంపికైనట్టు సమాచారం. ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’ సినిమాలు చేస్తున్న చరణ్, తన 15వ సినిమాగా శంకర్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. క్రేజీ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ చరణ్ సరసన నటిస్తోంది. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించబోతున్నాడు. శ్రీ …
Read More »అనసూయ నక్క తోక తొక్కిందా..?
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’. ఇటీవలే టైటిల్‌ను చిత్రబృందం విడుదల చేసింది. మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ‘లూసీఫర్’ మూవీకి అఫీషియల్ రీమేక్‌గా రూపొందుతోంది. ఒరిజినల్ వెర్షన్లో మంజు వారియర్ పోషించిన పాత్ర ఇక్కడ అనసూయకి దక్కిందని నెట్టింట వార్తలు వచ్చి వైరల్ అవుతున్నాయి. మోహన్ రాజా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఆచార్య షూటింగ్‌ను పూర్తి చేసుకున్న మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ షూటింగ్‌ను …
Read More »అక్టోబర్ 10న “మా” ఎన్నికలు
‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ ఎన్నికలు అక్టోబర్ 10న నిర్వహించనున్నట్టు ప్రస్తుత అధ్యక్షుడు వీకే నరేశ్ ప్రకటించారు. ఇటీవల ‘మా’ సర్వసభ్య సమావేశంలో ఎన్నికల విషయంలో క్రమశిక్షణ సంఘం (డీఆర్సీ) ఎలా చెబితే అలా చేస్తామని ఆయన తెలిపారు. వారంలో ఎన్నికల తేదీ ప్రకటిస్తామని డీఆర్సీ ఛైర్మన్ కృష్ణంరాజు అప్పుడు చెప్పారు. తాజాగా వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించమని… సెప్టెంబర్ 12 లేదా అక్టోబర్ 10 – నెలలో రెండో ఆదివారం …
Read More »అక్కినేని పేరు మార్పుపై సమంత క్లారిటీ
అక్కినేని వారి కోడలు, స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు చాలా పరిమితంగానే సినిమాలకు సైన్ చేస్తూ వస్తున్నారు. చైతన్యతో పెళ్లి తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు సమంత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మరోవైపు వ్యాపార రంగంలోనూ, సోషల్ మీడియాలోనూ బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని సందర్భాల్లో సామ్ తనకు తానుగా కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నారు. పెళ్లి తర్వాత సమంత అక్కినేని అంటూ తన ఇన్‌స్టా ప్రొఫైల్ …
Read More »బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్‌కి గాయాలు
బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్‌కి గాయాలయ్యాని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అభిషేక్ ‘బాబ్ బిశ్వాస్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే ఆయన తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్టు బీ టౌన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆయననని చూసేందుకు తండ్రి అమితాబ్ బచ్చన్, సోదరి శ్వేతా బచ్చన్ ఆసుపత్రికి వెళ్ళినట్టు తెలుస్తోం
Read More »పూజా హెగ్డేపై దర్శకుడు ఆర్కే సెల్వమణి సంచలన వ్యాఖ్యలు
స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేపై రోజా భర్త, దర్శకుడు ఆర్కే సెల్వమణి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకే సంవత్సరం ‘ముకుంద’, ‘ఒక లైలా కోసం’ సినిమాలతో తెలుగు తెరకి పరిచయమైంది పూజా హెగ్డే. ఈ రెండు సినిమాలు అంతగా సక్సెస్ కాలేదు. అదే సమయంలో బాలీవుడ్లో ఆఫర్ వస్తే అక్కడ హృతిక్ రోషన్‌తో మొహంజాదారో సినిమా చేసి భారీ ఫ్లాప్ అందుకుంది. మళ్ళీ టాలీవుడ్లో ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాలో …
Read More »ఓటీటీ లో నాని మరో సినిమా
కరోనా పరిస్థితులు సినిమా పరిశ్రమకు లేనిపోని తంటాలు తెచ్చిపెడుతున్నాయి. ఒకప్పుడు థియేటర్స్‌లో సందడి చేస్తూ అలరించే సినిమాలు ప్రస్తుతం ఓటీటీ బాట పడుతున్నాయి. నేచురల్ స్టార్ నాని తన సినిమాలను థియేటర్లోనే రిలీజ్ చేయాలని పట్టుబట్టుకు కూర్చుంటున్న అది కుదరడం లేదు. ఇప్పటికే నాని నటించిన వి చిత్రం ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా నాని నటించిన టక్ జగదీష్ చిత్రాన్ని తప్పక థియేటర్లో విడుదల చేస్తానని చెప్పిన …
Read More »ఓటీటీ లో నితిన్ మూవీ…
ఇప్పటికీ థియేటర్స్ అన్నీ తెరుచుకోకపోవడంతో చాలా సినిమాలు ఓటీటీ బాట పడుతున్నాయి. ఇటీవల తాను నటించిన టక్ జగదీష్ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయనున్నట్టు నాని ప్రకటించాడు. దీంతో టక్ జగదీష్ మూవీ రిలీజ్‌పై ఓ క్లారిటీ వచ్చింది. ఇక నితిన్ నటిస్తున్న మాస్ట్రో మూవీ కూడా ఓటీటీలో వస్తుందని జోరుగా ప్రచారం జరిగింది. ఆ ప్రచారం నిజం అయింది. ‘మాస్ట్రో’ చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ …
Read More »