కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను ఆహ్వానించడానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శుక్రవారం ముంబై వెళ్లనున్నారు. ఉదయం 10.20కి హైదరాబాద్ నుంచి బయలుదేరి ముంబై రాజ్ భవన్ చేరుకుంటారు. మద్యాహ్నం రెండు గంటలకు మహారాష్ట్ర సీఎం అధికార నివాసమైన వర్షకు చేరుకుంటారు. ఈ నెల 21న జరిగే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా దేవేంద్ర ఫడ్నవీస్ ను …
Read More »ఈనెల 17న.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస గృహాలు ప్రారంభం..!!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని హైదర్ గూడలో ఎమ్మెల్యే , ఎమ్మెల్సీల కోసం కొత్తగా నిర్మించిన నివాస గృహాలను ఈనెల 17న స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. 17న ఏరువాకపౌర్ణమి పురస్కరించుకుని మంచి రోజు కావడంతో నివాస గృహాలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించుకున్నారు.ఈ సందర్భంగా 17న ఉదయం 6 గంటలకు కొత్త నివాసాలకు కేసీఆర్ గృహవాస్తు పూజలు చేయనున్నారు. మొత్తం 4.5 ఎకరాల్లో …
Read More »టీఆర్‌ఎస్ పార్లమెంటరీ నేతగా కేకే..విప్ గా జోగినపల్లి
టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో గురువారం ప్రగతిభవన్ లో జరిగింది. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సమావేశంలో పార్లమెంటరీ పార్టీ నేత, లోక్‌సభ పక్ష నేత, రాజ్యసభ పక్ష నేతలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా సీనియర్ ఎంపీ కె.కేశవరావును ఎన్నుకున్నారు.లోక్‌సభ పక్ష నాయకుడిగా ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్ రావు ను, ఉప నాయకుడిగా మెదక్ …
Read More »దాసరి నారాయణరావు కొడుకు కిడ్నాప్..!
దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు కొడుకు ప్రభు కనిపించటం లేదంటూ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నెల 9న ఇంటి నుంచి బయటకు వెళ్లిన ప్రభు తిరిగి రాలేదు. ఎక్కడ వెతికినా కనిపించకపోవటంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. 2008లోనూ ప్రభు ఇలా అదృశ్యమయ్యారు. అప్పట్లో తిరిగి వచ్చిన ప్రభు తన భార్య సుశీల తనను కిడ్నాప్ చేసిందంటూ ఆరోపించారు. దాసరి మరణం తరువాత కుటుంబంలో …
Read More »కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ప్రభుత్వం భారీఎత్తున ఏర్పాట్లు చేస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిస్థాయిలో రీడిజైన్‌చేసి, రెండున్నరేండ్ల రికార్డు సమయంలోనే ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదలచేస్తున్న దరిమిలా కార్యక్రమాన్ని పండుగలా జరిపేందుకు కసరత్తు మొదలైంది. ఈ నెల 21న అధికారికంగా కన్నెపల్లి పంపుహౌస్‌లోని మోటర్ల వెట్న్ ప్రారంభం కానున్నది. ప్రస్తుతం ఎగువనుంచి ఇన్‌ఫ్లోలు లేకపోవడంతో ఒకేసారి మోటర్లను నడిపేందుకు ఆస్కారం లేకుండాపోయింది. గోదావరికి ఇన్‌ఫ్లోలు మొదలైన తర్వాత జూలైలో అన్ని మోటర్లు …
Read More »దేశంలోనే అసాధారణమైన ఎత్తిపోతల..ఇది ఒక చారిత్రాత్మక సన్నివేశం
రాష్ట్రంలోని దాదాపు 13 జిల్లాల్లో సుమారు 40 లక్షల ఎకరాల ఆయకట్టుకు జీవం పోసేందుకు నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభానికి సిద్ధమైంది. జూన్ 21న ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర్‌రావు ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. కన్నెపల్లి పంపుహౌస్‌లో నీటి ఎత్తిపోతలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణకు ఎగువన ఉన్న మహారాష్ట్ర, దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఈ మహత్తర కార్యక్రమానికి ముఖ్య …
Read More »కాళేశ్వరం ప్రాజెక్టు.. నీటిని ఎత్తి పోయడానికి ఏర్పాట్లు పూర్తి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి ఈ నెల 21న శంకుస్థాపన చేయాలని సిఎం కేసీఆర్ నిర్ణయించినందున, నీటిని ఎత్తిపోయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు ట్రాన్స్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు ప్రకటించారు. గోదావరి నుంచి 2 టిఎంసిల నీటిని ఎత్తి జలాశయాలకు తరలించడానికి 4,992.47 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుందని అంచనా వేసినట్లు వివరించారు. కొన్ని రిజర్వాయర్ల పనులు, లిఫ్టుల పనులు ఇంకా జరుగుతున్నందున ఈ ఏడాది నికరంగా …
Read More »గట్టు భీముడు అంత్యక్రియలకు కేటీఆర్
జోగులాంబ జిల్లా గద్వాల మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు బుధవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. భీముడి మృతి చెందడం పట్ల టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా రేపు ఉదయం 9 గంటలకు గట్టు మండలం బల్గెరా గ్రామం కు చేరుకొని భీముడు అంత్యక్రియల్లో కేటీఆర్ పాల్గొంటారు.
Read More »చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు..మంత్రి ఎర్రబెల్లి
చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునేలా కొత్త చట్టం తెస్తున్నామని, పంచాయతీ రాజ్ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ వ్యాఖ్యానించారు. ఈ రోజు కరీంనగర్ జిల్లా ఉమ్మడి జెడ్పీ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి పాల్గొని మాట్లాడారు. రానున్న కొత్త పంచాయతీ రాజ్ చట్టం ద్వారా మళ్లీ స్థానిక సంస్థలకు అధికారాలు బదలాయిస్తామని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిథులకు అధికారాలు ఇస్తే అభివృద్ధి జరుగుతుందనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని …
Read More »రేవంత్‌తో వివేక్ భేటీ…కాంగ్రెస్‌లోకి వెళ్తారా?
తెలుగు రాజకీయాల్లో మరో కీలక పరిణామం. ఇటీవలి కాలంలో అధికార టీఆర్ఎస్ పార్టీపై ఉద్దేశపూర్వకంగా బురదజల్లుతున్న ఇద్దరు నేతలు సమావేశం అయ్యారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ నేత జి.వివేక్‌తో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ భేటీ చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌లో వివేక్‌కు చెందిన మీడియా కార్యాలయంలో రేవంత్ రెడ్డి, వివేక్ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు నేతల మధ్య దాదాపు …
Read More »