ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా.. తెలంగాణ శౌర్యాన్ని చూపి న కాకతీయ.. నాటి, నేటితరం నాయకుల్లో ఎక్కువ మంది ఈ యూనివర్సిటీల్లో నాయకత్వలక్షణాలను పుణికిపుచ్చుకున్నవారే. మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ అనేకమంది విద్యార్థులు ప్రత్యేక రాష్ట్రం కోసం బలిదానాలు చేశారు. వారి త్యాగాలను గుర్తించిన టీఆర్‌ఎస్.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన తొలి ఎన్నికల్లో అనేకమంది విద్యార్థి సంఘం నాయకులకు రాజకీయంగా భరోసా కల్పించింది. సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇవ్వడంతోపాటు, …
Read More »టీఆర్‌ఎస్ ఆవిర్భవించినప్పుడే తెలంగాణలో టీడీపీ పతనం ప్రారంభమైంది……. కేటీఆర్
తెలంగాణలో టీడీపీ చచ్చిపోయిందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలిపేందుకే ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారన్నారు. టీఆర్‌ఎస్ అవిర్భవించినప్పుడే టీడీపీ పతనం ప్రారంభమైందని తెలిపారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో దేవరకొండ, మహబూబ్‌నగర్ టీడీపీ నేతలు, కార్యకర్తలు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పిన కేటీఆర్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, దేవరకొండ టీఆర్‌ఎస్ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే రవీంద్ర …
Read More »తెలంగాణలో టీఆర్‌ఎస్సే అధికారం చేపడుతుందని స్పష్టం చేసిన సర్వేలు…..
తెలంగాణలో మరోసారి టీఆర్‌ఎస్ విజయం సాధిస్తుందని సర్వేలు స్పష్టం చేశాయి. సీ–వోటర్, టైమ్స్ నౌ, ఐటీటెక్ గ్రూప్ తదితర సంస్థలు నిర్వహించిన సర్వేల ఆధారంగా ఓ నివేదిక రూపొందించారు. ఆ నివేదిక ప్రకారం త్వరలో ఎన్నికలు జరిగనున్న ఐదు రాష్ట్రాల్లో మూడింటిలో బీజేపీ ప్రస్తుతం అధికారంలో ఉండగా, వాటిలో రెండు రాష్ట్రాలను ఈసారి కాంగ్రెస్ చేజిక్కించుకోనుంది. అదే జరిగితే వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తమయ్యేందుకు కాంగ్రెస్‌కు కొత్త శక్తి వస్తుంది. …
Read More »బతుకమ్మ చీరలు అడ్డుకున్న కాంగ్రెస్‌కు మహిళలు ఓటుతో బుద్ధి చెప్పాలి……హరీశ్‌రావు
సిద్ధిపేట జిల్లాలోని జగదేవపూర్ మండలంలో మంత్రి హరీశ్‌రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జంగంరెడ్డిపల్లి, ఛాటపల్లి, తీగుల్‌నర్సాపూర్‌లో మంత్రి ప్రచారం చేశారు. వచ్చే ఆరు నెలల్లో సాగుకు గోదావరి జలాలు అందుతాయని తెలిపారు. బతుకమ్మ చీరలు అడ్డుకున్న కాంగ్రెస్‌కు మహిళలు ఓటుతో బుద్ధి చెప్పాలని హరీశ్‌రావు కోరారు. రాష్ట్ర అభివృద్ధి ముందుకు సాగాలంటే సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని వివరించారు. ర్యాలీలో ఆయా గ్రామాల ప్రజలు మంత్రికి ఘనస్వాగతం పలికారు. మహిళలు …
Read More »ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే విజయం….కేటీఆర్
బంజారాహిల్స్‌లో మహారాజ శ్రీ అగ్రసేన్ జయంతి ఉత్సవాల్లో పాల్గొని మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించేవారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ హయాంలో పరిశ్రమలకు నిరంతర విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. టీఎస్ ఐపాస్ ద్వారా పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు. 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతి ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం అన్ని రంగాలకు పెద్దపీట వేస్తోంది. వ్యాపారులు, వర్తకులు, పారిశ్రామికవేత్తలకు ఇతోధిక ప్రోత్సాహకాలు …
Read More »అనంతపురంలో పరిటాల కుటుంబం వైసీపీ నేతను దారుణ హత్య
జిల్లాలో వైఎస్సార్‌సీపీ నేత కేశవరెడ్డి దారుణహత్యకు గురయ్యారు. ఆత్మకూరుకు చెందిన కేశవరెడ్డిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేయడం స్థానికంగా కలకలం రేపింది. పథకం ప‍్రకారం కేశవరెడ్డిపై రాడ్‌లతో మూకుమ్ముడిగా దాడి చేశారు. అయితే తీవ్రంగా గాయపడిన కేశవరెడ్డిని ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. మాజీ సర్పంచ్ అయిన కేశవరెడ్డిని పరిటాల కుటుంబమే హత్య చేయించిందని ఆయన వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఇరు కుటుంబాల మధ్య ఉన్న పాత కక్షల …
Read More »వైఎస్ జగన్ 283వ రోజు ప్రజాసంకల్పయాత్ర…..
ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఈ రోజు (బుధవారం) ఉదయం 283వ రోజు పాదయాత్ర జిన్నాం నుంచి ప్రారంభమైంది. వైఎస్ జగన్ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గం అంతా జనంతో కిక్కిరిసి పోయింది. వైఎస్ జగన్ ప్రజాసమస్యలు సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. గజపతినగరం నియోజకవర్గంలోని లింగాల వలస, లోగిస క్రాస్, కొత్త శ్రీరంగ రాజపురం, నారాయణ గజపతిరాజపురం, …
Read More »తెలంగాణ సీఎంగా కేసీఆరే రావాలి…
ఏపీ విడిపోతే.. తెలంగాణను చిమ్మంజీకట్లు కమ్ముకుంటాయనీ.. సమైక్య రాష్ట్ర సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తప్పుడు ప్రచారం చేశారు! కానీ ఇప్పుడు చూడండి. వెలుగు రేఖలతో తెలంగాణ ఎట్లా విరాజిల్లుతున్నదో.. 24 గంటల ఉచిత విద్యుత్‌తో దేశానికే గర్వకారణంగా తెలంగాణ నిలుస్తున్నదనీ.. మల్లా టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించి కేసీఆర్ సీఎం అయితేనే.. రాష్ట్రం మరింత ప్రగతి సాధిస్తుంది. దేశంలో ఒకప్పుడు వ్యవసాయరంగం 75% వాటా ఉండేది. కానీ నేడు అది 52% …
Read More »వైసీపీ నేత నారాయణరెడ్డి హత్య కేసులో..కేఈ శ్యాంబాబు అరెస్ట్‌కు డోన్ కోర్టు ఆదేశాలు….
పత్తికొండ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త చెరుకులపాడు నారాయణ రెడ్డి, ఆయన డ్రైవర్ సాంబశివుడు హత్య కేసులో కేఈ శ్యాంబాబు, ఎస్‌ఐ నాగ తులసీ ప్రసాద్‌లను అరెస్ట్ చేయాలంటూ డోన్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ జంట హత్యల కేసులో వీరిని నిందితులుగా చేర్చాలంటూ 2017లో నారాయణ రెడ్డి భార్య చెరుకులపాడు శ్రీదేవి డోన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కేఈ శ్యాంబాబు, నాగ తులసీ ప్రసాద్‌లను అరెస్ట్ చేయాలంటూ …
Read More »టీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు
టీఆర్ఎస్ లోకి వలసలు, చేరికలు కొనసాగుతున్నాయి. సిర్పూర్ నియోజకవర్గం దహేగాం మండల కేంద్రంలో సప్పిడే సంజీవ్, తుమ్మిడే సురేష్ సహా 100మంది యువకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి టిఆర్ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్ప తన నివాసంలో గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్ఎస్ అభ్యర్థి (పరిగి) మహేశ్వర్ రెడ్డి సమక్షంలో గండీడ్ మండలం పెద్దవార్వాలుకు చెందిన పలువురు టీఆర్ఎస్ లో చేరారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం …
Read More »