Home / POLITICS (page 65)

POLITICS

అమిత్‌షాకు చంద్రబాబు లేఖ రాయడం వల్ల ఉపయోగం లేదు: సజ్జల

ఏపీలో నారాయణ విద్యాసంస్థ సహా మరికొన్ని ఫ్యాక్టరీలా తయారై విద్యా వ్యవస్థలో నేర సంస్కృతిని ప్రవేశపెట్టాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయా సంస్థలు ఎన్నో ఏళ్లుగా విద్యావ్యవస్థలో మాల్‌ ప్రాక్టీస్‌కి పాల్పడుతున్నాయని చెప్పారు. టెన్త్‌ పరీక్ష పేపర్ల లీకేజీ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణ ప్రమేయం ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉండటంతోనే పోలీసులు ఆయన్ను అరెస్ట్‌ చేశారన్నారు. అమరావతిలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సజ్జల మాట్లాడారు. టెన్త్‌ …

Read More »

ఆ ఆరోపణలు నిజం కావు.. వాటిని నమ్మొద్దు: గంగుల కమలాకర్‌

ధాన్యం కొనుగోళ్లకు గన్నీ బ్యాగుల కొరత ఉన్నట్లు వస్తున్న ఆరోపణలు నిజం కావని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. ప్రస్తుతం 8.85 కోట్ల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉండగా.. వాటిలో ఇప్పటివరకు కేవలం 2.5కోట్ల గన్నీ బ్యాగులు మాత్రమే వాడామని చెప్పారు. మిగిలిన 6.35కోట్ల బ్యాగులతో 25లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయొచ్చన్నారు. హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. అసని …

Read More »

ఎప్పటికే టీఆర్‌ఎస్సే ప్రజలకు శ్రీరామరక్ష: హరీశ్‌రావు

తెలంగాణకు మేలు చేసే టీఆర్‌ఎస్‌ కావాలో.. నష్టం చేకూర్చే విపక్ష పార్టీలు కావాలో ప్రజలు తేల్చుకోవాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. టీఆర్‌ఎస్‌ను ఒంటరిగా ఎదుర్కోలేక బీజేపీ, కాంగ్రెస్‌ కలిసి కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. మహబూబాబాద్‌ జిల్లాలో వివిధ అభివృద్ధి, శంకుస్థాపన కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో హరీశ్‌ మాట్లాడుతూ తెలంగాణలో 24 గంటలూ కరెంట్‌ ఉంటుందని ఊహించామా? అని ప్రశ్నించారు. ఎప్పటికీ టీఆర్‌ఎస్సే రాష్ట్ర ప్రజలకు …

Read More »

తప్పు చేస్తే ఎలాంటి వారైనా అరెస్ట్‌ అవ్వక తప్పదు: బొత్స

తప్పు చేసిన వారు ఎవరైనా వారిని అరెస్ట్‌ చేయక తప్పదని.. అయితే వారు తప్పులేదని నిరూపించుకోవాలని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. టీడీపీ నేత, మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్‌ నారాయణను చిత్తూరు పోలీసులు అరెస్ట్‌ చేసిన నేపథ్యంలో సీఎం జగన్‌ను మంత్రి కలిశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. టెన్త్‌ ఎగ్జామ్‌ పేపర్లు ఎక్కడెక్కడ లీక్‌ అయ్యాయో అధికారులు విచారణ చేస్తున్నారని చెప్పారు. …

Read More »

వందల ఎకరాలున్న కుటుంబంలో కేసీఆర్‌ పుట్టారు: కేటీఆర్‌

తమ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు సులువైనవే అయితే 60 ఏళ్లుగా దేశాన్ని పాలించిన వాళ్లు ఎందుకు వాటిని అమలు చేయలేదని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ రైతు కుటుంబం నుంచి వచ్చినందునే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయని చెప్పారు. కామారెడ్డి జిల్లా కోనాపూర్‌లో పలు అభివృద్ధి పనులకు కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. ‘ మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా తన నానమ్మ జ్ఞాపకార్థం సొంత ఖర్చులతో స్కూల్‌ …

Read More »

టీఆర్‌ఎస్‌కు ప్రజలే హైకమాండ్‌: హరీశ్‌రావు

కర్ణాటక ముఖ్య‌మంత్రి పదవికి రూ. 2,500 కోట్లు ఇస్తే వస్తుందటని.. ఈ మాట కర్ణాటక బీజేపీ ఎంపీనే చెప్తున్నాడ‌ని తెలంగాణ మంత్రి హ‌రీశ్‌రావు గుర్తు చేశారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు కుర్చీ కోసం కొట్లాడుకుంటున్నాయని మంత్రి విమర్శించారు. ఒక పార్టీలో ఓటుకు నోటు.. మరో పార్టీలో సీఎం సీటుకు నోటు పంచాయితీ ఉందని ఎద్దేవా చేశారు. జయశంకర్‌ భూపాలపల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాన చేసిన అనంతరం నిర్వహించిన …

Read More »

పవన్‌.. ప్రజలకైనా ఓ క్లారిటీ ఇవ్వు: పెద్దిరెడ్డి

2024 ఎన్నికల తర్వాత రాజకీయాల నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుకోక తప్పదని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చంద్రబాబుకు ప్రజల్లో విశ్వసనీయత లేదని.. ఒంటరిగా పోటీ చేస్తే గెలవడం సాధ్యం కాదని ఆయనకీ తెలుసన్నారు. అందుకే పొత్తుల కోసం చేయాల్సిన అన్నిరకాల ప్రయత్నాలూ చేస్తున్నారని చెప్పారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో పెద్దిరెడ్డి మాట్లాడారు. జగన్‌కు ప్రజల్లో అభిమానం ఉందని.. అందుకే వైసీపీ ధైర్యంగా ఒంటరిగా పోటీ …

Read More »

మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆ పథకాలేవీ?: కేటీఆర్‌

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో కేంద్రం వాటా ఉందంటూ బీజేపీ నేతలు తమ పాదయాత్రలో చెప్తున్నారని.. అలాంటప్పుడు ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి పథకాలు ఉండాలని కదా? అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. నారాయణపేటలో సుమారు రూ.90కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పథకాలకు మంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఉత్తమ పంచాయతీలుగా తెలంగాణ గ్రామాలే …

Read More »

పొత్తులపై ప్రజల్ని ఫూల్స్‌ చేయాలనుకుంటున్నారు: సజ్జల

ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వమని చెప్తున్న జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌.. టీడీపీతో పొత్తు ఉంటుందా? అనే ప్రశ్నకు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. పొత్తులపై జనసేన, టీడీపీ నేతలు చేస్తున్న ప్రకటనలు గందరగోళంగా ఉన్నాయన్నారు. వైసీపీ సెంట్రల్‌ ఆఫీస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సజ్జల మాట్లాడారు. చంద్రబాబు కూడా త్యాగాలకు సిద్ధం అంటూ కూటమినే నడిపిస్తామని చెప్పడమేంటని సజ్జల …

Read More »

పొలిటికల్‌ టూరిస్టులకు కేసీఆర్‌ భయం పట్టుకుంది: ప్రశాంత్‌రెడ్డి

హనుమకొండ సభలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేసిన కామెంట్స్‌ చూస్తే జాలేస్తుందని.. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్‌ను చదివి ఆయన తన అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారని తెలంగాణ మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ కంటే గొప్పగా కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారో చెబితే బాగుండేదని చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రశాంత్‌రెడ్డి మాట్లాడారు. రాహుల్‌పర్యటనతో తెలంగాణ ప్రజలకు ఒరిగేదీమీ లేదన్నారు. రైతుల పక్షపాతి ఎవరనే విషయం దేశ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat