కేంద్రం నుంచి రాష్ట్రానికి జీఎస్టీ బకాయిలు రావడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో ప్రకటించారు. జీఎస్టీ విషయంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నానని సీఎం చెప్పారు. శాసనసభ సమావేశాల్లో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై విస్తృతంగా చర్చ జరగాలని సీఎం తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు సహజం. పౌరసత్వ సవరణ చట్టం దేశాన్ని కుదిపేస్తోంది. సీఏఏపై చర్చ ఒకరోజుతో …
Read More »దిలీప్ కొణతం కు పీఆర్సీఐ చాణక్య అవార్డు
తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖలోని డిజిటల్ మీడియావిభాగం డైరెక్టర్ కొణతం దిలీప్‌కు పీఆర్సీఐ చాణక్య అవార్డు లభించింది. డిజిటల్ కమ్యూనికేషన్‌లో అద్భుత పనితీరుకు పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీఆర్సీఐ) ఈ అవార్డుకు ఎంపికచేసింది. శుక్రవారం బెంగళూరులో జరిగిన ‘గ్లోబల్ కమ్యూనికేషన్ కాంక్లేవ్-2020’లో ఆ రాష్ట్ర హోంమంత్రి బసవరాజ్ బొమ్మై నుంచి దిలీప్ అవార్డును అందుకున్నారు. సంక్షేమపథకాలను డిజిటల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లినందుకు దిలీప్‌కు అవార్డు దక్కింది. ఈ …
Read More »మార్చి 20వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలను ఈ నెల ఇరవై తారీఖు వరకు నిర్వహించాలని సభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) నిర్ణయించింది. ఇందులో భాగంగా శాసనసభలో పన్నెండు రోజులు.. శాసనమండలిలో ఎనిమిది రోజుల పాటు బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని బీఏసీ ఏజెండా ఖరారు చేసింది. రేపు ఆదివారం మార్చి ఎనిమిదో తారీఖున అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హారీష్ రావు ,శాసనమండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి …
Read More »జబర్దస్త్ గా కొనసాగుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు రోజా వనం సంయుక్తంగా మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన రష్మీ గారు , జబర్దస్త్ ఫేమ్ యాంకర్ రష్మీ గారు ఈరోజు నానక్రాంగూడ లోని తన నివాసంలో మొక్కలు నాటారు మరో ముగ్గురిని నామినేట్ చేశారు , ఈ సందర్భంగా రష్మీ మాట్లాడుతూ , ఈ కార్యమాన్ని ఛాలెంజ్ గా తీసుకొని , నాకు ఈ అవకాశం ఇచ్చిన రోజా గారికి …
Read More »కరోనా పై తెలంగాణ చర్యలు దేశానికి ఆదర్శం
తెలంగాణలో కొవిడ్-19 వైరస్ నియంత్రణకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం చేపట్టిన చర్యలు బాగున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రశంసించా రు. కొవిడ్-19 నియంత్రణపై అన్ని రాష్ర్టాల మంత్రులు, ఉన్నతాధికారులతో శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఇందులో మన రాష్ట్రం తరఫున వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, కుటుంబసంక్షేమశాఖ కమిషనర్ యోగితారాణా పాల్గొన్నా రు. కరోనా పరీక్షలు, ఐసొలేషన్ వార్డులు, …
Read More »కరోనా పాజిటివ్ వ్యక్తిని పరామర్శించిన మంత్రి ఈటల.
కరోనా వైరస్ తెలంగాణలో పాజిటివ్ వచ్చిన క్షణం నుంచి ప్రజల్లో ఉన్న భయాందోళనలను తొలగించేందుకు 24 గంటలు పని చేస్తున్నామని అన్నారు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. సోషల్ మీడియాలో చైనా కు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో కరోనా వైరస్ సోకితే ఇక చావే శరణ్యం అన్నట్లుగా ప్రచారం జరిగిందని దాంతో ప్రజల్లో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయని ఆయన అన్నారు. ప్రభుత్వపరంగా ఎన్ని …
Read More »బ్రేకింగ్..డ్రోన్ కేసులో రేవంత్ రెడ్డికి చుక్కెదురు..
టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బంధువులకు చెందిన ఫాంహౌస్‌ను అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన కేసులో మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి సహా మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కోర్టు రేవంత్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ క్రమంలోనే తాజాగా డ్రోన్ వినియోగం కేసులో ఎంపీ రేవంత్ రెడ్డికి రాజేంద్రనగర్ కోర్టులో …
Read More »రైతుబంధుకు నిధులు విడుదల…
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకానికి రూ. 333.29 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఈ మేరకు పరిపాలనా అనుమతులు మంజూరు అయ్యాయి. ఈ ఏడాది ఇప్పటికే రూ. 1350.61 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ప్రస్తుతం విడుదలైన నిధులతో కలిపి 2019-20లో రైతుబంధు పథకానికి రూ.1683.90 కోట్లు విడుదలయ్యాయి.
Read More »కారోనా వైరస్.. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు భేష్..కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్
కరోనా వైరస్ కేసులపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సమీక్ష నిర్వహించింది. అన్ని రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులతో వీడియో కార్ఫరెన్స్ ద్వారా కేంద్ర మంత్రి హర్షవర్ధన్ సమీక్ష జరిపారు. కరోనా పరీక్షలు, ఐసోలేషన్ వార్డులు, ల్యాబ్‌లు, రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలపై సమీక్షలో చర్చంచారు. ఈ సందర్భంగా.. తెలంగాణలో కరోనా వైరస్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను కేంద్రమంత్రి హర్షవర్థన్ అభినందించారు. కరోనాను ఎదుర్కొనేందుకు తెలంగాణ సర్కార్ పకడ్బందీ ప్రణాళికతో ముందుకుసాగుతుందని …
Read More »పట్టణాల మార్పే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి విజయవంతం – మంత్రి కేటీఆర్
పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా పట్టణాల్లో మార్పుదిశగా ఒక ముందడుగు పడిందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పట్టణాల మార్పే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన తొలి దశ పట్టణ ప్రగతి విజయవంతం అయ్యిందని తెలిపారు. పదిరోజుల పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలంతా కలిసి ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు ప్రయత్నం చేశారన్నారు. పట్టణాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడంలో పట్టణ ప్రగతి కార్యక్రమం తొలి అడుగుగా భావిస్తున్నామని తెలిపారు. ఈ …
Read More »