తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం ప్రతి ఇంటికి త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన పథకం మిషన్ భగీరథ. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్చమైన తాగునీరు అందించాలనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న పలు పథకాలు దేశానికి ఆదర్శంగా నిలవడమే కాకుండా కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఈ పథకాలను అమలు చేయడానికి ప్రణాళికలు కూడా …
Read More »టీటీడీ తెలంగాణ సలహామండలి వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన దరువు ఎండీ కరణ్ రెడ్డి..!
టీటీడీ తెలంగాణ సలహామండలి (LAC) వైస్ ప్రెసిడెంట్‌గా దరువు ఎండీ సీహెచ్ కరణ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. నవంబర్ 11 సాయంత్రం హిమాయత్ నగర్‌లోని టీటీడీ దేవాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో కరణ్ రెడ్డి టీటీడీ తెలంగాణ సలహామండలి వైస్ ప్రెసిడెంట్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ ప్రాంత టీటీడీ ఆలయాలు, సమాచార కేంద్రాల సలహా సంఘానికి ఉపాధ్యక్షుడిగా కరణ్ రెడ్డి వ్యవహరిస్తారు.. హిందూ ధార్మిక పరిరక్షణకు చేస్తున్న కృషికిగాను …
Read More »మిషన్ కాకతీయ, భగీరథ పథకాలను ప్రశంసించిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్..!!
మిషన్ భగీరథ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ ఇంటికీ ప్రతీ రోజు సురక్షిత మంచినీరు అందించినట్లే, దేశ వ్యాప్తంగా మంచినీటి పథకం అమలు చేసే ఆలోచన ఉన్నదని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రకటించారు. ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించడం ప్రభుత్వాల కనీస కర్తవ్యమని ఆయన అన్నారు. ఆయా రాష్ట్రాల భాగస్వామ్యంతో మంచినీటి పథకాలు అమలు చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. మంచినీటి పథకాలు …
Read More »ప్రపంచ వారసత్వ, పర్యాటక, శిల్ప కళా వేదికగా రామప్ప..!!
కాకతీయుల నాటి అత్యంత రమణీయ శిల్పకళా వైభవానికి, భక్తి ప్రపత్తులకి ప్రతీక గా నేటికీ నిలుస్తున్న రామప్ప త్వరలోనే ప్రముఖ ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ప్రపంచ వారసత్వ, పర్యాటక, శిల్ప కళా వేదికగా మారనుంది. రాష్ట్ర ప్రభుత్వ సహాయం, కేంద్ర సహకారం, సీఎం కేసీఆర్, కేటీఆర్ ల ఆశీస్సులతో తెలంగాణ శాసన మండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాస రెడ్డి సంకల్పం, చిరకాల స్వప్నం సాకారం కానుంది. అంతర్జాతీయ నిర్ణిత ప్రమాణాలకు అనుగుణంగా …
Read More »ఆర్టీసీ సమ్మె..హైకోర్టు విచారణ రేపటికి వాయిదా..!!
రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. రూట్ల ప్రైవేటీకరణపై కేబినెట్ తీర్మానాన్ని ప్రభుత్వం ఇవాళ హైకోర్టుకు సమర్పించింది. ఈ క్రమంలోనే సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై దాఖలైన పిటిషన్లన్నీ కలిపి విచారణ చేస్తామని కోర్టు పేర్కొంది. ఆర్టీసీ సమ్మె జరుగుతున్నా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిందని కోర్టు …
Read More »రైల్వే ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త..!!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. ఈ క్రమంలోనే భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది. మొత్తం 4103 ఖాళీలను భర్తీ చేయనునట్లు ప్రకటించింది. ఏసీ మెకానిక్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఈ అప్రెంటీస్ పోస్టుల్ని దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 27 యూనిట్లలో భర్తీ చేయనుంది. ఇందులో 25 యూనిట్లు …
Read More »సూర్యపేటకు గోదావరి జలాలపై సీఎం కేసీఆర్ ఆరా..!!
సూర్యపేటకు పరుగులు పెడుతున్న గోదావరి జలాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీశారు. సోమవారం ఉదయం మంత్రి జగదీష్ రెడ్డి తో ఫోన్ లో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ మీరు వద్దనేంత వరకు సూర్యపేట కు గోదావరి జలాలు విడుదల చేయడానికి ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఎన్ని చెరువులు నిండాయని మంత్రి జగదీష్ రెడ్డి తో తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలోని చెర్వులన్ని నింపాలంటూ ఆదేశించారు. గోదావరి …
Read More »మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో విశాఖ శ్రీ శారదాపీఠం స్వామిజీలకు పుష్పాభిషేకం…!
ఈ రోజు విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి, ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివార్లకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పుష్ఫాభిషేకం కార్యక్రమం ఘనంగా జరిగింది. వెస్ట్‌మారేడుపల్లిలోని మంత్రి తలసాని నివాసంలో జరిగిన ఈ పుష్పాభిషేకం కార్యక్రమం ఆద్యంతం కన్నులపండుగా సాగింది. తమ నివాసానికి విచ్చేసిన ఇరువురు స్వామిజీలకు మంత్రి తలసాని దంపతులు, ఆయన …
Read More »అమెరికా రాయబారితో వినోద్ కుమార్ సమావేశం
అమెరికాలో భారతీయ రాయబారి, డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అమిత్ కుమార్ ను వాషింగ్టన్ డీసీ లో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా అమెరికా, తెలంగాణ సంబంధాలు, తెలంగాణలో నూతనంగా విదేశీ విశ్వ విద్యాలయాలు, మరిన్ని ఫార్మా, ఐటీ పరిశ్రమల ఏర్పాటు వంటి అంశాలపై ఇష్టాగోష్ఠి గా చర్చించారు.దేశంలో విదేశీ విశ్వ విద్యాలయాలను ఏర్పాటు చేసేందుకు నిషేధం …
Read More »ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం సర్కారు ఉద్యోగులకు శుభవార్తను తెలిపింది. ఇందులో భాగంగా సర్కారు ఉద్యోగులకు పీఆర్సీ అమలు దిశగా చర్యలు చేపట్టింది. 10,12రోజుల్లో పీఆర్సీ అమలు గురించి నివేదికను ఇవ్వాల్సిందిగా వేతన సవరన సంఘాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ఉద్యోగుల వేతనాల పెంపుకోసం 2018లో పీఆర్సీ కమిషన్ నియమించింది. త్వరలోనే పీఆర్సీ కమిషన్ నివేదిక ఇవ్వనుంది. 2018 జులై 1 …
Read More »