ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తెలంగాణ రాష్ట్రంలో మొదటి వైద్య కళాశాల మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీకి శంకుస్థాపనకు ముహూర్తం కుదిరింది. రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా రేపు శంకుస్థాపన జరగనుంది. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి చొరవతో ఈ కళాశాల మంజూరయింది. నిజానికి రెండేళ్ళ కిందటే మహబూబ్‌నగర్ వైద్యకళాశాల ప్రారంభమైంది. 2016-17 విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. తాజాగా 2017-18 …
Read More »లభ్యమైన మురళి సూసైడే నోట్..
ఉస్మానియా వర్సిటీలోని మానేర్ హాస్టల్ బాత్రూమ్‌లో పీజీ విద్యార్థి మురళీ ఉరేసుకుని బలవన్మరణం చెందిన విషయం తెలిసిందే..ఆత్మహత్య చేసుకున్న మురళీ ఎంఎస్సీ ఫిజిక్స్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రావటం లేదని మనస్తాపానికి లోనై మురళీ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే.. మురళి ఆత్మహత్యకు పాల్పడిన ప్రాంతం వద్ద పోలీసులకు సూసైడ్ నోట్ దొరికింది.. “అమ్మా నన్ను క్షమించు.. ఈ చదువులు భరించలేకపోతున్నా.. ఇంకా తట్టుకోవడం నావల్ల …
Read More »ఓయూలో విద్యార్థి ఆత్మహత్య..ఉద్రిక్తత
ఉస్మానియా విశ్వ విద్యాలయం మానేరు హాస్టల్‌లో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎమ్మెస్సీ ఫిజిక్స్ తొలి సంవత్సరం చదువుతున్న మురళి అనే విద్యార్థి మానేరు హాస్టల్లోని 159వ నంబరు గది బాత్రూరంలో ఉరి వేసుకుని చనిపోయాడు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఓయూ హాస్టల్‌కు చేరుకుని పరిశీలిస్తున్నారు. మృతుడి స్వస్థలం సిద్దిపేట్ జిల్లా అని తెలుస్తోంది. మురళీ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించే యత్నం చేయగా పోలీసులను విద్యార్థులు …
Read More »ఖమ్మంలో కంచె ఐలయ్య అరెస్ట్..
“సామాజిక స్మగ్లర్ల కోమటోళ్లు” పుస్తక రచయిత ప్రొఫెసర్ కంచె ఐలయ్య షెపర్డ్ సభలు ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. ఏపీతోపాటు తెలంగాణలోనూ ఆయన సభలపై పోలీసులు, వైశ్యలు, బ్రాహ్మణుల సంఘాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. ఇవాళ ఖమ్మంలో గొర్రెల పెంపకందారుల మహాసభలో పాల్గొనడానికి వెళ్లిన ఐలయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు.కంచె ఐలయ్య అరెస్ట్ చేయడంతో సీపీఎం కార్యాలయం వద్ద కాసేపు ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఐలయ్య అరెస్ట్ చేసినంత మాత్రనా బహిరంగ సభ ఆగదని, …
Read More »సూర్యాపేటను దేశంలోనే ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతా౦
రాష్ట్రంలోని సూర్యాపేటజిల్లాలో ఎస్సీ కమ్యూనిటీ హాల్‌కు ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలోనే ఆదర్శ పట్టణంగా సూర్యాపేటను తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. 60 ఏళ్లలో జరగని అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జరుగుతోందన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలోనే 63 ఎస్సీ కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తున్నామని తెలిపారు. దళితవాడల అభివృద్ధికి సీఎం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. అర్హులైన వారందరికీ డబుల్ …
Read More »బీసీల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..సీఎం కేసీఆర్
అసెంబ్లీ కమిటీ హాల్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీ ప్రజాప్రతినిధులతో సమావేశం కొనసాగుతోంది.. ఈ సమావేశానికి శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, పలువురు మంత్రులు, అన్ని పార్టీలకు చెందిన బీసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా బలహీన వర్గాల కోసం ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కేసీఆర్ వివరించారు. బీసీల అభివృద్ధికి సంబంధించి.. ఆయా వర్గాల నుంచి చాలా డిమాండ్లు, వినతులు వస్తున్నాయని తెలిపారు. …
Read More »2018 ఖరీఫ్ నాటికి అన్ని మార్కెట్‌లలో ఈ-నామ్ అమలు..మంత్రి హరీష్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని బోయిన్‌పల్లి మార్కెట్‌లో ఈ-సేవ శిక్షణ తరగతులను మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ ప్రారంభించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. ఈ-నామ్‌పై అవగాహన పెంపొందించేందుకు, అమలు చేసేందుకు శిక్షణ తరగతులను ప్రారంభించామన్నారు. ఈ-సేవ శిక్షణ తరగతులు ఆరు రోజుల పాటు కొనసాగుతాయని చెప్పారు.ఈ-నామ్ ద్వారా కొనుగోలు చేయడం వల్ల దళారీ వ్యవస్థ పోతుందని తెలిపారు. 2018 ఖరీఫ్ నాటికి అన్ని మార్కెట్‌లలో ఈ-నామ్ అమలు జరగాలని …
Read More »అమీర్‌పేట్ మెట్రో రైల్వేస్టేషన్‌లో బాంబు కలకలం.. ఇంతకీ బ్యాగ్‌లో ఏముంది..?
హైదరాబాద్ మెట్రో రైలు అలా మొదలైందో..లేదో ఇలా బాంబు బెదిరింపులొచ్చాయ్. అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌కు ఆదివారం ఉదయం బాంబు బెదిరింపు వచ్చింది. స్టేషన్‌లో బాంబు పెట్టినట్లు పోలీసులకు సమాచారం రావడంతో వెంటనే అప్రమత్తమయ్యారు.బాంబు స్క్వాడ్ వెంటనే స్టేషన్‌కు చేరుకుంది. తనిఖీలు చేపట్టింది. ఉరుకులు, పరుగులు పెట్టిన పోలీసులు, భారీ సంఖ్యలో ఉన్న ప్రయాణికుల మధ్యే బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. అయితే తనిఖీల్లో భాగంగా.. స్టేషన్‌లో ఓ గుర్తు తెలియని …
Read More »అక్రమ సంబంధం ముందు.. తల వంచిన తల్లి ప్రేమ..!
హైదరాబాద్ ఎస్ ఆర్ నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ కన్నతల్లి మాతృత్వానికి మచ్చతెచ్చే పని చేసింది. నాలుగేళ్ల కూతురిని వదిలించుకునేందుకు అత్యంత కిరాతకంగా ప్రవర్తించింది. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని నాలుగేళ్ల బాలికను తల్లి, ప్రియుడితో కలిసి చిత్రహింసలకు గురిచేసింది. కాలుతున్న పెనంపై చిన్నారిని కూర్చోబెట్టి చిత్రహింసలకు గురిచేసింది. దీంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.చిన్నారి రోదన విని.. స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చిన్నారిని కాపాడి …
Read More »19 నుంచి భద్రాద్రి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు
భద్రాద్రి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల పోస్టర్ ను హైదరాబాద్ లోని సచివాలయంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు ఆవిష్కరించారు. ఈ నెల 19 నుంచి వచ్చే నెల 8 వరకు భద్రాద్రి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని మంత్రులు తెలిపారు. ఈ నెల 28న గోదావరిలో తెప్పోత్సవం, 29 ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చే స్వామి వారిని కనులారా తిలకించేందుకు తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద …
Read More »