rameshbabu
December 14, 2021 NATIONAL, SLIDER
374
గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా కరోనా కేసులు 5,784 నమోదయ్యాయి. మరోవైపు 252 మంది వైరస్ తో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాలు 4,75,888కి చేరాయి. ఇక తాజాగా కొవిడ్ నుంచి 7,995 మంది కోలుకున్నారు. మొత్తంగా 3,41,38,763 మంది రికవరీ అయ్యారు. కాగా ప్రస్తుతం దేశంలో 88,993 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 133.8 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు.
Read More »
rameshbabu
December 14, 2021 SLIDER, TELANGANA
482
ఉమ్మడి నల్లగొండలో టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి 691 ఓట్ల మెజార్టీతో ఘన విజయం విజయం సాధించారు. మొత్తం 1233 ఓట్లు పోలవగా… 1183 ఓట్లు చెల్లాయి. చెల్లని ఓట్లు 50. గెలుపు కోటా 593 కాగా.. టీఆర్ఎస్ అభ్యర్థి కోటిరెడ్డికి 917 ఓట్లు రాగా.. స్వతంత్ర అభ్యర్థి నగేష్‌కు 226 ఓట్లు వచ్చాయి. మొత్తమ్మీద 691 ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి కోటిరెడ్డి ఘన విజయం సాధించారు
Read More »
rameshbabu
December 14, 2021 SLIDER, TELANGANA
503
ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగింది. కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో వాస్తవంగా 116 ఓట్లు ఉండగా.. 239 ఓట్లు పడ్డాయి. దీన్నిబట్టి ఇతర పార్టీల ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థి రాయల నాగేశ్వర రావుకు ఓటేశారని తెలుస్తోంది. అయితే టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధుకు 486 ఓట్లు రాగా.. ఆయన రాయలపై 247 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
Read More »
rameshbabu
December 14, 2021 SLIDER, TELANGANA
443
ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి పంతం నెగ్గారు. కాంగ్రెస్ అభ్యర్థికి 230 కంటే తక్కువ ఓట్లు వస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ఆయన గతంలో సవాల్ చేశారు. ఇవాల్టి కౌంటింగ్లో కాంగ్రెస్ అభ్యర్థి నిర్మలకు 238 ఓట్లు వచ్చాయి. అయితే ఈ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి యాదవ రెడ్డి 762 ఓట్లు పొంది విజయం సాధించారు.
Read More »
rameshbabu
December 14, 2021 SLIDER, TELANGANA
474
తెలంగాణ రాష్ట్రంలోని గవర్నర్ కోటాలో నామినేటెడ్ ఎమ్మెల్సీగా మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారిని ఎంపిక చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. కాగా 2018లో భూపాలపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మధుసూదనాచారి.. కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి చేతిలో ఓడిపోయారు.
Read More »
rameshbabu
December 14, 2021 MOVIES, SLIDER
557
కరోనా మహమ్మారి మళ్లీ గుబులు పుట్టిస్తుంది. సామాన్యులే కాక సెలబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు. రీసెంట్‌గా బాలీవుడ్ బేబో, స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ కి కరోనా సోకింది. కరీనాతోపాటు ఆమె స్నేహితురాలు అమృత అరోరాకి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం వారు క్వారంటైన్‌లో ఉన్నారు. కొద్ది రోజుల క్రితం లోకనాయకుడు కమల్ హాసన్ కరోనా బారిన పడి కోలుకున్నారు. తాజాగా యాక్షన్ కింగ్ అర్జున్ …
Read More »
rameshbabu
December 14, 2021 SLIDER, TELANGANA
494
కొవిడ్ వ్యాక్సినేషన్ మొదటి డొస్ 100% సాధించడంలో డాక్టర్ల కృషి మరువలేనిదని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం రోడ్లు, భవనాలు అతిథి గృహ ఆవరణలో డాక్టర్లకు అభినందన కార్యక్రమం జిల్లా కలెక్టర్ శశాంక అధ్యక్షతన మంత్రి నిర్వహించారు. మంత్రి కేక్ కట్ చేసి అధికారులకు, డాక్టర్లకు తినిపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..రాష్ట్రంలోనే మహబూబాబాద్ జిల్లా గిరిజనులు అత్యధికంగా ఉన్న ప్రాంతమన్నారు. అందులోనూ …
Read More »
rameshbabu
December 14, 2021 SLIDER, TELANGANA
701
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ.. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరుగులేని విజయం నమోదు చేసింది. అన్ని స్థానాల్లోనూ గులాబీ జెండా రెపరెపలాడింది. టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తిగా మరోసారి నిరూపితమైంది. ఈ తీర్పు విపక్షాలకు చెంపపెట్టుగా అయింది. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఊహాల్లో విహరిస్తున్నారు. తెలంగాణ సమాజం కేసీఆర్ వెంటే ఉంది అని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు.పన్నెండుకు 12 ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ …
Read More »
rameshbabu
December 14, 2021 SLIDER, TELANGANA
469
తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు విడుదలైన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరుకు ఆరు స్థానాలను అధికార టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. దీనిపై స్పందించిన మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని మరోసారి నిరూపితమైందని అన్నారు. స్థానిక సంస్థల కోటా నుంచి శాసనమండలిలోని 12 స్థానాలకు జరిగిన ఎన్నికలలో నూటికి నూరు శాతం టీఆర్ఎస్ గెల్చుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ ఎన్నికలలో ఎమ్మెల్సీలుగా ఘన …
Read More »
rameshbabu
December 14, 2021 SLIDER, TELANGANA
428
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో తిరుగులేని ఆదరణ ఉందని మరోసారి నిరూపిత మైందన్నారు. ప్రతిపక్షాల కుట్రలను స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తిప్పికొట్టారని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గతంలో ఎన్నడూ లేనంతగా స్థానిక సంస్థలు బలోపేతం కావడంతో పాటు అభివృద్ధి పరుగులు పెట్టిందని కవిత …
Read More »