Home / SLIDER (page 301)

SLIDER

కేబుల్ బ్రిడ్జి ప్రమాదంపై స్పందించిన ప్రధాని.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

గుజరాత్‌లోని మోర్బీ పట్టణంలోని కేబుల్‌ బ్రిడ్జిపై జరిగిన ప్రమాదంపై ప్రధాని మోదీ స్పందించారు. నదిపై ఉన్న వంతెన కూప్పకూలిన విషయం తీవ్ర విషాదాన్ని నింపిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బాధిత కుంటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, సహాయక చర్యల్లో ఎలాంటి అలసత్వం ఉండదని భరోసా ఇచ్చారు. ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ప్రస్తుతం గుజరాత్‌లోని కేవడియాలో ఉన్నారు. అక్కడ ఉన్న …

Read More »

మాజీ మంత్రి నారాయణకు షాక్

ఏపీలో పదో తరగతి ప్రశ్నాపత్రాలు లీకేజీ కేసులో టీడీపీకి చెందిన నేత.. ఆ రాష్ట్ర మాజీమంత్రి నారాయణపై చిత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి ఈ ఏడాది ఏప్రిల్‌లో అరెస్టు చేసి కోర్టుకు తరలించిన సంగతి విదితమే. అయితే న్యాయస్థానం అతనికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో కింది కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది చిత్తూరు కోర్టులో మరో పిటిషన్ వేశారు. …

Read More »

మునుగోడులో బీజేపీకి బుద్ధి చెప్పాలి

కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ బావులకు మీటర్లు పెట్టాలని చూస్తుంది. ఆ ప్రభుత్వానికి   మునుగోడు ప్రజలు తమ ఓటుతో బుద్ధి చెప్పాలని అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌ రెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కౌశిక్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఊకొండి, సింగారం గ్రామాల్లో సోమవారం 500 బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. రెండు …

Read More »

జీఎస్టీని వెంటనే ఉపసంహరించుకోవాలి

చేనేతపై కేంద్ర ప్రభుత్వం విధించిన 5 శాతం జీఎస్టీని వెంటనే ఉపసంహరించుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటినుంచి ఈ రంగంపై గతంలో ఎప్పుడు ఎలాంటి పన్ను విధించలేదన్నారు. ఈమేరకు చేనేత వస్త్రాలు, ముడి సరుకులపై జీఎస్టీని ఎత్తి వేయాలని ప్రధాని మోదీకి మంత్రి తలసాని పోస్ట్‌కార్డు పంపారు. హైదరాబాద్‌లో మంత్రి తలసానిని కలిసిన చేనేత సంఘం ప్రతినిధులు.. జీఎస్టీ విధించడంతో కలిగే …

Read More »

నదిలో కుప్పకూలిన కేబుల్ బ్రిడ్జ్.. 141కి చేరిన మృతులు..!

గుజరాత్‌లో ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. మోర్బి పట్టణంలో మచ్చూ నదిపై ఉన్న తీగల వంతెన కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 141 మంది మృతి చెందారు. మృతుల్లో ఇప్పటివరకు 18 మంది చిన్నారులను గుర్తించారు. ప్రమాద సమయంలో 400 మందికి పైగా బ్రిడ్జిపై ఉన్నారు. తాజాగా ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. మచ్చు నదిపై ఉన్న కేబుల్ బ్రిడ్జ్‌ కేవలం 100 మందిని …

Read More »

కోహ్లీ పర్సనల్ వీడియో లీక్.. సీరియస్ అయిన క్రికెటర్!

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి చేదు అనుభవం ఏదురైంది. కోహ్లీ లేని సమయంలో కొందరు ఆయన గదిలోకి వెళ్లి వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. నెట్టింట్లో ఆ వీడియో చూసి షాకైన విరాట్ కోహ్లీ సీరియస్ అయ్యారు. నిన్న(ఆదివారం) జరిగిన దక్షిణాఫ్రికా, ఇండియా మ్యాచ్‌ కోసం ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో కోహ్లీ ఓ హోటల్ రూంలో ఉన్నారు. అయితే కోహ్లీ లేని టైంలో కొందరు …

Read More »

హైదరాబాద్ లో మళ్లీ దొరికిన రూ.89.92 లక్షల నగదు- ఆ అభ్యర్థివేనా..?

తెలంగాణలో నవంబర్ మూడో తారీఖున మునుగోడు ఉపఎన్నిక పోలింగ్‌ ఉన్న సంగతి విదితమే. ఈ పోలింగ్ రోజు  సమీపిస్తున్న వేళ పెద్దమొత్తంలో నగదు పట్టుబడుతున్నది. గతకొన్ని రోజులుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు రాజధాని నగరంలో అక్రమ నగదు లభిస్తున్నది. తాజాగా మరోసారి హైదరాబాద్‌లో భారీగా డబ్బును పోలీసులు పట్టుకున్నారు. డబ్బును తరలిస్తున్నారనే సమాచారంతో వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నగరంలోని జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబర్‌ 71లో వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat