పర్యావరణాన్ని పరిరక్షించడం వ్యవసాయం ద్వారానే సాధ్యం అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. శనివారం మంత్రి నిరంజన్ రెడ్డి జగిత్యాల జిల్లా పొలాసలో వ్యవసాయ కళాశాల నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ భూమండలాన్ని పచ్చగా ఉంచే శక్తి వ్యవసాయానికే ఉంది. ఇతర కార్యాకలాపాలన్నీ పర్యావరణాన్ని నాశనం చేసేవే అన్నారు. ఒకప్పుడు ఎంత పొలం ఉంది అని అడిగి పిల్లనిచ్చేది. కానీ …
Read More »దేశానికి తెలంగాణ రోల్ మోడల్..!!
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే సాధ్యం అని రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లాలోని కంది మండలంలో మంత్రి హరీష్ రావు సమక్షంలో రామకృష్ణా రెడ్డి టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు.. రామకృష్ణా రెడ్డి మంచి నాయకుడు అని ప్రశంసించారు. కేసీఆర్ నాయకత్వంలో కంది మండలం ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. రూ.80 కోట్లతో కంది-శంకర్ పల్లి రోడ్డు …
Read More »తెలంగాణ కుంభమేళా…మేడారం జాతర తేదీలు ఇవే..!
తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధిగాంచిన ఆసియాలోనే అతి పెద్ద గిరిజన పండుగ…మేడారం జాతరకు రంగం సిద్ధమవుతోంది. 13 వ శతాబ్దంలో తమ జాతి కోసం కత్తి పట్టి అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన సమ్మక్క, సారలమ్మ శౌర్యపరాక్రమాలకు ప్రతీకగా గిరిజనులు నాలుగు రోజుల పాటు మేడారం జాతరను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించి..అధికారికంగా నిర్వహిస్తోంది. 2020 వ సంవత్సరం మాఘమాసంలో జరుగబోయే మేడారం జాతరకు …
Read More »దిశ కేసులో షాకింగ్ నిజాలు
తెలంగాణతో పాటుగా యావత్తు దేశమంతటా సంచలనం సృష్టించిన దిశ కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. నలుగురు నిందితులు దిశను అతిదారుణంగా అత్యాచారం జరిపి.. ఆ తర్వాత చంపి.. పెట్రోల్ పోసి తగులబెట్టిన సంగతి విదితమే. ఈ కేసును చేధించిన పోలీసులు సీన్ రీకన్ స్ట్రక్షన్ లో భాగంగా కేసును సంఘటన స్థలంలో విచారిస్తుండగా పోలీసులపై నిందితులు దాడికి దిగడంతో ఆత్మరక్షణకోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతిచెందారు. అయితే …
Read More »మోదీపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ప్రధానమంత్రి నరేందర్ మోదీపై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మల్కాజ్ గిరి ఎంపీ అనుముల రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు శనివారం జరిగిన భారత్ బచావో ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ” ప్రధానమంత్రి నరేందర్ మోదీ నియంతృత్వ విధానాలను ఎండగట్టేందుకే ఈ ర్యాలీ అని ఆయన పునరుద్ఘాటించారు. నోట్ల రద్దు నిర్ణయం వికటించి ఆర్థిక పరిస్థితి మందగించింది. …
Read More »గడప గడపకూ ఎమ్మెల్యే అరూరి….
గ్రేటర్ వరంగల్ 35వ డివిజన్ కడిపికొండ గ్రామంలో రాజమండ్రి బోటు ప్రమాద బాధిత కుటంబాలలో 5గురి కుటుంబాలకు టీఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ 2లక్షల రూపాయల చెక్కులను వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అరూరి రమేష్ ఇంటింటికి వెళ్లి అందజేశారు. అలాగే బోటు ప్రమాదంలో గాయపడిన వారికి ఏపీ ప్రభుత్వం ప్రకటించిన లక్ష రూపాయల చెక్కులను సైతం అందజేశారు. బోటు ప్రమాద బాధిత కుటుంబాలకు ఇప్పటికే తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు కలిపి 15లక్షల …
Read More »సోషల్ మీడియాలో ఎంపీ అరవింద్ ను ఆడుకుంటున్న నెటిజన్లు
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో బీజేపీ తరపున నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి బరిలోకి దిగిన ధర్మపురి అరవింద్ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ కవితపై గెలుపొందిన సంగతి విదితమే. అయితే ఈ ఎన్నికల ప్రచారంలో ప్రస్తుత ఎంపీ అరవింద్ తో సహా ఆ పార్టీకి చెందిన జాతీయ నాయకులు అఖరికీ మోదీతో సహ అందరూ తెలంగాణకు పసుపుబోర్డును ఇస్తాము. అది నిజామాబాద్ లోనే పెడతాము అని హామీచ్చారు. …
Read More »దమ్ముంటే రమ్మంటున్న మాజీ మంత్రి డీకే అరుణ
తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఇందిరా పార్క్ దగ్గర రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు చేయాలనే లక్ష్యంతో మహిళా సంకల్ప దీక్షను చేపట్టిన సంగతి విదితమే. నిన్న ఆ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ నిమ్మరసం ఇవ్వడంతో ఈ దీక్ష ముగిసింది. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ” రాష్ట్రంలో వెంటనే మద్యపానం నిషేధం అమలు చేయాలి. మహిళలపై జరుగుతున్న …
Read More »మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిసిన కొమురవెల్లి మల్లన్న దేవస్థానం సిబ్బంది
కొమురవెల్లి మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవం, బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కొమురవెల్లి ఆలయ అధికారులు అర్చకులు అహ్వానించారు . హైదరాబాద్ లోని అరణ్య భవన్ లో మంత్రిని కలిసి అహ్వాన పత్రికను,ప్రసాదాన్ని అందజేశారు. ఈ నెల 22 నుంచి మార్చి 23 2020 వరకు జరిగే స్వామి కళ్యాణ మహోత్సవం, బ్రహ్మోత్సవాల్లో పాల్గోనాలని మంత్రిని కోరారు. మంత్రిని కలిసిన వారిలో కొమురవెల్లి ఈవో వెంకటేష్ …
Read More »ఆరు నెలల పాటు కొన్ని రైళ్ళు రద్ధు
తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్ పరిధిలోని కొన్ని రైళ్ళను ఆరు నెలల పాటు బంద్ చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. భద్రత,కొన్ని నిర్వహణ పనుల దృష్ట్యా వచ్చే ఏడాది జనవరి ఒకటో తారీఖు నుంచి జూన్ ముప్పై తారీఖు వరకు పలు మార్గాల్లో పదమూడు రైళ్లను రద్దు చేయనున్నారు. ఏమి ఏమి రైళ్ళు రద్దు అవుతున్నాయో తెలుసుకుందాం.. సికింద్రాబాద్ పరిధిలో రద్ధు అయిన రైళ్ల వివరాలు- సికింద్రాబాద్-మేడ్చల్-సికింద్రాబాద్ డెము ప్యాసింజర్(77601/77602) …
Read More »