పనసతో బోలెడు లాభాలు పనస కాయలో పీచు పదార్థాలు ఎక్కువ. అన్ని విటమిన్లు, ఖనిజాలు పనసలో ఉంటాయి. పనస కాయలో ఉండే పొటాషియం రక్తపోటును తగ్గిస్తుంది. గుండె జబ్బులు,ఎముకల బలహీనతను నివారిస్తుంది. కండరాలు, నరాల పని తీరును మెరుగుపరుస్తుంది. ఇందులోని ఫైటో కెమికల్స్ నరాల రుగ్మతలను నివారిస్తాయి. హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది పనస.
Read More »ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు
ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 1,578 మంది కరోనా బారిన పడ్డారు. మరో 22 మంది మరణించారు. ఫలితంగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 19,24,421కు చేరగా, మరణాల సంఖ్య 13,024కు పెరిగింది. కొత్తగా 3,041 మంది కోలుకోగా, రికవరీల సంఖ్య 18,84,202కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 27,195 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 696 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక కరోనాబారిన పడి మరో ఆరుగురు మృతి చెందారు. ఇక రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రేటు.. 97.08శాతంగా ఉంది. కొత్తగా 858మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. మరోవైపు గడిచిన 24గంటల్లో 1,05,797 కరోనా పరీక్షలు చేశారు.
Read More »కరోనా థర్డ్ వేవ్ తప్పదా..?
దేశంలో కరోనా థర్డ్ వేవ్ తప్పదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్-IMA.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. సామూహిక కార్యక్రమాల్లో కొవిడ్ నిబంధనల అమలుపై నిర్లక్ష్యం తగదని సూచించింది. ఇలాంటి ఘటనలే థర్డ్ వేవ్కు కారణమవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. పర్యాటక స్థలాల సందర్శన, తీర్థయాత్రలు, మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే అంశంపై మరికొన్ని నెలలు ఆగాల్సిన అవసరం ఉందని సూచించింది.
Read More »కడుపు వికారంగా ఉందా..?
కడుపు వికారంగా ఉంటే, ఇలా చేయండి జీలకర్రను నీటిలో మరిగించి, ఆ నీటిని తాగాలి మూడుపూటలా ఒక స్పూన్ తేనె తీసుకోవాలి గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, చక్కెర, ఉప్పు కలుపుకుని తాగాలి కాఫీ, టీ, పాలను తీసుకోకపోవడమే మంచిది తులసి ఆకుల రసం తీసుకోవాలి పెరుగు తీసుకుంటే ఫుడ్ పాయిజనింగ్ ప్రభావం తగ్గుతుంది.
Read More »రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత
టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. 11 ఏళ్ల తర్వాత కౌంటీ క్రికెట్లో తొలి ఓవర్ వేసిన స్పిన్నర్ రికార్డు నెలకొల్పాడు. 2010లో న్యూజిలాండ్ స్పిన్నర్ జీతన్ పటేల్ ఆరంభ ఓవర్ వేశాడు. మళ్లీ ఇన్నాళ్లకు అశ్విన్ ఇన్నింగ్స్ తొలి బంతిని వేశాడు. సోమర్సెట్లో జరిగిన కౌంటీ మ్యాచ్లో సర్రే తరఫున బరిలోకి దిగిన అశ్విన్.. ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేశాడు.
Read More »ఆహారం నమలకుండా తింటే ఏంటి నష్టం..?
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో తినడానికి టైం కూడా ఉండడం లేదు. చాలా మంది అయితే బ్రేక్ ఫాస్ట్ కూడా చేయరు. ఒకవేళ తినాల్సి వస్తే ఏదో హడావిడిగా ఆహారం నమలకుండా మింగేస్తుంటారు. దీని వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది. బాగా నమిలి తినడం వల్ల ఆహారంలోని పోషకాలను శరీరం మరింత సమర్థవంతంగా గ్రహిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా జీర్ణక్రియ సాఫీగా జరగడంతో పాటు అసిడిటీ, మలబద్దకం లాంటి సమస్యలు కూడా …
Read More »నాలుగు నీటి సూత్రాలు మీకోసం
గది ఉష్ణోగ్రతలో ఉన్న నీటిని తాగటం మంచిది. మరీ చల్లగా ఉండే నీరు ఒంట్లోంచి ద్రవాలు ఎక్కువగా బయటకు వెళ్లిపోయేలా చేస్తుంది. రోజును నీటితో ఆరంభించటం మంచిది. ఉదయం ఓ గ్లాసు నీరు తాగితే ఉత్సాహం వస్తుంది. భోజనం చేసేటప్పుడు ఎక్కువ నీళ్లు తాగకూడదు. దీని వల్ల జీర్ణరసాలు పల్చగా అయి జీర్ణక్రియ మందగిస్తుంది. టీ, కాఫీలు మూత్రం ఎక్కువగా వచ్చేలా చేస్తాయి. వీటిని తీసుకునేటప్పుడు కాస్త నీళ్లు తాగాలి.
Read More »రోగ నిరోధకశక్తి పెరగాలంటే?
విటమిన్-సి ఎక్కువగా ఉండే ద్రాక్ష, నారింజ పండ్లు, నిమ్మకాయలు, కివీ, క్యాప్సికం ఆహారాలను తీసుకోవాలి. అల్లం, వెల్లుల్లిని నిత్యం పచ్చిగా తినాలి. పాలకూర, పెరుగును రోజూ తీసుకోవాలి. ఆ విటమిన్-ఎ, సి పుష్కలంగా ఉండే లెమన్,బత్తాయి, బాదంపప్పు తినాలి. ఆ పసుపు, గ్రీన్ టీ, బొప్పాయి, చికెన్ సూప్, పొద్దు తిరుగుడు విత్తనాలు వంటివాటిని తరచుగా తీసుకోవాలి.
Read More »నైట్ టైంలో ఫోన్ వాడుతున్నారా?
నైట్ టైంలో ఫోన్ వాడుతున్నారా? ఎక్కువగా ఫోన్ వాడటం అనేక అనర్థాలకు కారణమని తెలిసినా అర్ధరాత్రి వరకూ ఫోన్ వాడుతుంటారు చాలామంది. రాత్రి లైట్ తీసేసిన తరువాత కూడా ఫోన్లో తల దూరిస్తే.. ప్రమాదమంటున్నారు నిపుణులు. సరైన లైటింగ్ లేదు కాబట్టి కళ్లు ఫోన్ వల్ల ఎక్కువ స్ట్రెయిన్ అవుతాయి. దీంతో నెమ్మదిగా కళ్ల చుట్టూ డార్క్ సర్కిల్స్ వచ్చేస్తాయి. ఫోన్లోని UV కిరణాలు ముఖంపై పడి.. స్కిన్ ట్యాన్తో …
Read More »