తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అడ్రస్ అడిగితే….చెప్పే వారు లేరు కానీ…ఆ పార్టీ నేతలు మాత్రం భారీ డైలాగ్‌లు కొడుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ చేయడానికే మొహం చాటేసిన ఆ పార్టీ…రాబోయే పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమవుతోందట. ఈ విషయాన్ని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రావుల మీడియాతో మాట్లాడుతూ తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ఆశాజనకంగా రాలేదని వాపోయారు. అయినప్పటికీ …
Read More »హరీష్ రావును మెచ్చుకున్న కేటీఆర్
మాజీ మంత్రి హరీశ్‌రావును టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మెచ్చుకున్నారు.బుధవారం సిద్ధిపేట జిల్లా కేంద్రంలో హరీష్ రావుతో పాటు స్థానిక కలెక్టర్ కృష్ణభాస్కర్ సమీకృత మార్కెట్ యార్డును ప్రారంభించారు. ఆ మార్కెట్‌కు సంబంధించిన ఫోటోలను హరీశ్ తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు తగినట్టుగా ఆ మార్కెట్‌ను నిర్మించారు.సుమారు 20 కోట్ల వ్యయంతో ఈ సమీకృత మార్కెట్ బిల్డింగ్‌ను నిర్మించారు ఒకే చోట కూరగాయలు, మాంసాన్ని …
Read More »హైదరాబాద్ లో ప్రముఖ టీవీ నటి ఆత్మహత్య..
ప్రముఖ టీవీ నటి ఝాన్సీ ఆత్మహత్య చేసుకుంది. శ్రీనగర్ కాలనీలో తన నివాసంలోనే ఝాన్సీ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఝాన్సీ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మా టీవీ ఛానెల్‌లో ప్రసారమయ్యే ‘పవిత్రబంధం’ అనే సీరియల్‌లో ఝాన్సీ నటిస్తున్నారు. ఝాన్సీ స్వస్థలం …
Read More »రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఆరునెలల్లో వైకుంఠధామాలు..సీఎం కేసీఆర్
మహాత్మాగాంధి జాతీయ ఉపాధి హామీ పథకం(నరేగా) నిధులను సంపూర్ణంగా వినియోగించుకుని గ్రామాల్లో తెలంగాణకు హరితహారం, వైకుంఠధామాలు (స్మశానవాటికలు) నిర్మించాలని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. నరేగా నిధులతో పాటు రాష్ట్ర బడ్జెట్ నిధులు, ఎంపి, ఎమ్మెల్యేల నియోజకవర్గ అభివృద్ధి నిధులు కూడా ఉపయోగించుకుని గ్రామాల్లో అభివృద్ధి చర్యలు చేపట్టాలని సిఎం చెప్పారు. నరేగా పథకం కింద కేంద్రం రాష్ట్రానికి ఎంత మొత్తంలో డబ్బులు ఇస్తుందో, అంతే మొత్తంలో …
Read More »సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..200 మంది అధికారుల బదిలీ
అడవులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో కఠినంగా వ్యవహరించే నిబద్ధత, అంకితభావం కలిగిన అధికారులను నియమించాలనే ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు అటవీశాఖ భారీ బదిలీలకు శ్రీకారం చుట్టింది. దాదాపు 200 మంది అధికారులను బదిలీ చేసింది. అడవుల సంరక్షణ విషయంలో, అటవీ భూముల్లో చెట్ల పెంపకంపై చిత్తశుద్ధి చూపించే అధికారులను ముఖ్యమైన ప్రాంతాల్లో నియమించింది. జంగిల్ బచావో – జంగిల్ బడావో నినాదంతో అడవుల సంరక్షణకు, …
Read More »కాంగ్రెస్ బెదిరింపు..యాత్ర సినిమా మేం చెప్పినట్లే ఉండాలి
కాంగ్రెస్ నేతల వ్యవహారశైలికి తాజా నిదర్శనం ఇది. తమ మాటే నెగ్గాలనే తత్వానికి నిదర్శనం ఇది. మలయాళ నటుడు మమ్మూట్టి ప్రధాన పాత్రలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ‘యాత్ర’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అమెరికాలో ఫిబ్రవరి 7న రిలీజ్ అవుతుండగా.. తెలుగు రాష్ట్రాల్లో ఫిబ్రవరి 8న రిలీజ్ అవనుంది. అయితే, విడుదలకు ముందు ‘యాత్ర’ సినిమాకు టీకాంగ్రెస్ హెచ్చరికలు పంపింది. టీపీసీసీ …
Read More »సినీ నటుడు తమ్ముడిపై కాంగ్రెస్ నాయకుడు దాడి..వదిన ఫైర్?
ఎప్పుడూ వివాదాలలో ఉండే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బంధువు కౌశిక్‌రెడ్డి మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. జూబ్లీహిల్స్‌లోని ఓ జువెలరీ షాపు ముందు కారును పార్క్‌చేసిన కౌశిక్‌రెడ్డిని ఆ షాపు యజమాని, సినీనటుడు రాజశేఖర్ సోదరుడు గుణశేఖర్ ఇదేంటి అని ప్రశ్నించగా వారిపై దాడికి పాల్పడ్డాడు.అసల విషయానికి వస్తే ఈ నెల 2న సాయంత్రం 7 గంటల సమయంలో జూబ్లీహిల్స్ రోడ్ నం 45లోని గుణాస్ డైమండ్స్ జువెల్స్ స్టోర్స్‌వద్దకు వచ్చిన …
Read More »ఎంపీ కవితకు మరో అరుదైన గౌరవం
నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కు మరో అరుదైన గౌరవం దక్కింది.ఈ నెల 23న దేశంలోని వర్సిటీల విద్యార్థులతో నిర్వహించే కేరళ అసెంబ్లీ సదస్సుకు రావాలని కేరళ స్పీకర్ పి శ్రీరామకృష్ణన్ ఎంపీ కవితను ఆహ్వానించారు. ఈ మేరకు ఆయన ఎంపి కవితను ఆహ్వానిస్తూ లేఖ రాశారు. కేరళ అసెంబ్లీ డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 23 నుండి 25 వరకు నిర్వహిస్తున్న సదస్సును ఉప రాష్ట్ర …
Read More »యాదాద్రి పునరుద్ధరణ పనులు..సీఎం కేసీఆర్ కీలక సూచనలు..!!
ఆధ్యాత్మికత ఉట్టిపడేలా, అద్భుత ఆలయ శిల్ప కళా నైపుణ్యంతో, ఆలయ ప్రాశస్త్యం, వైభవం ప్రస్ఫుటమయ్యేలా యాదాద్రి పునరుద్ధరణ పనులు జరగాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులకు సూచించారు. యాదాద్రిలో చేపట్టిన నిర్మాణ పనులకు నిధుల కొరత లేకుండా ఈ సారి బడ్జెట్లో కూడా అవసరమైనన్ని నిధులు కేటాయిస్తామని చెప్పారు. పునరుద్ధరణ పనులన్నీ పూర్తయిన తర్వాత సహస్ర్రాష్టక కుండయాగం (1008 యాగ కుండాలతో) 11 రోజుల పాటు మహాయాగం నిర్వహించనున్నట్లు సిఎం …
Read More »కాంగ్రెస్ నేతలపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వాఖ్యలు..!!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ,సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను జైలులో ఉన్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీహెచ్ తప్ప ఎవరూ పరామర్శించలేదన్నారు. ఈవిషయం నన్ను చాలా భాదించిందన్నారు. తనకు, ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎలాంటి విభేదాలు లేవని ..సంగారెడ్డి ప్రజల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లను కలుస్తానన్నారు. ముఖ్యమంత్రి …
Read More »