ఏపీ రాజధాని అమరవాతి కృష్ణానది కరకట్ట లోపల అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ అక్రమంగా నిర్మించిందేనని నిర్ధారించిన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) శుక్రవారం నోటీసులు జారీ చేసింది. నివాసానికి బయటవైపు గోడకు లింగమనేని రమేష్ పేరుతో అధికారులు నోటీసులు అంటించారు. చంద్రబాబు నివాసంతోపాటు 28 భవనాలకు నోటీసులు ఇచ్చారు. …
Read More »Blog Layout
విజయనిర్మల భౌతికకాయానికి నివాళులు అర్పించిన జగన్..
అలనాటి ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత, సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల(73) బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. నగరంలోని గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో ఆమె గతకొంతకాలంగా చికిత్సపొందుతు బుధవారం తుదిశ్వాస విడిచారు.అయితే ఈ ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయనిర్మల భౌతికకాయానికి నివాళులర్పించారు. నానక్‌రామ్‌గూడలోని నటుడు కృష్ణ నివాసానికి వెళ్లి విజయనిర్మల భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించారు.అనంతరం కృష్ణ ,నరేష్ మరియు కుటుంభ సభ్యులను పరామర్శించారు. తన భార్య మరణంతో విలపిస్తున్న …
Read More »రైతుంబంధును కర్ణాటకలో అమలుచేస్తాం..!!
తెలంగాణలో అమలుచేస్తున్న రైతుబంధు పథకాన్ని త్వరలోనే కర్ణాటక రాష్ట్రంలో అమలు చేస్తామని, తెలంగాణ రాష్ట్రంలో రైతులకు భరోసానిచ్చేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ పథకాలు ఎంతో బాగున్నాయని కర్ణాటక వ్యవసాయ శాఖా మంత్రి శివశంకర్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ విత్తన సదస్సులో భాగంగా రెండవరోజు హైటెక్స్ లో నిర్వహించిన విత్తన రైతుల సమావేశానికి గౌరవ అతిథిగా హాజరయిన ఆయన రైతులను ఉద్దేశించి పూర్తిగా తెలుగులో ప్రసంగించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
Read More »తెలంగాణ వ్యవసాయ పాలసీలు ప్రపంచానికే ఆదర్శం..!!
తెలంగాణ వ్యవసాయ పాలసీలు ప్రపంచానికే ఆదర్శం. ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ ప్రపంచవ్యాప్తంగా రైతులకు అండగా నిలుస్తున్న 20 అత్యుత్తమ పథకాలలో తెలంగాణ నుండి రైతుబంధు, రైతుభీమా పథకాలు నిలిచాయి. ఐక్యరాజ్యసమితి ఈ పథకాలను అన్ని దేశాలకు వివరించాలని ఆహ్వానించిందని, రైతుల పట్ల కేసీఆర్ నిబద్దత, చిత్తశుద్ది మూలంగా ఇలాంటి పథకాలు సాధ్యం అయ్యాయని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ విత్తన సదస్సులో భాగంగా …
Read More »తెలంగాణ లో విత్తనాల పంట పండాలి
విత్తనాల ఉత్పత్తికి ప్రపంచంలోనే తెలంగాణ ప్రాంతంలో శ్రేష్టమయిన వాతావరణం ఉంటుంది. తెలంగాణలో ఉత్పత్తి అయిన విత్తనం ప్రపంచంలో ఎక్కడయినా పండుతుంది. తెలంగాణ లో విత్తనాల పంట పండాలి. ఆ విత్తనాలు ప్రపంచ పంటలకు ఆధారం కావాలి. పంట కాలనీల తరహాలో విత్తన పంట కాలనీలను ఏర్పాటు చేయగలిగితే తెలంగాణ ప్రపంచ విత్తన భాండాగారంగా ఎదగడం పెద్ద విషయం కాదన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి …
Read More »టీఆర్ఎస్ సభ్యత్వం ప్రారంభం..!!
ఇవాళ తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యవర్గ సభ్యులు, జడ్పీ చైర్మన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై సీఎం కేసీఆర్ చర్చించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి సభ్యత్వం స్వీకరించి టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన 11 …
Read More »విజయ నిర్మలకు సీఎం కేసీఆర్ నివాళి
ప్రముఖ సినీ దర్శకురాలు విజయనిర్మలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. నానక్‌రామ్‌గూడలోని సినీనటుడు కృష్ణ నివాసానికి వెళ్లిన సీఎం కేసీఆర్.. విజయ నిర్మల భౌతికకాయం వద్ద అంజలి ఘటించారు. తెలంగాణ భవన్‌లో పార్టీ సమావేశం అనంతరం నానక్‌రామ్‌గూడ వెళ్లిన ముఖ్యమంత్రి.. కృష్ణను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తదితరులు ఉన్నారు.
Read More »హైదరాబాద్‌కు సీఎం జగన్.. రేపు సీఎం కేసీఆర్‌తో భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ బయల్దేరారు. తాడేపల్లిలోని తన నివాసంలో విద్యాశాఖ అధికారులతో సమీక్ష తర్వాత పలువురు మంత్రులతో కలిసి సీఎం భాగ్యనగరానికి పయనమయ్యారు. శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో జగన్ ప్రగతిభవన్‌లో భేటీ కానున్నారు. విభజన చట్టంలోని ఉమ్మడి అంశాలపై ఇద్దరు సీఎంలూ చర్చించనున్నారు. వివాదాస్పద అంశాలు, నదీ జలాల పంపకం, ఇతర అంశాలపైనా చర్చించే అవకాశం ఉంది.
Read More »వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం..!
ఆంధ్ర్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘అమ్మ ఒడి’ పథకాన్ని ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా వర్తింస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. గురువారం విద్యాశాఖపై సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం, ప్రైవేట్ జూనియర్ కాలేజీలతోపాటు హాస్టల్లో ఉంటూ చదివేవారు, రెసిడెన్షియల్ హాస్టళ్లలో ఉండే వారికి కూడా ఇకపై అమ్మ ఒడి పథకం …
Read More »ఎట్టకేలకు చేసిన తప్పులు ఒప్పుకున్న సమంత..!
సమంత అక్కినేని.. ఈ పేరు వింటే చాలు కుర్రకారుకు మంచి మజా వస్తుంది.తన నటనతో డాన్స్ తో విపరీతమైన ఫాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.కొన్ని సినిమాలు అనంతరం నాగచైతన్య తో ప్రేమలో పడింది.కొన్నిరోజులకు వారిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు.అయితే ప్రస్తుతం సమంత తాను చేసిన తప్పులను ఒప్పుకుంది.తాను చేసిన తప్పులను సరిదిద్దుకుంటానని,నేను చేసిన తప్పులు నాకు ఒక గుణపాఠమని అన్నారు.ఓటమి ఎదురైనప్పుడు భయపడకూడదని దైర్యంగా ముందుకు వెళ్తేనే అసలైన విజయమని అన్నారు.ప్రస్తుతం …
Read More »