దేశంలో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. రికార్డు స్థాయిలో కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. కొత్తగా 2 లక్షల 73 వేల 810 మంది వైరస్ బారిన పడ్డారు. వరసగా 5వ రోజూ కేసులు 2 లక్షలు దాటాయి. మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క రోజులో ఇదే అత్యధికం. ఏకంగా 1,619 మంది మరణించారు. ఒక్క రోజులో సంభవించిన మరణాల్లో కూడా ఇవే అధికం. దేశంలో కరోనా మరింత ప్రమాదకరంగా …
Read More »ఢిల్లీలో 7రోజులు లాక్‌డౌన్
దేశరాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. ఈ నేపధ్యంలో ప్రభుత్వం ఈరోజు నుంచి వారం రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ లాక్‌డౌన్ ఈ రోజు(సోమవారం) రాత్రి 10 గంటల నుంచి వచ్చే సోమవారం అంటే ఏప్రిల్ 26 ఉదయం 6 గంటల వరకూ కొనసాగనుంది. కరోనా చైన్ తెగ్గొట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఢిల్లీ సర్కారు వెల్లడించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈరోజు ఉదయం …
Read More »మహారాష్ట్రలో కరోనా విజృంభణ
మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా ఒక్కరోజే 67,123 కరోనా కేసులు, 419 మరణాలు నమోదయ్యాయి. కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రంలో ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. ఇవాళ 56,783 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 6,47,933 యాక్టివ్ కేసులున్నాయని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. కాగా కరోనాతో మహారాష్ట్రలో ఇప్పటివరకు 59,970 మరణాలు సంభవించాయి.
Read More »దేశంలో కరోనా కల్లోలం
దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉన్నది. వైరస్ వ్యాప్తి రోజు రోజుకు ఉధృతమవుతున్నది. రోజువారీ కేసులతో పాటు మరణాలు పెరుగుతుండడం కలవరపెడుతున్నది. వరుసగా దేశంలో నాలుగో రోజు రెండు లక్షలకుపైగా కొవిడ్ కేసులు రికార్డయ్యాయి. గడిచిన 24 గంటల్లో 2,61,500 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది.గతంలో ఎన్నడూ లేని విధంగా 1,501 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 1,38,423 మంది …
Read More »దేశంలో కరోనా వైరస్ విలయతాండవం
ప్రస్తుతం మన దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్నది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లోనే 2,34,692 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,341 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న 1,23,354 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మొత్తం కేసుల సంఖ్య 1,45,26,609కు చేరుకోగా, ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 16,79,740. ఇప్పటి వరకు కరోనాతో 1,75,649 మంది చనిపోగా, 1,26,71,220 …
Read More »మహారాష్ట్రలో కరోనా విలయతాండవం
మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. గత కొన్నిరోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతుండగా.. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 61,695 పాజిటివ్ కేసులు రాగా, 349 మంది చనిపోయారు. 53,335 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 36.39లక్షలను చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6.20 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Read More »దేశంలో కరోనా ఉగ్రరూపం
దేశంలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు 2 లక్షలకు పైగా కేసులు వచ్చాయి. గత 24 గంటల్లో 2,17,353 మందికి కరోనా సోకగా 1,185 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,42,91,917కు చేరగా మరణాల సంఖ్య 1,74,308గా ఉంది. తాజాగా 1,18,302 మంది డిశ్చార్జ్ కాగా ఇప్పటివరకు 1,25,47,866 మంది కరోనాను జయించారు. 15,69,743 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో 14,73,210 …
Read More »సీబీఐ మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హా మృతి
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హా మృతి చెందారు. ఈ ఉదయం 4.30 గంటలకు ఢిల్లీలో కన్నుమూసినట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. 1974 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన రంజిత్ సిన్హా గతంలో ITBP, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీగానూ పనిచేశారు. ఈయన స్వస్థలం బిహార్ రాజధాని పాట్నా.
Read More »దేశంలో కరోనా కల్లోలం
దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తున్నది. గత కొద్ది రోజులుగా లక్షకుపైగా పాజిటివ్ కేసులు రికార్డవుతుండగా.. తాజాగా రెండు లక్షలకుపైగా నమోదయ్యాయి. గురువారం 24 గంటల్లో 2,00,739 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కొవిడ్-19 బారిన పడి మరణించేవారి సంఖ్యా రోజురోజుకూ పెరుగుతోంది. మహమ్మారి బారినపడి మరో 1,038 మంది మృతువాతపడ్డారు. కరోనా మహమ్మారి మొదలైన నుంచి ఇంత పెద్ద మొత్తంలో మరణాలు నమోదవడం …
Read More »దేశంలోని ప్రైవేటు, ప్రభుత్వ బ్యాంకులకు 9 రోజులపాటు సెలవులు
దేశంలోని ప్రైవేటు, ప్రభుత్వ బ్యాంకులకు ఏప్రిల్ నెలలో 9 రోజులపాటు సెలవులను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. రిజర్వు బ్యాంకు ఈ వారంలోనే వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ప్రకటించింది.మంగళవారం ఏప్రిల్ 13 నుంచి 16వతేదీ వరకు నాలుగురోజుల పాటు వివిధ పండుగల సందర్భంగా బ్యాంకులకు సెలవులు ఇస్తున్నట్లు రిజర్వు బ్యాంక్ వెల్లడించింది. దేశంలోని వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల వారీగా బ్యాంకులకు 4రోజులపాటు వరుస సెలవులు …
Read More »