మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్టుతోనే తాగునీటి కష్టాలకు చెక్ పెట్టొచ్చన్నారు ఉత్తరప్రదేశ్ గ్రామీణాభివృద్ధి, తాగునీటి శాఖ ప్రత్యేక కార్యదర్శి సురేంద్ర రామ్(IAS). భారీ ప్రాజెక్టు ఐన భగీరథను తక్కువ కాలంలో పూర్తిచేసి మిగతా రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు ను అధ్యయనం చేయడానికి ఉత్తరప్రదేశ్ నుంచి ఇంజనీర్ల బృందంతో వచ్చిన సురేంద్రరామ్, ఇవాళ ఎర్రమంజిల్ లోని భగీరథ ప్రధాన కార్యాలయంలో ఈ.ఎన్.సి కృపాకర్ రెడ్డిని కలిశారు. …
Read More »సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి..కేటీఆర్
పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈరోజు తెలంగాణ భవన్లో పార్టీ సభ్యత్వ కార్యక్రమ నియోజకవర్గ ఇన్చార్జీలతో ఆయన ఒక సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మార్గ నిర్దేశం మేరకు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ పార్టీ ఇన్చార్జ్ లను కోరారు. …
Read More »కోనేరు కృష్ణారావు అరెస్ట్.. చట్టానికి ఎవరూ అతీతులు కారు..కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలోని సిర్పూర్ కాగజ్‌నగర్ నియోజకవర్గంలో అటవీశాఖ అధికారిణి అనితపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దాడి ఘటనపై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మహిళా అధికారిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు కేటీఆర్ ట్విటర్‌లో పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఉన్న మహిళ అధికారిపై దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు, జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణ వ్యవహార శైలిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. చట్టానికి …
Read More »నేటి నుంచి తెలంగాణలో భారీ వర్షాలు
ఉత్తర బంగాళాఖాతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడనుందని, ఆ తర్వాత రెండు రోజులకు అది వాయుగుండంగా మారనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఆదివారం నుంచి 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఆయన వెల్లడించారు. రుతుపవనాలు మొదలయ్యాక అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ మరింత ఆశాజనకంగా ఉంటుం దని వ్యవసాయ …
Read More »ఎంపీ రేవంత్ రెడ్డి రాజీనామా..!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ,ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుముల రేవంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ మహానగరం పరిధిలోని మల్కాజ్ గిరి నుండి బరిలోకి దిగిన రేవంత్ రెడ్డి ఎంపీగా గెలుపొందిన సంగతి తెల్సిందే. అయితే తెలంగాణలో మూడు స్థానాలను గెలుచుకున్న కానీ దేశ వ్యాప్తంగా మాత్రం ఆ పార్టీఘోర పరాజయం పాలైంది. ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత …
Read More »హారీష్ రావుపై అభిమానంతో..!
తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట పట్టణంలో నిరుపేద కుటుంబానికి చెందిన నాయి బ్రాహ్మణుడు కొత్వాల్ శ్రీనివాస్ మరో సారి తన అభిమానాన్ని చాటుకున్నారు.. మాజీ మంత్రి,సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హారీశ్ రావుపై తనకు ఉన్న అభిమానము తో నర్సాపూర్ గుండ్ల చెరువు ప్రాంతంలో ” హరీష్ అన్న హెయిర్ కటింగ్ ” పేరు తో కటింగ్ షాప్ పెట్టాడు.. కొత్వాల్ శ్రీనివాస్ నాడు హరీష్ ఎన్నికల్లో అభిమానంతో లక్ష మెజారిటీ రావాలని …
Read More »కేటీఆర్ ప్రత్యేక చొరవతో వీరయ్య జీవితంలో వెలుగులు
దేశం దాటి ఎడారి దేశం సౌదీ అరేబియాలో బందీ ఐన తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మక్తపల్లికి చెందిన పాలేటి వీరయ్య ఎట్టకేలకు స్వగ్రామం చేరుకున్నాడు. ఉపాధి నిమిత్తం విజిట్ వీసాపై సౌదీ వెళ్లిన బాధితుడు అక్కడ ఒంటెల కాపరిగా పనిచేశాడు. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా ఇంటికి వెళ్తానన్న వీరయ్యను యజమాని ఇంటికి పంపేందుకు నిరాకరించాడు. పైగా ఒంటె చనిపోయిందని చిత్రహింసలు పెట్టాడు. దీంతో …
Read More »భేటీలో సీఎం కేసీఆర్ వేసిన ఆ “జోకు”కు నవ్వులే.నవ్వులు..?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు,నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్ మహానగరంలో ప్రగతి భవన్లో భేటీ అయిన సంగతి విదితమే.ఈ భేటీలో ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న పలు సమస్యలు,జలవివాదాలు,విభజన చట్టంలోని హామీలపై,పంపకాలపై తదితర అంశాల గురించి సుధీర్ఘ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రులు,అధికారులు అందరూ హాజరయ్యారు.ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వేసిన జోకుకు …
Read More »సీఎం కేసీఆర్ చెప్పిన ఆ మాటకు సీఎం జగన్ ఫిదా..?
దేశంలో ఎక్కడ లేనివిధంగా తొలిసారిగా ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు,అటు నవ్యాంధ్ర సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నిన్న శుక్రవారం తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లో ప్రగతి భవన్లో భేటీ అయిన సంగతి తెల్సిందే. ఈ భేటీలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన చట్టంలో అమలు కావాల్సిన హామీల గురించి,ఆస్తుల పంపకాలు,నీళ్లు నిధులు పంపకాలు,ఇరు రాష్ట్రాల మధ్య ఎప్పటి నుండో ఉన్న పలు సమస్యల …
Read More »విశ్వమంతా విత్తన విప్లవం రావాలి.. గవర్నర్
విశ్వమంతా విత్తన విప్లవం రావాలి. ప్రపంచ ఆకలి తీరాలి. ఆహార భద్రతతో మానవాళి సంతోషం మురవాలి. విత్తనం పుట్టుక మొదలు అభివృద్ది వరకు సమగ్ర చర్చ జరగాలని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. నోవాటెల్ లో జరిగిన అంతర్జాతీయ విత్తన సదస్సు ముగింపు సమావేశానికి హాజరయిన ఆయన సదస్సును ఉద్దేశించి ఉత్తేజపూరిత ప్రసంగం చేశారు. వ్యవసాయంలో విత్తనం చాలా కీలకం అని, కల్తీ విత్తనం అమ్మడం అంటే ఆత్మహత్యకు …
Read More »