ఈ రోజు రాంచీ లో ఆసీస్‌తో జరిగిన తొలి ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో టీం ఇండియా విజయఢంకా మోగించింది. మొదట టాస్ గెలిచిన టీంఇండియా ఆసిస్ కు బ్యాటింగ్ అప్పజేప్పడంతో మొదట బ్యాటింగ్ చేసిన ఆ జట్టు 18.4 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. అయితే మధ్యలో వర్షం కారణంగా దాదాపు గంటన్నరపాటు మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. దీంతో డక్‌వర్త్‌లూయిస్ ప్రకారం భారత్‌కు 6 ఓవర్లలో …
Read More »టీంఇండియా ,ఆసీస్ ల మధ్య తొలి టీ20 మ్యాచ్‌కు వరుణుడు అడ్డు..
రాంచీ లో నేడు టీంఇండియా ,ఆసీస్ ల మధ్య జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌కు వరుణుడు అడ్డుగా నిలిచాడు. తొలుత టాస్ నెగ్గిన టీంఇండియా సారథి కోహ్లీ ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఆ జట్టు 18.4 ఓవర్లకు 8 వికెట్లు నష్టపోయి 118 పరుగులు చేసిన క్రమంలో వర్షం అంతరాయం కలిగించింది. టై(0), జంపా(4) క్రీజులో ఉన్నారు.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ 8 పరుగుల వద్ద కెప్టెన్ …
Read More »ప్రతిపక్షాలకు రేవంత్ పిలుపు ..
తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ టీడీపీ ఎమ్మెల్యే ,ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు అయిన రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు .ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్షాలపై చేసిన కామెంట్ల గురించి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇక నుండైన జరిగే ప్రతి ఎన్నికల్లో కేసీఆర్‌ను ఎదుర్కోవాలంటే విపక్షాలన్నీ మనస్పర్థలు వీడి ఒక్క తాటిపైకి రావాలని విజ్ఞప్తి చేశారు. విపక్షాల మధ్య ఉన్న బలహీనతలనే కేసీఆర్‌కు బలంగా …
Read More »ఏడ్చే మగాళ్ళనే ఆడవారు బాగా …?
ప్రస్తుత రోజుల్లో ‘కాకా.. వాడి కండలు… సిక్స్ ప్యాక్… ఫ్రెంచ్ గడ్డం… మస్త్ మ్యాన్లీరా వాడు! అమ్మాయిలు క్యూ కట్టేస్తారు. నేనూ వాడిలా హీరో లెక్క మారిపోవాలి. ఎంత ఖర్చయినా ఫర్వాలేదు.’ అని పాకెట్ మనీ అంతా ఖర్చు చేస్తున్నారు. అంత కాస్ట్లీ కంగారక్కర్లేదు. పురుష లక్షణాలకు కొత్త నిర్వచనాన్నిస్తున్నారు నేటి తరం అమ్మాయిలు. మ్యాన్లీ మాత్రమే కాదంటూ సున్నితత్వాన్నీ కోరుకుంటున్నారు. ఒక సంస్థ చేసిన సర్వేలో తేలిందేమంటే ఏడ్చే మగాడి …
Read More »‘వైఎస్సార్’ గురించి చెప్పినందుకు పీవీ సింధుకు రూ.25లక్షలు..!
భారత్‌తోపాటు విదేశాల్లో సైతం విపరీతంగా ప్రాచుర్యం పొందిన టీవీ కార్యక్రమం ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ తొమ్మిదో సీజన్ ఇటీవలే ప్రారంభమైంది. అన్ని సీజన్లలాగే తాజా సీజన్ కూడా అద్భుతమైన రేటింగ్స్‌తో దూసుకుపోతోంది. వీకెండ్స్, స్పెషల్ డేస్‌లో ప్రసారమయ్యే ఎపిసొడ్లలో పలువురు సెలబ్రిటీలు సందడిచేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. శుక్రవారం ప్రసారమైన కేబీసీ ఎపిసోడ్‌లో ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ప్రశ్నలకు సమాధానాలిచ్చి రూ.25 లక్షలు గెల్చుకున్నారు. కాగా, ఆమెకు 25 …
Read More »పోలీస్ శాఖకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్…
ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీస్‌శాఖకు తీపి కబురు అందించారు .. పోలీస్‌శాఖలో పదోన్నతులకు సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న పోలీసు అధికారుల పదోన్నతి అంశం ఓ కొలిక్కి వచ్చినట్లైంది. పోలీసు అధికారుల పదోన్నతుల అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతిభవన్ లో న్యాయశాఖ అధికారులు, పోలీసు అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులతో దాదాపు నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. ఏకంగా 275 మందికి …
Read More »ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ కు నోబెల్ పురస్కారం ..!
దాదాపు మూడేళ్ల పాటు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా పనిచేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురాం రాజన్ సెప్టెంబర్ 4, 2016న పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ఆర్థికవేత్త అయిన రాజన్ ఈ రంగంలో ఎన్నో అధ్యయనాలు చేశారు. పుస్తకాలు కూడా రాశారు. ప్రస్తుతం ఆయన అమెరికాలోని చికాగో యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కార గ్రహీతల రేసులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ …
Read More »ఆ పోస్టులను తక్షణమే భర్తీ చేయండి… కేసీఆర్ ఆదేశం
తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలిచ్చారు. అన్ని శాఖల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టుల వివరాలు సేకరించి.. వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. ఉద్యోగాలకు కావాల్సిన విద్యార్హతలున్న అభ్యర్థులు ఆయా వర్గాల్లో ఉన్నప్పటికీ బ్యాక్‌లాగ్ పోస్టులు ఉండటం అన్యాయమన్నారు. ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, సీఎస్ ఎస్పీ సింగ్ కలిసి ఇకపై ప్రతీ నెలా చివరి …
Read More »కొత్త జిల్లాల ప్రకారమే డీఎస్సీ…సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర౦లో జిల్లా కేడర్ పోస్టులకు కొత్త జిల్లాలే ప్రతిపాదిక అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు, జోనల్ వ్యవస్థ, రాష్ట్రపతి ఉత్తర్వులు, తదితర అంశాలపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ సమీక్ష సమావేశానికి మంత్రులు, సీనియర్ అధికారులు హాజరయ్యారు. జిల్లా కేడర్ పోస్టులను కొత్త జిల్లాల ప్రతిపాదికనే నియమించాలని సీఎం నిర్ణయించారు. డీఎస్సీ నోటిఫికేషన్ కూడా కొత్త …
Read More »ఈ నెల 11న కొత్త జిల్లాల కలెక్టరేట్లకు కేసీఆర్ శంకుస్థాపన..!
తెలంగాణ రాష్ట్ర౦లో కొత్తగా ఏర్పాటైన జిల్లా కేంద్రాల్లో జిల్లా అధికారుల కార్యాలయాల భవన సముదాయాల నిర్మాణానికి ఈ నెల 11న రాష్ట్ర వ్యాప్తంగా శంకుస్థాపన చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. గత ఏడాది అక్టోబర్ 11న దసరా సందర్భంగా కొత్త జిల్లాలు ప్రారంభమయ్యాయి. తిరిగి అదే రోజు కొత్త జిల్లా కేంద్రాల్లో కార్యాలయాల నిర్మాణాలకు శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే స్థలాలు సేకరించి, టెండర్ల ప్రక్రియ కొనసాగుతున్న జిల్లాల్లో 11న …
Read More »