Home / TELANGANA (page 729)

TELANGANA

ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలి.. మంత్రి తలసాని

బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పేర్కొన్నారు. జులై 9వ తేదీన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం నేపథ్యంలో ఇవాళ ఆలయంలో కల్యాణం ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. అమ్మవారి కల్యాణానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. ఆలయ పరిసరాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసేందుకు …

Read More »

రూపాయి ఖర్చు లేకుండా ఇండ్లు కట్టిస్తున్నాం..హరీష్ రావు

మాజీ మంత్రి హరీష్ రావు ఇవాళ సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం ముండ్రాయి గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..”ఈ ఇండ్లు చూస్తుంటే హైదరాబాద్ లో ఉన్నా అపార్ట్ మెంట్ భవనాలమాదిరి కనిపిస్తున్నాయి. ఏనుకటి రోజుల్లో ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనే సామెత ఉండేది.  రూపాయి ఖర్చు లేకుండా ఇండ్లు కట్టిస్తున్నాం,కళలో కూడా ఊహించని ఇండ్లు …

Read More »

మా వంతు సహాయం చేస్తాం.. మహేష్‌ బిగాల

ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిన్న తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్వత్య నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. పార్టీ తొలి సభ్యత్వాన్ని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ అందుకున్నారు. రాష్ట్రంలో పార్టీ సభ్యత్వ నమోదు నిన్న ప్రారంభం కాగా, ఇవాళ టీఆర్‌ఎస్‌ ఎన్నారై శాఖలు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించాయి. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ ఎన్నారై కోఆర్డినేటర్‌ మహేష్‌ బిగాల పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. అనంతరం సభ్యత్వ …

Read More »

ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషి దేశానికి ఆదర్శం

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనలో సంక్షేమ పథకాల అమలు ద్వారా శాశ్వత పేదరిక నిర్మూలనకు, వివక్ష రహిత సమాజ నిర్మాణమే ధ్యేయంగా దార్శనికత కలిగిన ప్రజా నాయకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషి దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీసీ కమిషన్ సభ్యుడు డాక్టర్. వకుళాభరణం కృష్ణమోహన్ రావు రాసిన “చుక్కాని- సంక్షేమానికి పునర్నిర్వచనం” అనే పుస్తక తొలిప్రతిని కేటీఆర్ ఆవిష్కరించారు. రాష్ట్రంలో ఉన్నన్ని సంక్షేమ …

Read More »

తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలు బాగుండాలి-సీఎంలు కేసీఆర్,జగన్

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లోని ప్రగతి భవన్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌ల సమావేశం కొనసాగుతోంది. ఏపీ పునర్విభజన చట్టంలోని ఉమ్మడి అంశాలపై ఇరువురి మధ్య చర్చ కొనసాగుతోంది. వివాదాస్పద అంశాలు, నదీ జలాల పంపకం తదితర అంశాలతో పాటు గోదావరి జలాల సద్వినియోగం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. గోదావరి మిగులు జలాలను కృష్ణా నదికి మళ్లించేందుకు ఉన్న అవకాశాలపై చర్చిస్తున్నారు. తెలంగాణ, ఏపీ రెండు …

Read More »

ఆపద్బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్

తెలంగాణలో నిరుపేదల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అండగా ఉండి ఆదుకుంటున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు.నియోజకవర్గంలోని ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన ఎర్ర రాజిరెడ్డి అనారోగ్యంతో బాధపడుతుండగా అతడి వైద్య చికిత్స కోసం రూ.2 లక్షల ఎల్.ఓ.సి.ని బాధిత కుటుంబసభ్యులకు శుక్రవారం ఎమ్మెల్యే అందచేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ పేదలకు కేసీఆర్ గారు అండగా ఉన్నారని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు …

Read More »

ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య

తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలోని మధురనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. పురుగులు మందు తాగి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో రాంప్రసాద్‌, అతని భార్య సుచిత్రతో పాటు ఇద్దరు పిల్లలు రుషిత, జాహ్నవికి కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు ముదిగొండ మండలం వల్లభి గ్రామానికి చెందిన గ్రానైట్‌ వ్యాపారిగా తెలుస్తోంది.

Read More »

ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ వెనక అసలు కారణం ఇదే..?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో భేటీ అయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల స్నేహ సంబంధాలను పటిష్ఠం చేయడంతో పాటు రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా ఇరువురు ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. గోదావరి, కృష్ణా నదులకు సంబంధించిన ప్రధానాంశాలు సహా 5 కీలక అంశాలపై చర్చలు జరపనున్నారు. ఇప్పటికే పలు దఫాలు లాంఛనంగా ముఖ్యమంత్రుల భేటీలు జరిగాయి. గవర్నర్‌ సమక్షంలోనూ చర్చించారు. దీనికి …

Read More »

విజయనిర్మల భౌతికకాయానికి నివాళులు అర్పించిన జగన్..

అలనాటి ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత, సూపర్‌స్టార్‌ కృష్ణ సతీమణి విజయనిర్మల(73) బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. నగరంలోని గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో ఆమె గతకొంతకాలంగా చికిత్సపొందుతు బుధవారం తుదిశ్వాస విడిచారు.అయితే ఈ ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయనిర్మల భౌతికకాయానికి నివాళులర్పించారు. నానక్‌రామ్‌గూడలోని నటుడు కృష్ణ నివాసానికి వెళ్లి విజయనిర్మల భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించారు.అనంతరం కృష్ణ ,నరేష్ మరియు కుటుంభ సభ్యులను పరామర్శించారు. తన భార్య మరణంతో విలపిస్తున్న …

Read More »

రైతుంబంధును కర్ణాటకలో అమలుచేస్తాం..!!

తెలంగాణలో అమలుచేస్తున్న రైతుబంధు పథకాన్ని త్వరలోనే కర్ణాటక రాష్ట్రంలో అమలు చేస్తామని, తెలంగాణ రాష్ట్రంలో రైతులకు భరోసానిచ్చేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ పథకాలు ఎంతో బాగున్నాయని కర్ణాటక వ్యవసాయ శాఖా మంత్రి శివశంకర్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ విత్తన సదస్సులో భాగంగా రెండవరోజు హైటెక్స్ లో నిర్వహించిన విత్తన రైతుల సమావేశానికి గౌరవ అతిథిగా హాజరయిన ఆయన రైతులను ఉద్దేశించి పూర్తిగా తెలుగులో ప్రసంగించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat