సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఇంట్లో విషాదం నెలకొంది. కరోనాతో ఆయన పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి కన్నుముూశారు. 34 ఏళ్ల వయసున్న ఆయనకు కొన్ని రోజుల క్రితం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మొదట హోలీ ఫ్యామిలీ ఆస్పత్రిలో ఆశిష్ ఏచూరికి చికిత్స అందించారు. కానీ పరిస్థితి విషమించడంతో గురుగ్రామ్‌లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆశిష్‌కు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం …
Read More »దేశంలో కరోనా మహాప్రళయం
దేశంలో కరోనా మహాప్రళయంగా మారుతోంది. కొత్త కేసుల సంఖ్య భయపెడుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3లక్షల 15వేల కేసులు వచ్చాయి. ప్రపంచంలో ఎక్కడా.. ఒక్క రోజు కేసులు ఇంత ఎక్కువగా నమోదు కాలేదు. రోజువారి మరణాలు2102చేరాయి. 24గంటల్లో అత్యధిక కేసులు నమోదు చేసింది దేశంగా నిలిచింది భారత్. రోజువారీ కేసుల్లో అమెరికాను దాటేసింది. కేవలం 17 రోజుల్లోనే రోజువారి కేసులు లక్ష నుంచి 3 లక్షలకు చేరాయి.
Read More »దేశంలో కరోనా మరణ మృదంగం
దేశంలో కరోనా మరణ మృదంగం మోగిస్తున్నది. రోజువారీ పాజిటివ్ కేసులతో పాటు రికార్డు స్థాయిలో మరణాలు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొవిడ్ రోజువారీ కేసులు దేశంలో కొత్తగా దాదాపు మూడు లక్షలకు చేరువవగా.. 2,023 మంది మరణించారు. కరోనా మహమ్మారి ప్రారంభం నుంచి ఇంత మొత్తంలో కరోనా కేసులు, మరణాలు నమోదవడం ఇదే తొలిసారి. 24 గంటల్లో 2,95,041 కొవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ …
Read More »ఢిల్లీ సర్కారు మరో సంచలన నిర్ణయం
లాక్డౌన్ విధింపుతో ఉపాధికి దూరమైన నిర్మాణ రంగ కూలీలను ఆదుకునేందుకు ఢిల్లీ సర్కారు ముందుకొచ్చింది. రిజిస్టర్ అయిన కూలీలకు రూ. 5,000 చొప్పున ఆర్థిక సాయం అందజేయాలని నిర్ణయించింది. ఢిల్లీలో ఇప్పటివరకు 1,71,861 మంది నిర్మాణ కూలీలు రిజిస్టర్ అయ్యారు. వీరికి రూ. 5,000 సాయం అందనుంది. ఇక రాష్ట్రంలోని వలస కూలీలకు వసతి, వైద్యం, భోజనం లాంటి సౌకర్యాలను పర్యవేక్షించేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేసింది.
Read More »రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ ఎం.నరసింహం (94) కన్నుమూత
భారతీయ బ్యాంకింగ్ సంస్కరణల పితామహుడు, రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ ఎం.నరసింహం (94) కన్నుమూశారు. కరోనాతో హైదరాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు RBI ప్రతినిధి ఒకరు తెలిపారు. 1977 మే నుంచి నవంబర్ మధ్య నరసింహం RBI గవర్నర్ బాధ్యతలు నిర్వర్తించారు. అంతకుముందు ఆర్థిక వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శిగా పనిచేశారు. వరల్డ్ బ్యాంక్, IMFలో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించారు.
Read More »కరోనా నేపథ్యంలో మహారాష్ట్ర సంచలన నిర్ణయం
కరోనా కట్టడికి రాష్ట్ర వ్యాప్తంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిన సంగతి విదితమే..అయిన కానీ కేసులు మాత్రం భారీగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి కోసం ప్రభుత్వం కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.. రాష్ట్ర వ్యాప్తంగా కఠిన లాక్డ్ డౌన్ విధించాలని పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. దీనిపై ఉన్నతాధికారులతో చర్చ అనంతరం సీఎం ఉద్ధవ్ ఠాక్రే లాక్డౌన్పై రేపు ప్రకటన చేయనున్నారు
Read More »రాహుల్ గాంధీకి కరోనా
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కరోనా బారిన పడ్డారు. వైద్య పరీక్షల్లో ఆయనకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. కోవిడ్ లక్షణాలు స్పల్పంగా కనిపించినట్టు రాహుల్ స్వయంగా ఓ ట్వీట్‌లో తెలిపారు. ఇటీవల కాలంలో తనను కలిసిన వారు సేఫ్టీ ప్రోటోకాల్‌ను పాటించాలని, సురక్షితంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారాన్ని రాహుల్ ఇటీవల రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించారు.
Read More »దేశంలో కరోనా విలయతాండవం
దేశాన్ని కరోనా మహమ్మారి కుదిపేస్తోంది. భారీ సంఖ్యలో నమోదవుతున్న కేసులు తీవ్ర ఆందోళనకరంగా మారాయి. దేశంలో ఒక్కరోజే కొత్తగా.. 2,59,170 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి కొత్తగా 1,761 మంది మృత్యువాత పడ్డారు. మొత్తం మృతుల సంఖ్య 1.80లక్షలకు చేరింది. ప్రస్తుతం దేశంలో 20,31,977 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా భారత్లో అత్యధిక కేసులు వచ్చాయి. మహారాష్ట్రలో భారీగా నమోదవుతున్నాయి.
Read More »దేశంలో ఐదుగురు సీఎంలకు కరోనా
కరోనావైరస్ దెబ్బకు సామాన్యుల నుంచి ప్రభుత్వాధినేతల వరకు ఎవ్వరూ తప్పించుకోవట్లేదు. ఇప్పటివరకు దేశంలో ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా బారిన పడ్డారు. తమిళనాడు సీఎం పళనిస్వామి, కేరళ సీఎం పినరయి విజయన్, కర్ణాటక సీఎం యడియూరప్ప, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఐసోలేషన్లో చికిత్స తీసుకుంటున్నారు. మాజీ ప్రధానులు దేవెగౌడ, మన్మోహన్ సింగ్ కూడా కరోనా బారిన పడ్డారు.
Read More »కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ నానాటికీ విజృంభిస్తోంది. అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. తాజాగా వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికి వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది
Read More »