MINISTER SATYAVATHI: ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్ పట్ల వైతెపా అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యలను మంత్రి సత్యవతి ఖండించారు. మహబూబాబాద్ పట్టణ బొడ్రాయి పునః ప్రతిష్టాపనలో మంత్రి పాల్గొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, భారాస నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న షర్మిల……భారాస నేతలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మంత్రి స్పందించారు. నిరాధార ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యలు మానుకోకపోతే ప్రతిఘటన …
Read More »SHARMILA: వైఎస్ షర్మిల అరెస్టు
SHARMILA: వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రకు అడ్డుపడింది. మహబూబాబాద్ లో పాదయాత్రకు అడ్డుకట్టపడింది. ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై వైతెపా అధ్యక్షురాలు వ్యాఖ్యలు చేయడంతో …..ఎమ్మెల్యే అనుచరులు ఆమెపై ఫిర్యాదు చేశారు. పాదయాత్ర చేస్తున్న షర్మిలను అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. గతంలో వరంగల్ జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడు కూడా నర్సంపేట ఎఅరెస్టుమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై షర్మిల ఘాటుగా మాట్లాడారు. ఆయనను పరుష పదజాలంతో దూషించారు. దాంతో …
Read More »minister satyavathi:చైల్డ్ ఫ్రెండ్లీ రూమ్ ప్రారంభించిన మంత్రి సత్యవతి
minister satyavathi: మహబూబాబాద్ లో పోలీస్ స్టేషన్ లో మదర్ అండ్ చైల్డ్ ఫ్రెండ్లీ రూమ్ ను మంత్రి సత్యవతి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు ఎమ్మెల్యే శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. శాంతిభద్రతల పర్యవేక్షణలో సీఎం పూర్తి దృష్టి సారించారని మంత్రి అన్నారు. పోలీస్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించేలా పోలీసులు …
Read More »MINISTER SRINIVAS: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
MINISTER SRINIVAS: మహాశివరాత్రి సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా వీరన్నపేట పెద్ద శివాలయంలో స్వామివారిని మంత్రి శ్రీనివాస్ గౌడ్ దర్శించుకున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపడంపై మంత్రి స్పందించారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా….పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి తీరుతామని మంత్రి స్పష్టం చేశారు. ప్రాజెక్టు పూర్తైతేనే ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతుందని అన్నారు. కరవు ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రాజెక్టు అత్యవసరమని మంత్రి …
Read More »KTR: ప్రధానికి స్నేహితుడి సంక్షేమమే కావాలి: కేటీఆర్
KTR: రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ క్రిశాంక్ ట్వీట్‌ను మెచ్చుకుంటూ మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీల మేరకు తెలంగాణలో బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయకుండా కేంద్రం మాట తప్పిందని వీడియోలో వివరించారు. ప్రధానికి స్నేహితుడి సంక్షేమం తప్ప మరొకటి అక్కర్లేదని కేటీఆర్ విమర్శించారు. స్నేహితుడి ప్రయోజనాలే ఎక్కువ కావడం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు బైలడిల్లా నుంచి …
Read More »suryanarayana: చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే నాపై పోటీ చేసి గెలవాలి: సూర్యనారాయణ
suryanarayana: చంద్రబాబు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని వైకాపా ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. 13 ఏళ్లు పరిపాలన చేసిన వ్యక్తే ఇలా ప్రవర్తిస్తే……ప్రజలు వీళ్లను చూసి ఏం నేర్చుకోవాలని ప్రశ్నించారు. నిన్న అనపర్తిలో పోలీసులపై దౌర్జన్యానికి దిగడం దారుణమని అన్నారు. ఎంత గూండాయిజం ప్రదర్శించినా ఏం చేయలేని అన్నారు. తెదేపా నేతల చేష్టలను ప్రజలు గమనిస్తున్నారని సూర్యనారాయణ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ప్రజలే చంద్రబాబుకు సరైన గుణపాఠం చెబుతారని …
Read More »MINISTER JAGADEESH: కృత్రిమ విద్యుత్ సంక్షోభం సృష్టించడమే ప్రధాని లక్ష్యం:మంత్రి జగదీశ్
MINISTER JAGADEESH: సంస్కరణలపేరుతో కార్పోరేట్ కే దేశ సంపద అంతా ప్రధాని మోదీ దోచిపెడుతున్నారని మంత్రి జగదీశ్ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, అదానీల స్నేహం…..ప్రజలకు అర్థమైపోయిందని అన్నారు. దేశ ప్రజలకు విద్యుత్ ను దూరం చేసేందుకే కేంద్రం పన్నాగం పన్నుతోందని మండిపడ్డారు. అందుకే వీదేశీ బొగ్గు నిల్వలతో తయారు చేసిన విద్యుత్ ను 50 రూపాయలకే అమ్ముకోవచ్చని కేంద్ర ఈఆర్సీ నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. ప్రైవేట్ కంపెనీలకు లాభం చేకూర్చేందుకు …
Read More »MINISTER CHELLUBOYINA: చంద్రబాబు విజన్ లేని వ్యక్తి: మంత్రి చెల్లుబోయిన
MINISTER CHELLUBOYINA: చంద్రబాబు….. సభల వల్ల 11 మందిని పొట్టనపెట్టుకున్నారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తీసుకున్న ప్రతి నిర్ణయంలోనూ స్పష్టత లేదని మండిపడ్డారు. చంద్రబాబు అసలు విజన్ లేని వ్యక్తి అని విమర్శించారు. చంద్రబాబుకు అసలు ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని వ్యాఖ్యానించారు. ఆయన చేపట్టిన ప్రతి పనిలోనూ కమిషన్ తప్ప మరొకటి లేదని మండిపడ్డారు. ఇన్నేళ్లు ప్రజలను నాశనం చేసిన చంద్రబాబు…..ఇప్పుడు కార్యకర్తలను మోసం …
Read More »రేవంత్ రెడ్డికి మంత్రి ఎర్రబెల్లి సవాల్
తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు .. ఎంపీ అనుముల రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు. మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నట్లు నేను ఒక్క ఎకరం భూమిని కబ్జా చేసినట్టుగా నిరూపించినట్లయితే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఆయన అన్నారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి …
Read More »గుండె పోటుతో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
ఏపీ అధికార పార్టీ వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే.. క్షత్రియ కార్పొరేషన్ రాష్ట్ర ఛైర్మన్ పాతపాటి సర్రాజు (72) గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. నిన్న శుక్రవారం రాత్రి ఓ వివాహ వేడుకలో పాల్గొన్న ఆయన 10 గంటలకు ఇంటికెళ్లారు. ఆ తర్వాత గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు భీమవరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన వైసీపీలో కీలకనేతగా కొనసాగుతున్నారు.
Read More »