వాలైంటైన్స్ డే సందర్భంగా ఆ ప్రేమికులు కళాశాల ఎదురుగా ఉన్న పార్క్ లో ముచ్చట పెడుతున్నారు. ఇంతలో భజరంగ్ దళ్ కార్యకర్తలు వారిని చుట్టు ముట్టి పెళ్లి చేశారు.వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్ జిల్లా సీఎంఆర్ కళాశాలకు చెందిన విద్యార్దులు కళాశాల ఎదురుగా ఉన్న ప్రాంతంలో ఏకాంతంగా ఉన్నారు. ఇంతలోనే వారిని భజరంగ్ దళ్ కార్యకర్తలు చుట్టుముట్టి బలవంతంగా తాళి కట్టించారు. వారు ఏం చేస్తారోనన్న భయంతో ఆ అబ్బాయి అమ్మాయి …
Read More »కాంగ్రెస్ పార్టీకి కేంద్ర మాజీమంత్రి రాజీనామా..!
కాంగ్రెస్ పార్టీకి కేంద్ర మాజీమంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత ఝలక్ ఇచ్చారు. ఖమ్మం పార్లమెంట్ టికెట్ తనకు కేటాయించకుంటే పార్టీకి రాజీనామా చేయనున్నట్లు ఆమె ప్రకటన చేశారు. గురువారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో రేణుకా చౌదరి ప్రకటన చేశారు. ఖమ్మం పార్లమెంట్ టికెట్ ఇతరులకు ఇస్తారంటూ లీకులు రావడంతో మనస్తాపం చెందిన ఆమె ఈసారి టికెట్ తనకు కేటాయించకుంటే పార్టీలో ఉండి కూడా దండగనే అభిప్రాయంలో ఉన్నారు. …
Read More »నేడు వలంటైన్స్ డే.. పలు ప్రాంతాల్లో ప్రేమికులు దర్శనం..!
హైదరాబాద్ మహా నగరంలోని పలు పర్యాటక ప్రాంతాలు ప్రేమికులకు కేరాఫ్‌గా అడ్రస్‌గా మారుతున్నాయి. మాదాపూర్‌లోని దుర్గం చెరువు సహా ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్, ఐమాక్స్ థియేటర్, ఎన్టీఆర్ గార్డెన్, సంజీవయ్య పార్కు, కృష్ణా నగర్ కృష్ణాకాంత్ పార్క్, ఇందిరాపార్కుల్లో ఎక్కడ చూసినా ప్రేమ పక్షులే కన్పిస్తాయి. చెట్టుకొక.. పుట్టకొక జంట దర్శనమిస్తూ ఉంటుంది. నిత్యం సందర్శకులతో కిటకిటలాడే ఆయా ప్రాంతాల్లో అమ్మాయిలు తమను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు ముఖానికి మాస్క్‌లు ధరిస్తున్నారు. …
Read More »తలసానికి రాజమండ్రిలో ఘన స్వాగతం..!!
మాజీ మంత్రి , సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఏపీలోని రాజమండ్రిలో అపూర్వ స్వాగతం లభించింది.తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ రోజు ఓ వివాహానికి హాజరయ్యేందుకు రాజమండ్రి వెళ్లారు.ఈ సందర్భంగా రాజమండ్రి విమానాశ్రయంలో అక్కడి యాదవ సంఘం నాయకులు, అభిమానులు ఆయన్ని ఘనంగా స్వాగతించారు. తలసానితో ఫోటోలు దిగేందుకు, షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ఏపీ ప్రజలు పోటీపడ్డారు. ఆ తర్వాత యాదవ సంఘం ఆధ్వర్యంలో పెళ్లి …
Read More »భారీ తీపికబురు..కొత్తగా 40,000 కొత్త ఉద్యోగాలు
తెలంగాణలోని ఉద్యోగార్థులకు గొప్ప తీపికబురు. ప్రపంచ ప్రసిద్ధ కన్సల్టింగ్ సంస్థ హైదరాబాద్‌లో కొత్తగా 40,000 నియామకాలు జరపనుంది. రాబోయే 3 నుంచి 5 ఏళ్లలో భారత్ లోనే తన అతిపెద్ద కేంద్రమైన హైదరాబాద్ లో ఉద్యోగుల సంఖ్యను సుమారుగా 80,000కి పెంచాలని నిర్ణయించింది. ఈ కంపెనీ ఏదంటే…ప్రపంచంలో నాలుగు అతిపెద్ద ఆడిట్ సంస్థల్లో ఒకటైన డెలాయిట్. డెలాయిట్‌కి ప్రస్తుతం హైదరాబాద్ కార్యాలయంలో దాదాపు 40,000 మంది ఉద్యోగులున్నారు. ఇక్కడ ప్రపంచ …
Read More »కేటీఆర్ సృష్టించిన ట్రెండ్ ఎంత వైరల్ అవుతోందంటే..
కొందరు ట్రెండ్‌ను సృష్టిస్తారు. ఇంకొందరు ట్రెండ్‌ను ఫాలో అవుతారు. ఇలా ట్రెండ్ సృష్టికర్తల జాబితాలో మరోమారు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పేరు తెరమీదకు వచ్చింది. కేటీఆర్ కృషి ఫలితంగా ఏర్పాటైన లవ్ హైదరాబాద్ సింబల్‌ను ఇప్పుడు ఆయా కంపెనీలన్నీ ఫాలో అవుతన్నాయి. వివిధ పురపాలక సంస్థలు, కంపెనీలు ఇలా వివిధ రకాల వేదికలన్నీ ఇదేదోరణిలో ముందుకు సాగుతున్నాయి., అప్పటి మంత్రి కేటీఆర్ చొరవతో, …
Read More »బైసన్ పోలో సమస్య షరిష్కరించాలి..ఎంపీ జితేందర్ రెడ్డి
పెండింగ్ లో ఉన్న బైసన్ పోలో గ్రౌండ్ సమస్యకు పరిష్కారం చూపాలని టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఇవాళ లోక్ సభలో ఎంపీ జితేందర్ రెడ్డి పలు అంశాలపై మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా నిర్మించబోయే సచివాలయానికి బైసన్ పోలో స్థలాన్ని కేటాయించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే కేంద్రప్రభుత్వంతో సీఎం కేసీఆర్ ఈ విషయంపై చర్చించారు. గత పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఈ …
Read More »సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు,నాయకులకు,కార్యకర్తలకు తెలియజేయునది ఏమనగా…
ఈ నెల 17న టీఆర్ఎస్ పార్టీ అధినేత , తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి పుట్టినరోజు పురస్కరించుకుని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే శ్రీ కల్వకుంట్ల తారకరామారావు కీలకమైన పిలుపునిచ్చారు. గులాబీ దళపతి జన్మదినం సందర్భంగా పత్రికా ప్రకటనలు,ఫ్లెక్సీలు, హోర్డింగులు పెట్టవద్దని కేటీఆర్ స్పష్టం చేశారు.దీనికి బదులుగా ఒక మొక్కని నాటి శుభాకాంక్షలు తెలపాలని ఆయన కోరారు.ఆకుపచ్చని తెలంగాణ సాధనకు గులాబీ దళపతి చేస్తున్న కృషికి …
Read More »బాపినీడు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం..!
ప్రముఖ సినీ దర్శకుడు, పాత్రికేయుడు, కథా రచయిత విజయబాపినీడు మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. పలు విజయవంతమైన చిత్రాలు అందించడమే కాకుండా, విజయ అనే పత్రిక నడపడం ద్వారా విజయాన్ని తన ఇంటి పేరుగా మార్చుకున్న బాపినీడు తెలుగు సినీ రంగ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే ముద్ర వేశారని సీఎం కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Read More »ఈ నెల 17న అత్యంత ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు..తలసాని
ఈ నెల 17న తెలంగాణ రాష్ట్ర ముఖ‍్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు హైదరాబాద్ నగరంలోని జలవిహార్ లో ఘనంగా జరగనున్నాయి. ఈ మేరకు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రెండోసారి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన కేసీఆర్ పుట్టిన రోజు వేడుకను అత్యంత ఘనంగా, పండుగ వాతావరణంలో నిర్వహించనున్నట్లు అయన తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో …
Read More »