rameshbabu
March 2, 2022 MOVIES, SLIDER
553
తెలుగుసినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ యువ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన ‘గని’ కొత్త విడుదల తేదీ ఖరారు చేసింది చిత్రబృందం. గత నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా భీమ్లా నాయక్ రిలీజ్ అయిన నేపథ్యంలో వాయిదా పడింది. ఇప్పుడు కొత్త తేదీని ప్రకటిస్తూ సోషల్ మీడియాలో తాజాగా అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ, …
Read More »
rameshbabu
March 2, 2022 INTERNATIONAL, SLIDER
962
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ హత్య చేసేందుకు రష్యా 400 మంది కిరాయి గుండాలను సిద్ధంగా ఉంచిందని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. వారంతా వాగ్నర్ గ్రూప్ చెప్పుకుంటోన్న ప్రైవేటు మిలిషియాకు చెందినవారు. ఆ బృందాన్ని ఆఫ్రికా నుంచి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. జెలెన్స్కీతో సహా 23 మంది ప్రభుత్వ పెద్దల్ని హత్య చేసేందుకు పుతిన్ నుంచి ఆదేశాలున్నట్లు ఆ సంచలన కథనం పేర్కొంది.
Read More »
rameshbabu
March 2, 2022 MOVIES, SLIDER
693
ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్ధనరెడ్డి తనయుడు కిరీటి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కబోతున్న ఈ ద్విభాషా చిత్ర ప్రారంభోత్సవం ఈ నెల 4న బెంగళూరులో జరగబోతోంది. ఇతను ఇప్పటికే నటన, డ్యాన్స్, ఫైటింగ్లలో శిక్షణ తీసుకున్నాడు. సాయి కొర్రపాటి నిర్మించనున్న ఈ చిత్రానికి రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తాడు. సంగీతం దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ సెంథిల్ అందిస్తున్నారు.
Read More »
rameshbabu
March 2, 2022 SLIDER, SPORTS
740
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లికి క్రికెట్ పట్ల అంకితభావానికి, హార్డ్ వర్క్ కు నిదర్శనమే వందో టెస్టు అని టీమిండియా పేసర్ బుమ్రా అన్నాడు. జట్టు కోసం అతను ఎన్నో త్యాగాలు చేశాడని కొనియాడాడు. వందో టెస్టులో భారత జట్టును గెలిపించడమే తాము కోహ్లికిచ్చే పెద్ద బహుమతి అని తెలిపాడు. అతను భవిష్యత్తులోనూ ఇదే స్థాయిలో రాణిస్తాడని పేర్కొన్నాడు. ఇప్పటికి కోహ్లి 99 టెస్టుల్లో 7,962 పరుగులు చేశాడు. …
Read More »
rameshbabu
March 2, 2022 SLIDER, SPORTS
644
రోహిత్ శర్మ ట్విట్టర్ ఖాతా నుంచి అర్థం పర్థం లేని ట్వీట్లు రావడం కలకలం రేపింది. ఈ ఉదయం రోహిత్ ట్విట్టర్ ఖాతా నుంచి “నాకు కాయిన్స్ ను ఎగరవేయడం అంటే ఇష్టం… అది నా కడుపులోకి చేరుకుంటే ఇంకా బాగుంటుంది” అని ట్వీట్ వచ్చింది. ఈ ట్వీట్ తో ఫాలోవర్స్ షాక్ తిన్నారు. కాసేపటికే “క్రికెట్ బాల్స్ ను తినొచ్చు కదా?” అంటూ మరో ట్వీట్ రావడంతో రోహిత్ …
Read More »
rameshbabu
March 2, 2022 INTERNATIONAL, SLIDER
870
ఒకవైపు వందలకొద్దీ యుద్ధ ట్యాంకులను దురాక్రమణకు నడిపిస్తూనే.. బాంబుల వర్షం కురిపిస్తూనే.. మరోవైపు చర్చలకు హాజరవుతున్న రష్యా.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని హత్య చేయించేందుకు 400 మంది కిరాయి గూండాలను రంగంలోకి దింపిందంటూ యూకేకు చెందిన టైమ్స్ వార్తా సంస్థ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. జెలెన్ స్కీతోపాటు.. ఉక్రెయిన్ ప్రధాని, ఆయన కేబినెట్‌లోని మంత్రులు, కీవ్ మేయర్, ఆయన సోదరుడు (ఇద్దరూ బాక్సింగ్ చాంపియన్లు).. ఇలా 23 …
Read More »
rameshbabu
March 2, 2022 SLIDER, TELANGANA
555
దేశ రాజధాని మహానగరం ఢిల్లీలోని మహబూబ్ నగర్ మాజీ ఎంపీ ,బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్ రెడ్డి నివాసంలో జరిగిన కిడ్నాప్ సంఘటన సంచలనం సృష్టించింది. సోమవారం రాత్రి ఎనిమిదిన్నరకు జరిగిన ఈ ఘటనలో సౌత్ అవెన్యూలో ఉన్న మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి నివాసం ముందు జితేందర్ రెడ్డి డ్రైవర్ థాపా ,మహబూబ్ నగర్ కు చెందిన మున్నూరు రవితో పాటు మరో ఇద్దరు గుర్తు …
Read More »
rameshbabu
March 2, 2022 ANDHRAPRADESH, SLIDER
1,290
ఏపీ అధికార వైసీపీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి బాబాయి మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఉదాంతం ఇప్పుడు ఏపీ రాజకీయాలను ఒక ఊపు ఊపుతున్న సంగతి తెల్సిందే. ఏపీ ప్రజల మన్నలను పొందిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై వైఎస్ వివేకానందరెడ్డి తనయ సునీతమ్మ,ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిలను పావులగా వాడుకోని ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బురద …
Read More »
rameshbabu
March 2, 2022 SLIDER, TELANGANA
590
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తమిళ నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి,డీఎంకే అధినేత ఎం.కే. స్టాలిన్ కు ఫోన్ చేశారు. మంగళవారం ఫోన్ చేసిన సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి స్టాలిన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయురారోగ్యాలు,సుఖసంతోషాలతో కలకాలం జీవించాలని.. కోరుకున్న లక్ష్యాలను సాధించాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.ఈ సందర్భంగా తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్ కు ముఖ్యమంత్రి స్టాలిన్ కృతజ్ఞతలు తెలిపారు.
Read More »
rameshbabu
March 1, 2022 BUSINESS, SLIDER
1,156
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన కుమారుడు జైన్(26) మృతి చెందాడు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్య, ఆయన భార్య అను దంపతుల కుమారుడు జైన్ నాదెళ్ల సోమవారం ఉదయం(అమెరికా కాలమానం ప్రకారం) మరణించినట్లు మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్ తెలిపింది. ఈ విషయాన్ని సత్య నాదెళ్ల తన ఎగ్జిక్యూటివ్ సిబ్బందికి ఇమెయిల్ ద్వారా తెలియజేశారు. జైన్ పుట్టినప్పటి నుంచి సెరెబ్రల్ పాల్సీ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఇక సెరెబ్రల్ …
Read More »