బడుగు, బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి స్పీకర్ స్థానంలో ఉంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని వైయస్‌ఆర్‌సీపీ పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ మండిపడ్డారు. స్పీకర్‌పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను రమేష్ తీవ్రంగా ఖండించారు. శాసనసభలో జోగి రమేష్ మాట్లాడుతూ.. ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబు స్పీకర్‌ను బెదిరిస్తూ కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు.. ఈ రోజు రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలను చంద్రబాబు కించపరిచినట్లేనన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలను కించపరిచినట్లేనన్నారు.. …
Read More »ఇంగ్లీష్ మాట్లాడితే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది.. టీడీపీకి ఆదిమూలపు కౌంటర్ !
విద్యలో నాణ్యత ప్రమాణాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.. బుధవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఎయిడెడ్ అధ్యాపకుల సమస్యలపై ప్రశ్నించారు. దీంతో మంత్రి సురేష్ సమాధానం చెప్పారు. ఎయిడెట్ కాలేజీలు, స్కూల్స్, డిగ్రీ కాలేజీల్లో పనిచేసే అధ్యాపకుల స్థితిగతులపై ప్రభుత్వం దృష్టి సారించిందని, ఎయిడెట్ కాలేజీల్లో పనిచేసే అధ్యాపకుల స్థితిగతులు, వారికి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ కోసం ఓ రూల్స్ ప్రకారం …
Read More »నేటి నుంచి ఆర్టీసీ ఛార్జీల పెంపు అమలు..!
నష్టాల్లో ఉన్న ఎపిలో ఆర్టీసీని బయటపడేసేందుకు ఏపీ ప్రభుత్వం చార్జీల పెంపుపై నిర్ణయం తీసుకొనున్నదని ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి సవరించిన చార్జీలు అమలులోకి వస్తాయని ఆర్టిసి ప్రకటించింది. పల్లెవెలుగు బస్సుల్లో కిలోమీటర్‌కు 10 పైసలు, ఎక్స్‌ప్రెస్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో కిలోమీటర్‌కు 20 పైసలు పెంచినట్లు ప్రకటించింది. వీటితోపాటు ఇంద్ర ఏసీ, గరుడ, అమరావతి బస్సుల్లో కిలోమీటర్‌కు 10 పైసలు …
Read More »ఖనిజ సంక్షేమ నిధులను ప్రాధాన్యతా రంగాలకు ఖర్చు చేయాలి..మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
జిల్లా ఖనిజ అభివృద్ధి నిధిలో ఉన్నటువంటి నిధుల ద్వారా జిల్లాలోని మూడు నియోజక వర్గాల్లో అత్యంత ప్రాధాన్యత అంశాలకు ఖర్చు చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ మరియు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఖనిజ ఫౌండేషన్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా ఖనిజ సంక్షేమ నిధి లో నిలువ ఉన్న …
Read More »టీడీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని ఫైర్..జాగ్రత్తగా మాట్లాడండి !
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ ఎమ్మెల్యేలపై అసహనం వ్యక్తం చేసారు. అసెంబ్లీ వైసీపీ కార్యాలయంగా మార్చారని టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపణపై తీవ్రంగా ఖండించారు. ఈ విషయాన్ని అలా ఆరోపించడం సరికాదని అన్నారు. ఇక మరొక విషయం ఏమిటంటే టీడీపీ నుండి సస్పెండ్ అయిన వల్లభనేని వంశీ కోరిక మేరకు ఆయనకు సెపరేట్ సీటు ఇవ్వడానికి స్పీకర్ అంగీకరించారు.అప్పట్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి కూడా ఇలానే …
Read More »దేశంలోనే తక్కువ ధరకే ఉల్లి సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం మనదే…!
అసెంబ్లీ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉల్లి ధరల అంశంపై స్పందిస్తూ దేశంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా మేము కార్యక్రమాలను చేస్తున్నామని. దేశం మొత్తమ్మీద∙ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే రూ.25లకు అమ్ముతోందని, ఇంత తక్కువ రేటుకు అమ్ముతున్న రాష్ట్రం మనదే అన్నారు. రూ.25లకు అమ్ముతున్నాం అన్నారు. ఇక వేరే రాష్ట్రాల రేట్లు విషయానికి వస్తే..! *బీహార్‌లో కేజీ ఉల్లి రూ. 35 *వెస్ట్ బెంగాల్ రూ. 59 …
Read More »హెరిటేజ్ లో వంద లాభంతో కిలో 200కు అమ్ముతున్నావ్..నువ్వు రైతులకోసం ఆలోచిస్తున్నావా !
చంద్రబాబు రైతులకోసం ఆలోచిస్తున్నారు అంటే ఎవ్వరికైనా నవ్వు వస్తుంది. ఎందుకంటే అదే రైతులను మోసం చేసి తప్పుడు హామీలు ఇచ్చి గత ఎన్నికల్లో గెలిచారు. గెలిచిన తరువాత చివరికి చేతులెత్తేశారు. దాంతో కొందరు రైతులు హాత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. అయినప్పటికీ కనీసం జాలి చూపించకుండా ప్రభుత్వాన్ని తన సొంత ప్రయోజనాలకే వాడుకున్నాడు తప్పా రాష్ట్ర ప్రలకు చేసింది ఏమీ లేదు. ఎవరైనా ఎదురు తిరిగితే పోలీసులతో కొట్టించేవాడు. ఇక అసలు …
Read More »దేశమంతా మహిళా రక్షణ గురించి చర్చిస్తుంటే..చంద్రబాబు అడ్డుపడడం ఏమిటో !
దేశమంతా దిశ గురించి చర్చించుకుంటుంటే చంద్రబాబు మాత్రం ఆ చర్చకు అడ్డుపడుతున్నారు. సోమవారం నాడు ఏపీ అసెంబ్లీలో శీతాకాల సమావేశంలో భాగంగా మహిళా రక్షణ గురించి చర్చ జరుగుతుంటే అది జరగకుండా చంద్రబాబు అడ్డుపడ్డారు. దీనిపై ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విజయసాయి రెడ్డి ఘాటుగా స్పందించాడు.”అత్యాచారాలపై దేశమంతా అట్టుడికిపోతుంటే మహిళా రక్షణ గురించి అసెంబ్లీలో చర్చ జరక్కుండా అడ్డుపడిన చంద్రబాబు ఉల్లి ధరలపై కన్నీళ్ళు పెట్టుకోవడంలో ఆశ్చర్యమేముంది. ఆయన ఐదేళ్ల …
Read More »హ్యాట్సాఫ్ టూ కేసీఆర్.. అసెంబ్లీలో సీఎం జగన్
మహిళలపై అత్యాచారాలకు చట్టాలు ఎన్ని వున్నా వాటి వల్ల ఎంత ఉపయోగం అన్న విషయం మాత్రం అనుమానమేనని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. అసెంబ్లీలో తమ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న మహిళా బిల్లుపై ఆయన మాట్లాడుతూ నిర్భయ అత్యాచారం కేసు జరిగి ఎంత కాలమైంది, ఇంతవరకు ఆ కేసులో తీసుకున్న చర్యలు నిరుత్సాహంగానే వున్నాయన్నారు. దిశ హత్యాచార సంఘటనలో తెలంగాణ సీఎం కేసీఆర్, తెలంగాణ పోలీసులు తీసుకున్న చర్యకు హ్యాట్సాఫ్ అన్నారు. ఆడపిల్లల …
Read More »ప్రణాళికతోనే అభివృద్ధి..మాజీ ఎంపీ వినోద్
ప్రణాళికతోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీ లో మండల ప్రణాళిక, గణాంక అధికారుల మూడు వారాల శిక్షణ తరగతులను వినోద్ కుమార్ సోమవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. సీఎం కేసీఆర్ ప్రతి అంశాన్ని లోతుగా ఆలోచిస్తారని, ఇదే ప్రణాళికకు బాట …
Read More »