దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. నిన్న 3.4 లక్షలకుపైగా కేసులు నమోదవగా, తాజాగా అవి 3.26 లక్షలకు తగ్గాయి. అయితే మృతులు మాత్రం పెరుగుతూనే ఉన్నారు. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 3,26,098 కేసులు నమోదయ్యాయి. మరో 3,890 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,43,72,907కు చేరింది. ఇందులో 2,04,32,898 మంది బాధితులు కోలుకోగా, 36,73,802 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 2,66,207 …
Read More »ఢిల్లీ సీఎం సంచలన నిర్ణయం
కొవిడ్ వల్ల తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులను ఆదుకునేందుకు ఢిల్లీ సర్కారు ముందుకొచ్చింది. ఆ పిల్లల చదువులకయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని CM అరవింద్ కేజీవాల్ వెల్లడించారు. తాము అనాథలమని బాధపడకూడదని, మీకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. కరోనా వల్ల ఇంట్లో సంపాదించే వ్యక్తిని కోల్పోయిన కుటుంబాలకూ ఆర్థికంగా అండగా ఉంటామని తెలిపారు.
Read More »దేశంలో త్వరలో సింగిల్ డోసు టీకా
దేశంలో త్వరలో సింగిల్ డోసు టీకా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. రష్యాకు చెందిన స్పుత్నిక్ లైట్ అనే సింగిల్ డోసు టీకా కోసం డాక్టర్ రెడ్డీస్, కేంద్రంతో చర్చలు జరుపుతోంది. అన్ని అనుమతులు లభిస్తే జులై నాటికి స్పుత్నిక్ లైట్ టీకా దేశంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీనికి రష్యాలో ఇప్పటికే అత్యవసర అనుమతి లభించింది. ఈ వ్యాక్సిన్ 79.4% సామర్థ్యంతో పనిచేస్తున్నట్లు రష్యా తెలిపింది.
Read More »మహారాష్ట్రలో కరోనా బీభత్సం
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి శాంతించట్లేదు. కొవిడ్ కేసులతో పాటు వైరస్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో అక్కడ కొత్తగా 42,582 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా, 850 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో 54,535 మంది కరోనా రోగులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,33,294 యాక్టివ్ కేసులు ఉన్నాయి. లాక్డౌన్ పెట్టిన కేసులు తగ్గట్లేదు.
Read More »వాహనదారులకు భారీ షాక్
బ్రేక్ లేకుండా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు షాక్ ఇస్తున్నాయి. తాజాగా ఆయిల్ కంపెనీలు పెట్రోల్ లీటర్కు 26 పైసలు, డీజిల్ లీటర్కు 34 పైసలు పెంచాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.95.13కు చేరగా డీజిల్ ధర రూ.89.47గా ఉంది. వ్యాట్ ఎక్కువగా ఉన్న కొన్ని రాష్ట్రాల్లో ధరలు రూ.100 దాటాయి. కొవిడ్ సంక్షోభంతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు పెరుగుతున్న పెట్రోల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.
Read More »దేశంలో కరోనా కేసులపై ఊరట
దేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య కాస్త తగ్గింది. వరుసగా 4 రోజులు 4 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా గత 24 గంటల్లో 3,66,161 పాజిటివ్ కేసులు వచ్చాయి. 3,754 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 2,26,62,575 నమోదు కాగా 2,46,116 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 3,53,818 మంది డిశ్చార్జ్ అయ్యారు. 37,45,237 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న దేశవ్యాప్తంగా 14,74,606 కరోనా టెస్టులు …
Read More »దేశంలో లాక్డౌన్ పెట్టండి
కరోనా కట్టడికి పలు రాష్ట్రాలు కర్ఫ్యూలు, లాక్డౌన్లు విధించగా.. కొన్నిచోట్ల కరోనా బాధితులకు సరైన చికిత్స అందడం లేదనే ఆరోపణలొస్తున్నాయి. దీంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కేంద్ర ఆరోగ్య శాఖకు లేఖ రాసింది. ‘దేశంలో లాక్డౌన్ పెట్టాలి. కరోనా నియంత్రణలో అలసత్వం ఎందుకు? కరోనా చైన్ నియంత్రించాలంటే లాక్డౌన్ తప్పనిసరి. లాక్ డౌన్ పెట్టడం వల్ల మౌలిక వైద్య సదుపాయాలు ఏర్పరచుకోవచ్చు’ అని IMA లేఖలో పేర్కొంది.
Read More »తమిళనాడులో లాక్డౌన్
ప్రస్తుతం కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో తమిళనాడు సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. మే 10 నుంచి మే 24 వరకు రెండు వారాల పాటు పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించాలని స్టాలిన్ సర్కారు నిర్ణయించింది. లాక్డ్ డౌన్ కాలంలో కిరాణా, కూరగాయలు, మాంసం దుకాణాలు మధ్యాహ్నం 12 వరకు తెరిచి ఉంచనున్నారు. మద్యం దుకాణాలతో సహా మిగతా ఏ షాపులకూ అనుమతి లేదు. పెట్రోల్ బంకులు తెరిచి ఉండనున్నాయి. …
Read More »ముత్తవెలు కరుణానిధి స్టాలిన్ “ప్రస్థానం”
తమిళ రాజకీయాలు లో 68 సంవత్సరాలు వచ్చిన యువ నాయకుడు గానే వెలుగొందారు.. తండ్రి చాటు బిడ్డ .. రష్యా సోషలిస్ట్ నాయకుడు జోసెఫ్ స్టాలిన్ చనిపోయిన 4 రోజులు కి స్టాలిన్ జన్మించారు.. అందుకే కరుణానిధి జోసెఫ్ స్టాలిన్ గుర్తుగా కొడుకు కి స్టాలిన్ అని పేరు పెట్టారు.. 14 ఏటా మేనమామ మురుసోలి మారన్ కి ఎన్నికల ప్రచారం లో పాల్గొన్నట ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. …
Read More »SBI కస్టమర్లకు హెచ్చరికలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేసింది. సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోవద్దని హెచ్చరించింది. డేట్ ఆఫ్ బర్త్, డెబిట్ కార్డు నెంబర్, PIN, CVV, OTP, ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ ID/పాస్వర్డ్ షేర్ చేసుకోవద్దు. SBI, RBI, KYC అథారిటీ నుంచి కాల్ చేస్తున్నామంటే నమ్మొద్దు. మెయిల్స్, కాల్స్ వచ్చే లింకులతో యాప్లు డౌన్లోడ్ చేసుకోవద్దు. సోషల్ మీడియాలో వచ్చే ఆఫర్లను …
Read More »